March 29, 2024

‘ధ్యానం’ అంటే ఏమిటి?

రచన: శారదా ప్రసాద్ ఈ మధ్య కొంతమంది మిత్రులు ‘నేను ఫలానా విధంగా ద్యానం చేస్తున్నాను, అది మంచిదేనా అనో లేకపోతే అటువంటి ధ్యానాన్ని ఏమంటారని ‘ఇలాగా చాలా మంచి ప్రశ్నలు అడుగుతున్నారు. అసలు ‘ధ్యానం’ అంటే ఏమిటో తెలుసు కోవటానికి ప్రయత్నం చేద్దాం. నేను ఈ మధ్య, చాలా ఊళ్ళల్లో, పెద్ద పెద్ద బానర్లు కట్టి, ‘ మీ ఆరోగ్యం కోసం, మీ పిల్లల భవిష్యత్ కోసం, మీ వ్యాపారాభివృద్ధి కోసం నేర్చుకోండి సిద్ధ సమాధి […]

చీకటి మూసిన ఏకాంతం – 7

రచన: మన్నెం శారద నవనీతరావు కారేసుకొని సాగర్ ఇంటికొచ్చేడు. సాగర్ ఆయన్ని చూసి “రండి రండి. కబురు చేస్తే నేనే వచ్చేవాణ్ణిగా!” అన్నాడు ఆదరంగా ఆహ్వానిస్తూ. “అంత పనేం లేదులే. ఊరికే చూసి పోదామని వచ్చేను‌. ఎలా వున్నావు?” అనడిగేడాయన కూర్చుంటూ. “బాగానే వున్నాను సర్! ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను. మొన్న మదర్ అండ్ ఛెయిల్డ్ ఆస్పత్రిలో ఇంటర్వ్యూ వస్తే వెళ్ళొచ్చేను.” “నిశాంత జాబ్ చేయడం లేదా?” “తెలీదు. నే వెళ్ళలేదు. ఈమధ్య మా ఇంటికోసారి […]

“కళ్యాణ వైభోగమే”

రచన: రాము కోల “పెళ్ళి కుదిరింది అనుకోగానే సరిపోయిందా..రూపాయి ఎంత త్వరగా ఖర్చు అవుతుందో కూడా లెక్కేసుకోవాలి.” “ఎమంటావు మావా!” అంటూ నోట్లో ఉన్న పుగాకు కాడ నవులుతు.. పక్కనే ఉన్న గొపయ్య. వైపు చూశాడు చిదానందం. “ఓసోసి! ఊరుకోవోయ్.. పెళ్లి కుదరటమే మా గొప్ప సంగతి. ఇక రూపాయంటావా? మనందరం లేమా ఏటి, తలా ఓ చెయ్య వేస్తే పిల్లకూడా ఓ ఇంటిది అయిపోద్ది. ” “నువ్వు ఏటి దిగులు పడమాక” అంటూ దైర్యం చెపుతున్న […]

నాకూ!! కూతురుంది….

రచన: సుధ ఆత్రేయ అప్పుడే కోచింగ్ సెంటర్ నుండి వచ్చిన నాకు, నీకు ఈ రోజు సాయంత్రం పెళ్లి చూపులు అని హఠాత్తుగా చెప్పింది అమ్మ. “ఇంత హఠాత్తుగానా అమ్మ!!” అంటే “అవును నా బంగారం!! శాపమో వరమో నాకు తెలీదు కానీ ప్రతి ఆడపిల్ల పుట్టింటిని వదిలి వెళ్లవలసిందే. బహుశా తానెక్కడ ఉన్న దానిని నందనవనంగా మార్చుకోవడం ఒక స్త్రీకి మాత్రమే తెలుసు కాబోలు అందుకేనేమో. అబ్బాయి పేరు మదన్. శ్రీహరికోటలో సైంటిస్ట్ గా పని […]

కొలీగ్

రచన: రామశేషు “రాధా, ఆఫీస్ టైం అవుతోంది. త్వరగా రా.” నవీన్ పిలుపు కి “ఇదిగో, వస్తున్నా.” అని జవాబు చెప్తూనే గబగబా ఇంటికి తాళం వేసి మెట్లు దిగింది రాధ. వెంటనే స్కూటర్ తీసి పోనిచ్చాడు నవీన్. నవీన్ రాధని ఆఫీస్లో దిగబెట్టి తన ఆఫీసు కి వెళతాడు. ఇద్దరివీ ఒకే టైమింగ్స్ కావడం కూడా బాగా కలిసివచ్చింది. వెళ్ళేటప్పుడు కూడా తనే పికప్ చేసుకుని వెళ్తాడు. రోజులేవో సాఫీగా వెళ్తున్నాయి అనేసరికి నవీన్ కి […]

ఇది కథ కాదు

రచన: రాజశేఖర్ “నీ కథలో కంగారుందోయ్ రాంబాబు!” అన్నారు జోగిశాస్త్రిగారు చిరునవ్వుతో, పడకకుర్చీలో వెనుకకు జారపడుతూ. మీ టూత్పేస్ట్లో ఉప్పుందోయ్ అన్నట్టుగా కథలో కంగారేమిటో బోధపడలేదు రాంబాబుకి. తలగోక్కుంటూ “ఆయ్” అన్నాడు అయోమయంగా. ****** మొన్నామధ్యన ఆఫీసుపనిమీద కాకినాడ నుంచి విజయవాడ శేషాద్రిలో కిటికీకి పక్కసీటులో కూర్చుని వెళ్తోంటే ఆ కనిపించే పచ్చని పంటపొలాలు, చెరుకులారీలు, పూరిగుడిసెలు, కరెంటుస్తంభాల మీద కావుమనకుండా ఉన్న కాకులని చూసి భావుకత పెల్లుబుకి సమాజానికి తనవంతు సాయం చేయాలని అర్జెంటుగా నిర్ణయించుకొని.. […]

తల్లి మనసు

రచన: నళిని ఎర్ర పచ్చని మావిడి తోరణాలు కట్టిన గుమ్మంలోకి భర్త చిటికెనవేలు పట్టుకుని అత్తవారింటికి వచ్చిన సావిత్రి గడప లోపలికి అడుగుపెట్ట బోయింది .. వదినా అన్నయ్య పేరు చెప్పి వెళ్ళు అంటూ వరసకు ఆడపడుచులు అంటుంటే వర్థనమ్మ విసుక్కున్నారు చాల్లే సంబడం అవన్నీ అవసరమా పదండి లోపలికి అంటూ కసురుకున్నారు.. ఒక్కసారి ఉలికిపడింది సావిత్రి రామారావు చేయి గట్టిగా పట్టుకుని లోపలికి అడుగు పెట్టింది.. ఆరోజు మొదలు సావిత్రి రోజుకు పది సార్లు ఉలికి […]

అమ్మ మనసు

రచన: కె. మీరాబాయి ( తంగిరాల. మీరాసుబ్రహ్మణ్యం ) శస్త్ర చికిత్స జరిగే గదిలో బల్ల మీద పడుకుని ఉన్నాడు చక్రపాణి. “ చక్రపాణీ! సిద్ధంగా ఉన్నారు కదా? మనసులో ఏ ఆలోచనలు పెట్టుకోకుండా విశ్రాంతిగా ఉండండి. నిజంగా నా జీవితంలో ఈ రోజు ఒక గొప్ప అద్భుతాన్ని చూసాను చక్రపాణీ! ఈ కాలంలో తాము జీవితంలో పైకి వచ్చి, నిలదొక్కుకున్నాక, తమకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం వాళ్ళ బ్రతుకులను ధారపోసిన తలిదండ్రులను పాత సామాను […]

ప్రపోజ్…

రచన: మణి గోవిందరాజుల— “ఛీ! నా జీవితం” అప్పటికి వందోసారి తిట్టుకున్నాడు విశాల్. తనని ఆ పరిస్థితుల్లోకి నెట్టిన ఫ్రెండ్ మీద పిచ్చి కోపం వచ్చింది. “యేమయిందిరా?” కొడుక్కి టీ ఇస్తూ అడిగింది వాళ్ళమ్మ భారతి. “ఈ కక్కుర్తి గాడేమి చేసాడో తెలుసా?” “వాడేమి చేసాడ్రా?మళ్ళీ పెళ్ళి కుదిరింది కదా?” “ఆ! మళ్ళీ మళ్ళీ కుదిరింది” “మళ్ళీ మళ్లీ కుదరడమేంట్రా? ఆ మధ్య ఒకటి చెడిపోయింది కదా? అప్పుడూ ఇంటి కొచ్చినప్పుడు చెప్పాడు. ఆ తర్వాత ఇంకోటి […]

ప్రయాణం

రచన – డా. లక్ష్మి రాఘవ ప్రైవేటు బస్సులో నైనా టికెట్ దొరుకుతుందా అని ఉరుకులూ పరుగులుగా వచ్చిన సీతాపతికి బస్సులో టికెట్ దొరకడంతో ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. కానీ సీటు లాస్ట్ లో వుండటం చిరాకనిపించింది. వెనకవైపు కూర్చుంటే బాగా ఎగరవేస్తూ వుంటుంది. రాత్రికి నిద్రపోవటం కూడా వుండదు. పోనీ అదైనా దొరికింది కదా అనుకుని సీటులో కూర్చున్నాడు. మనసంతా చికాగ్గావుంది. భార్య సీతతో తను తండ్రికోసం వూరికి వెళ్ళాలన్న ప్రతిసారీ గొడవే…”మీరొక్కరే కొడుకు కాదు. […]