April 24, 2024

వెంటాడే కథ – 18 పేదవాడు మనసు

రచన: … చంద్రప్రతాప్ కంతేటి విపుల / చతుర పూర్వసంపాదకులు Ph: 80081 43507 నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో… రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి […]

మాలిక పత్రిక జూన్ 2023 సంచికకు స్వాగతం

మాలిక పత్రిక పాఠకులు, రచయితలు , మిత్రులందరికీ జూన్ సంచికకు స్వాగతం. మండే ఎండలు, మల్లెపూలు, మామిడి పళ్లకు ఇక చివరి రోజులు వచ్చాయేమో.  ఇంకొద్ది రోజులలో చల్లని వానలు వస్తాయని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎవరు వచ్చినా, ఎవరు పోయినా ఈ కాలగమనం తన దారిన తానూ పోతూనే ఉంటుంది. మనను కూడా నడిపించుకుంటూ వెళ్తుంది. మార్పు తప్పదు. మీ అందరిని అలరిస్తున్న కథలు, కవితలు, వ్యాసాలూ, సీరియల్స్ తో మరోసారి మీ ముందుకు వచ్చింది […]

ప్రాయశ్చితం – 1 (నవల)

రచన: గిరిజారాణి కలవల అమెరికాలోని సియాటిల్ నగరం. అది ఎండాకాలం. రాత్రి ఎనిమిది అయినా కూడా ఇంకా సూర్యాస్తమయం అవలేదు. అదే మనకైతే ఇండియాలో సాయంత్రం ఏ ఐదు గంటలో అయినట్టు వుంటుంది. చీకట్లు ముసురుకోవడానికి మరో అరగంటైనా పడుతుంది. అక్కడ ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ మేనేజర్ సురేంద్ర. ఇంటి నుండే ఆఫీసు పని చూసుకుంటూ వుంటాడు. ఆ రోజుకి చేయాల్సిన పని పూర్తయినట్లే. సిస్టమ్ షట్ డౌన్ చేసి, బద్ధకంగా వళ్ళు విరుచుకుని, […]

అమ్మమ్మ – 47

రచన: గిరిజ పీసపాటి వేసవి కాలం కావడంతో పగలు పెద్దగా కస్టమర్ల తాకిడి ఉండకపోవడంతో ఖాళీగా ఉన్న గిరిజ, తనతో పాటు కనిపిస్తున్న మరో ఆడ ప్రాణిని కుతూహలంగా చూడసాగింది. ఆ అమ్మాయి కూడా మధ్యమధ్యలో గిరిజను చూసినా, బాస్ తననే చూస్తూ ఉండడంతో తల తిప్పేసుకుంటోంది. మధ్యాహ్నం భోజన సమయానికి ఇంటికి వెళ్ళడానికి సీట్లోంచి లేచి, బాస్ దగ్గరకు వెళ్ళి “సర్! భోజనానికి వెళ్ళొస్తాను” అని చెప్పింది గిరిజ. ఆయన “ఒక్క నిముషం ఉండండి మేడమ్!” […]

లోపలి ఖాళీ – మాతృక

రచన: రామా చంద్రమౌళి ‘‘ హౌ ఓల్డ్‌ యు ఆర్‌ ’’ అని ప్రశ్న. ‘‘ ఐయాం సిక్స్టీ వన్‌ ఇయర్స్‌ ఓల్డ్‌ ’’ అని ఆమె జవాబు. ఔను. మనుషులు పాతబడిపోతూంటారు. అసలు ఈ పాతబడిపోవడమేమిటి. అరవై ఒక్క ఏండ్లు ఎప్పటినుండి. పుట్టిననాటినుండే కదా. మనిషి పుట్టుక ఒక డేటం లైన్‌. ఆరిజిన్‌. మూల బిందువు. ఇక అక్కడినుండి లెక్క. వన్‌ డే ఓల్డ్‌. టు డేస్‌ ఓల్డ్‌. వన్‌ ఇయర్‌ ఓల్డ్‌. వన్‌ సెంచరీ […]

పరవశానికి పాత(ర) కథలు – గుంపులో గోవిందా

రచన: డా. వివేకానందమూర్తి విసిరేసిన చెప్పులు సగం తిని విసిరేసిన నిలవ చపాతీముక్కల్లా కనిపిస్తున్నాయి. వాటి వేపు గోవిందయ్య కృతజ్ఞతాపూర్వకంగా చూశారు. తన కూతురి పెళ్ళికోసం అవి తమ శరీరాల్ని ధారపోసి శ్రమించాయి. నాలుగో పిల్ల నాగరత్నం పెళ్ళికోసం గోవిందయ్య ఆ చెప్పులు తొడుక్కుని నాలుగేళ్ళు తిరిగేడు. తను పూర్తిగా అలిసిపోయి, అవి పూర్తిగా అరిగిపోయేదాకా పిల్ల పెళ్ళి నిశ్చయం కాలేదు. యిన్నాళ్ళకి సంబంధం కుదిరింది. యివాళే ముహూర్తం. యింటి దగ్గర కళ్యాణశోభ అంతా ఏర్పాటైపోయింది. యిప్పుడిక […]

మెచ్చుకోలు

రచన: లావణ్య బుద్ధవరపు మనం చేసే పని ఎంత చిన్నదైనా పెద్దదైనా, దానికి ఫలితం ఎంత చిన్నదైనా కూడా ప్రతి అంశంలోనూ మెచ్చుకోలు ఆశించడం సహజ మానవ నైజం. ఇది పుట్టుకతోనే వస్తుంది. సాధారణంగా పిల్లలు నడక మొదలు పెట్టడం, మాటలు పలకడం, రకరకాల విన్యాసాలు చేయడం లాంటివి తల్లిదండ్రులుగా చూస్తూ మనం మురిసిపోతూ వారిని ప్రేమమీరా ముద్దుల్లో ముంచెత్తిస్తాం. అది వాళ్ళు మరింత ఉత్సాహంగా ఇంకా ఎక్కువగా ఆ పనులను చేయడానికి పురిగొల్పుతుంది. అది మరి […]

జీవన వేదం 10

రచన స్వాతీ శ్రీపాద వెనక్కు తిరిగి చూసుకుంటే నడిచి వచ్చిన దారి పూలబాట కాదు. చక్కగా పరచిన రహదారీ కాదు. డిగ్రీ పూర్తయినా చదువు ఆగలేదు, అదే ఊపులో ఆపాటికే నేర్చుకున్న ఇంగ్లీష్ భాషమీద వ్యామోహంతో ఎమ్. ఏ కూడా ప్రైవేట్ గానే పూర్తి చేసింది. సజావుగా సాగుతున్న జీవితంలో ఈవెంట్ మానేజర్ గా సీత మానేజ్ మెంట్ దారిలో రవికిరణ్ అత్యున్నత స్థాయికి వెళ్ళినా, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా పిల్లలు లేకపోవడం ఎవరూ తీర్చే లోటు […]

పాపం ఆనందరావు

రచన: మోహనరావు MNAR ఆనందరావు ఉషారుగా ఆఫీసులోకి ప్రవేశించి తిన్నగా మేనేజరుగారి రూము తలుపు తోసుకొని లోపలకెళ్ళి “గుడ్మార్నింగ్ సార్! మీకో సెన్సేషసల్ న్యూస్” అని తల పైకెత్తి చూసి, స్టన్నయిపోయాడు. అక్కడ కొత్త మేనేజరుగారు స్టెనోకి ఏదో డిక్టేటు చేస్తున్నారు. ఆయన తలపైకెత్తి ఆనందరావుని చూసారు. “ఆయన మన ఆఫీసు సీనియర్ సార్” అని పరిచయం చేసింది స్టెనో. “నమస్తే సార్” అన్నాడు ఆనందరావు మెల్లగా. “మిష్టర్ ఆనందరావుగారు ఇదిగో ఈ పేపరు మీద ఈ […]