June 19, 2024

మాలిక పత్రిక ఆగస్ట్ 2023 సంచికకు స్వాగతం

  మాలిక పాఠక మిత్రులకు, రచయితలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు స్వాగతం సుస్వాగతం… ఈసారి ప్రకృతి మనమీద కోపంగా ఉందా? అన్నీ అతివృష్టిగానే ఉన్నాయి. ఎండలు ఎక్కువే ఉండినాయి. ఇపుడు వానలు కూడ విజృంభించి కురుస్తున్నాయి. ఈ ఎండా వానల మధ్య ఈ రంగుల హరివిల్లు మనసులకు ఉల్లాసాన్ని ఇస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.. పాఠకులకు నచ్చే విధంగా వివిధ అంశాల మీద వివిధ రచనలు అందించడానికి మాలిక ఎప్పుడూ ప్రయత్నిస్తుంది. కథలు, కవితలు, వ్యాసాలు, కార్టూన్స్, సంగీతం, […]

‘డయాస్పోరా జీవన కథనం’ – ముళ్ళ గులాబి

రచన: కోసూరి ఉమాభారతి ‘మారుతున్న యువత దృక్పధాలకి, నాటి తరాల మనస్తత్వాలకి నడుమ సంఘర్షణే ‘ముళ్ళ గులాబి’ లోని కధాంశం’ “మమ్మీ! కరెక్ట్ గా ఆరు గంటలకి, మిల్పిటాస్ బాబా టెంపుల్ కి వచ్చేయి. నేను, మాలిని అక్కడ నిన్ను కలుస్తాము. తరువాత డిన్నర్ కి వెళదాము….సరేనా?” ఫోన్ లో కిరణ్. ఉత్సాహంగా ఉన్నాడు మావాడు. న్యూయార్క్ కాలేజీ నుండి ‘లా’ డిగ్రీ తీసుకొని, బిజినెస్ MBA చేసాడు. ఆరు నెలల క్రితమే శాంహోజే, కాలిఫోర్నియాలో ఉద్యోగంలో […]

స్వప్నాలూ , సంకల్పాలూ – సాకారాలు -1

ఒక భారతీయ ప్లాస్టిక్ సర్జన్ జీవిత చరిత్ర ఆంగ్లమూలం : డా.లక్ష్మీ సలీమ్ ఎం ఎస్. : ఏమ్ సీ ఎచ్ తెలుగు సేత : స్వాతీ శ్రీపాద 1. బాల్యం అందరి రాతలూ భగవంతుడు రాసే ఉన్నాడని అంటారు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలని అనుకున్నప్పుడు మనకు తెలియకుండానే మన శక్తి అంతా ఆ వైపుకే మళ్ళుతుంది. రసవాది పాల్ కియొహో చెప్పినట్టు “నువ్వు ఏదో ఒకటి సాధించాలని అనుకున్నప్పుడు విశ్వమంతా నీకు సహాయపడేందుకు సమాయత్తమవుతుంది […]

లోపలి ఖాళీ – బ్రహ్మపీఠం

రచన: ప్రొ. రామా చంద్రమౌళి డిసెంబర్‌ నెల. రెండవ ఆదివారం. విపరీతమైన చలి. పొద్దెక్కి ఎనిమిది గంటలౌతున్నా. అంతా పొగమంచే చిక్కగా. మనిషికి ఎదుటనున్న మనిషే కనబడ్తలేడు. ‘గీ వరంగల్‌ ల గింత పొగమంచు ఎన్నడూ లేదు. ఎవరో నగరమంతా దట్టంగా పొగను చిమ్మినట్టు. ఏందో’ అనుకుంది ఇరవై నాలుగేళ్ల నిర్మల. ఎల్లంబజార్‌ మాంసపు బజార్‌ ల. వెనుక వరుసగా కాపుడు కొట్లు. ఒకటే జనం హడావిడి. వరుసగా బజ్‌ జ్‌ జ్‌ జ్‌ మని అరుస్తున్న […]

పరవశానికి పాత(ర) కథలు – రండి! స్కిప్టు మీద కూచోండి

రచన: డా. వివేకానందమూర్తి గోపాల్: నా రాధకి ఎలా వుంది డాక్టర్ గారూ! డాక్టర్ : మిస్టర్ గోపాల్! మీరొక్కసారి నాతో అలా పక్కకి రండి. గోపాల్ : ఏం డాక్టర్! కొడతారా! నేనేం తప్పు చేశాను. డాక్టర్ : అదికాదు. నీతో రహస్యంగా మాట్లాడాలి (ఇద్దరూ కారిడార్ లోకి నడుస్తారు) డాక్టర్ : ఆమె పరిస్థితి చాలా సీరియస్ గా వుంది. గోపాల్ : ఆం! డాక్టర్ : కంగారుపడకండి. ఆపరేషన్ చేస్తే ఏ ప్రమాదం […]

ప్రాయశ్చితం – 3

రచన: గిరిజా రాణి కలవల ఇండియా నుంచి వచ్చిన ఫోన్ కాబోలు, ఆ విశ్వం అనే వ్యక్తితో … ఈయన మాట్లాడే మాటలు సురేంద్ర చెవిన పడుతున్నాయి. ఆ మాటలలో ఏదో తెలియని వ్యధ, ఆ గొంతులో బాధ తొణికిసలాడడంతో… పక్కవారి సంభాషణ వినడం తప్పు అనిపించినా కూడా, ఆసక్తితో వినసాగాడు. అటువైపు ఆ విశ్వం ఏమని అన్నారో ఏంటో కానీ, “ఏం చెప్పమంటావురా విస్సూ? చెపితే, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడినట్లేగా? ఇది అందరికీ […]

అమ్మమ్మ – 49

రచన: గిరిజ పీసపాటి అందరూ ప్రసాదం తిన్నాక, గిరిజకు రెండు స్టీల్ బాక్సులలో పులిహోర, రెండు బాక్సులలో పరమాన్నం పెట్టిచ్చి, గణేష్ గారికి ఒక బాక్స్ పులిహోర, పరమాన్నం, మిగిలిన రెండు బాక్స్ లలో ఉన్నవి స్టాఫ్ అందరికీ పంచమని చెప్పింది వసంత. లేట్ పర్మిషన్ పెట్టినప్పటికీ టైమ్ కే షాప్ కి చేరుకుంది గిరిజ. గిరిజను చూస్తూనే “హేపీ బర్త్ డే తల్లీ!” అంటూ విష్ చేసిన గణేష్ గారితో “థాంక్యూ సర్” అంటూ, తన […]

బాలమాలిక – ‘నీవే వెలుగై వ్యాపించు…’

రచన: కొంపెల్ల రామలక్ష్మి స్కూల్ వాన్ ఆగే ప్లేస్ లో తన ఫ్రెండ్ వరుణ్ కోసం ఎంతో ఆరాటంగా ఎదురు చూస్తున్న బంటీ ముఖం వికసించింది. వరుణ్ కూడా నవ్వుతూ వచ్చి బంటీ పక్కనే నిలబడగానే వ్యాన్ రావటం, వీళ్ళు ఎక్కటం, వ్యాన్ కదలటం జరిగిపోయాయి. “హాయ్ రా వరుణ్…” “హాయ్ రా బంటీ…” “నిన్న సండే కదా… ఏంట్రా, ఏం చేసావు నిన్న?” కుతూహలంగా అడిగాడు వరుణ్. “నిన్న మేము ఒక బర్త్ డే పార్టీ […]

సుందరము – సుమధురము – 4

రచన: నండూరి సుందరీ నాగమణి సుందరము సుమధురము ఈ గీతం: ‘రంగుల రాట్నం’ చిత్రంలోని ‘కలిమి నిలవదు లేమి మిగలదు’ అనే గీతాన్ని గురించి ఈ నెల వివరించాలని అనుకుంటున్నాను. వాహినీ పిక్చర్స్ వారి పతాకంపై, 1966లో విడుదలైన ఈ చిత్రానికి, బి.యన్. రెడ్డి గారు దర్శకత్వం వహించారు. అంజలీదేవి, రామ్మోహన్, వాణిశ్రీ, విజయనిర్మల, త్యాగరాజు ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం ద్వారానే చంద్రమోహన్ గారు పరిచయమయారు. వారి తొలి చిత్రం ఇది. హిందీ నటి […]

వెంటాడే కథ – 20

రచన: … చంద్రప్రతాప్ కంతేటి విపుల / చతుర పూర్వసంపాదకులు Ph: 80081 43507 నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి […]