April 20, 2024

జలజాక్షి.. మధుమే( మో) హం

రచన: గిరిజారాణి కలవల “వదినా! ఓ పంకజం వదినా!” అంటూ వీధంత గొంతేసుకుని కేకేస్తూ వచ్చింది జలజాక్షి . ఆ కేక వినపడగానే.. మళ్లీ తెల్లారిందీ దీనికి.. ఈ పూట ఏ అప్పుకోసమో…తెచ్చిన నెల వెచ్చాలు అన్నీ ఈ జలజానికి చేబదుళ్ళు ఇవ్వడానికే సరిపోతున్నాయి.. ముదురుపాకం పట్టిన బెల్లప్పచ్చులా పట్టుకుంటే వదలదు.. అని మనసులో అనుకుంటూ.. పైకి చిరునవ్వు చిలికిస్తూ..”ఏంటి ? జలజం వదినా.. పొద్దున్నే నీ దర్శనం అవందే నాకు తెల్లారదనుకో.. నీ పిలుపే నాకు […]

అమ్మమ్మ – 13

రచన: గిరిజ పీసపాటి వరలక్ష్మమ్మ గారు కోరినట్లే ఇల్లు వారికే అమ్మేసి, ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చేసి, వారు కోరిన విధంగానే వారు తనకోసం కేటాయించిన గదిలో ఉండసాగింది అమ్మమ్మ. ఆ చిన్న గదిలోనే ఒక మూల వంట, మరోమూల పడక. ఆ మాత్రం నీడైనా దొరికినందుకు చాలా సంతోషించింది అమ్మమ్మ. వారు అంత అభిమానం చూపించడానికి ఒకప్పుడు అమ్మమ్మ, తాతయ్యలు చేసిన సహాయం ఒక కారణం అయితే, చిన్నప్పటి నుండి నాగను పెంచిన […]

అమ్మ ప్రేమించింది..

రచన: రమా శాండిల్య ఉదయం మంచి నిద్రలో ఉండగా ఫోన్ రింగ్ కి మెలుకువ వచ్చి ఫోన్ వైపు చూడగా ‘ హర్ష’ అని కనిపించేసరికి ఇంత పొద్దున్నే వీడేందుకు ఫోన్ చేశాడబ్బా అని ఫోన్ తీసి ఏంటిరా నాన్నా అని కొడుకునడిగాను. “అమ్మా చెప్పేది విను”.. వాడి గొంతులో కంగారు విని పై ప్రాణం పైనే పోయింది…. “ఏమైందిరా!” అన్నా కంగారుగా.. “ఏమి లేదమ్మా కంగారుపడకు నాకు తెలిసిన అమ్మాయి ‘పూర్ణి’ సికింద్రాబాదు రైల్వే స్టేషన్లో […]

పిల్లల మనసు

రచన: లక్ష్మీ రాఘవ ‘”మమ్మీ ఈ వారం గిరిజా ఆంటీ వస్తున్నారా? కనుక్కో” హాస్టల్ నుండీ కొడుకు కౌశిక్ ఫోనులో ప్రత్యేకంగా చెప్పడం ఆశ్చర్యం వేసింది. “ఫోన్ చేసి అడుగుతాను. నేనైతే వస్తాను వీకెండ్ . నాన్న రావటానికి కుదరదు. ” “సరే మమ్మీ” ***** ఎంసెట్ కోచింగ్ వున్న రెసిడెన్షియల్ స్కూల్ ల్లో వేసాక పేరెంట్స్ శనివారం కానీ ఆదివారం కానీ వెళ్లి 2 గంటలు గడపవచ్చు. చదువు గురించీ, వాళ్ళ కంఫర్ట్ గురించీ మంచీ […]

ఎందుకోసం?.

డా.కె. మీరాబాయి అమ్మా! ఆలస్యం అయిపోతూంది తొందరగా రా “ అంటూ హడావిడి పెట్టింది అపర్ణ. “ కాస్త ముందు గుర్తు చేయవచ్చు కదా “ గబ గబ మెట్లు దిగింది రమ. శనివారం స్కూలుకు సెలవు రోజైనా వర్క్ యూనిఫాం వేసుకుని మూడు ముప్పావుకే తయారై పోయి అమ్మను తొందర పెడుతోంది అపర్ణ. చదువుతున్నది పన్నెండో తరగతి. వయసు చూస్తే పద్ధెనిమిదో సంవత్సరం నిండ లేదు. అప్పుడే స్వతంత్రంగా సంపాదించాలనే వుబలాటం ఏమిటో అర్థం కాక […]

కంభంపాటి కథలు – మాటరాని మౌనమిది

రచన: కంభంపాటి రవీంద్ర ఒరే నాన్నా .. ఎలా ఉన్నావు ? నీకు ఇదంతా ఎందుకు రాయాలనిపించిందో తర్వాత చెబుతాను .. నీ చిన్నప్పుడు తాతగారికి గుండె జబ్బు బాగా ఎక్కువయ్యి, హాస్పిటల్ లో చూపించుకోడానికి మన ఊరొచ్చేరు గుర్తుందా ? ఒక్క రోజు హాస్పిటల్ లో ఉండేసరికి ‘బాబోయ్ .. నన్ను చంపేయనైనా చంపేయండి .. గానీ ఈ ఆసుపత్రిలో ఒక్క క్షణం కూడా ఉండను ‘ అని తెగ గోల చేసేస్తే మన ఇంటికి […]

సౌందర్య భారతం

రచన: మణికుమారి గోవిందరాజుల “వేదా ఎక్కడికెళ్తున్నావే? పిన్ని వద్దని చెప్పింది కదా? మళ్ళీ అక్కడికేనా?” “అవునక్కా!” “పెద్దవాళ్ళు వద్దని చెప్పినప్పుడు వినాలి. వాళ్ళు ఏది చెప్పినా మన మంచికే కదా?” “అక్కా! నేను చేసేది కూడా మన మంచికే అక్కా! అందరమూ మనకెందుకులే అనుకుంటే ఎలా అక్కా?” “ఏమోనే! నువు చేస్తున్నది మంచికా చెడుకా అనేది కాదు. కాని వద్దన్నప్పుడు చేయడం ఎందుకు?” అడుగుతున్న కీర్తనను జాలిగా చూసింది వేద. “అక్కా నీకొకటి చూపిస్తాను రా…” అని […]

భిన్నధృవాలు

రచన: మంథా భానుమతి “ఈ సంగతి తెలుసా? సుబ్బన్న భార్య సీత, సుబ్బన్నని విదిలేసిందిట!” కాఫీ కలుపుతున్న సరోజ వెనక్కి తిరిగి అలా నిర్ఘాంతపోయి ఉండిపోయింది రమ మాటలు విని. “ముందా కాఫీ సంగచ్చూడు తల్లీ! సుబ్బన్న ఎక్కడికీ పోడు కానీ..” రమ హెచ్చరించింది. సరోజ, రమ ఆరో క్లాసు నుంచీ డిగ్రీ అయే వరకూ కలిసి చదువుకున్నారు. పెళ్లిళ్లు అయాక కూడా ఒకే ఊరిలో ఉండటంతో నిరాటంకంగా సాగుతోంది వారి స్నేహం. వారానికొక సారైనా కలిసి […]

తపస్సు – అరాచక స్వగతం ఒకటి

రచన: రామా చంద్రమౌళి ఫిల్టర్‌ కాగితంలోనుండి చిక్కని తైలద్రవం ఒకటి .. ఎంతకూ జారదు , స్థిరంగా నిలవదు కల .. ఒక ఎండాకాలపు ఎడారి ఉప్పెన అవినీతి వ్రేళ్లను వెదుక్కుంటూ .. తవ్వుకుంటూ తవ్వుకుంటూ ఎక్కడో భూగర్భాంతరాళాల్లోకి అభిక్రమిస్తున్నపుడు అన్నీ సుప్రీం కోర్ట్‌ ‘ సైలెన్స్‌ సైలెన్స్‌ ’ కర్రసుత్తి రోదనూ , విజిల్‌ బ్లోయర్స్‌ .. శబ్ద విస్ఫోటనలే ఈ దేశపు ప్రథమ పౌరుని గురించి సరేగాని అసలు ‘ అథమ ’ పౌరుడు […]

అక్షరాలే ఊపిరిగా రూపుదిద్దుకున్న కవితాస్ఫూర్తి

రచన: సి. ఉమాదేవి అక్షరమంటే ఉన్న ఆర్తిని, ఆప్యాయతను తన కవితలలో ప్రతి పదములోను ప్రతిఫలిస్తూ కవితలు, హైకూలు, రవీంద్రనాథ్ టాగూర్ గీతాంజలికి అనువాదంవంటి ఎన్నో రచనలు తనదైన శైలిలో రచించి మనకందించారు డా. పి. విజయలక్ష్మీ పండిట్. జపాన్ దేశంలో పురుడుపోసుకున్న హైకూలు నేడు ప్రపంచమంతా చక్కటి హైకూలుగా రచింపబడి అందరినీ అలరిస్తున్నాయి. విశ్వపుత్రిక హైకూలుగా రచింపబడిన సంపుటిలో సాంఘిక, సామాజిక అంశాలను తన హైకూలలో పొందుపరచి అనంతార్థాన్ని అందించడం ముదావహం. కళలు, కవితలు కవిహృదయాలను […]