March 29, 2024

తస్మై శ్రీ గురవైనమః

రచన: విశాలి పేరి తస్మై శ్రీ గురవైనమః   गुरू गोविन्द दोऊ खड़े, काके लागूं पांय। बलिहारी गुरू अपने गोविन्द दियो बताय।। ‘గురువు,  భగవంతుడు ఎదురుగా నిలిస్తే నేను నమస్కరించేది మొదట గురువుకే, ఎందుకంటే ఆ భగవంతుడు ఉన్నాడని చెప్పింది నా గురువే కదా!’ అని కబీర్ దాస్ అన్నాడు.  ఈ రోజు విద్యార్థులు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా ఆ చదువుకు బీజం వేసి దాని మీద ఆసక్తి కలగడానికి […]

అర్చన కనిపించుటలేదు – 4

రచన: కర్లపాలెం హనుమంతరావు ‘ఇప్పుడు నాకు కావాల్సింది కాఫీలు, టీలు కాదురా రఘూ! ఒక చెడ్డ డాక్టర్. ‘ అంది అర్చన కాఫీ తాగుతూ. ‘డాక్టర్ రాంప్రసాద్ అంత చెడ్డ డాక్టర్ ఈ సిటీ మొత్తంలోనే లేడంటారు తోటి డాక్టర్లు. పేషెంట్ల దగ్గర అతను తీసుకొనే ఫీజు ఐదు, పది రూపాయలే! ‘ ‘నాకు కావాల్సింది నిజం చెడ్డ డాక్టర్. ప్లీజ్ ! నా కడుపులోని బేబీని నిర్దాక్షిణ్యంగా చంపగలిగే కిరాతక డాక్టర్ !’ రఘు అమాంతం […]

స్మార్ట్ వర్క్

రచన: కవిత బేతి “అరేయి నితిన్, ఇక్కడున్నావేంటి? అందరూ నీకోసం వెతుకుతున్నారు” ఆఫీస్ కాఫ్టేరియాలోని బాల్కనీలో నిలుచుని బయటకి చూస్తున్న నితిన్ దగ్గరగా వస్తూ అన్నాడు శశాంక్. “నీ ఫోన్ కూడా అక్కడే వదిలేసి వచ్చావ్. బాస్ మూడుసార్లు అడిగాడట. ఇదుగో నీ ఫోన్, కాల్ చేసి వస్తున్నానని చెప్పు” అని ఫోన్ అందియబోయాడు. ఒకే ఆఫీస్‌లో పనిచేసే నితిన్, శశాంక్ ఇద్దరూ, మంచి స్నేహితులు. నితిన్ కనీసం వెనకకి తిరిగి చూడకుండా నింపాదిగా జేబులోంచి సిగరెట్ […]

ఒంటరివైపోయావా??

రచన:- లావణ్య బుద్ధవరపు ఇప్పుడు కొత్తగా ఏదీ జరగలేదు. కానీ చాలా వెలితిగా ఉంది. విపరీతమైన ఒంటరితనం. ఎన్నో ఏళ్లుగా పరుగులు పరుగులు తీస్తూ, ఏదో సాధించెయ్యాలి అని అనుక్షణం తపన పడుతూ, కింద పడుతూ లేస్తూ, ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయి గడిపేకా, ఎందుకో ఈ సాయంత్రం చాలా గుబులుగా, అన్నీ పోయేయేమో అనే దిగులుగా, విపరీతమైన శూన్యం ఆవహించి ఎడతెగని కన్నీటి ధారలు ఆపినా ఆగనంటూ మరింత కలవరపెడుతున్నాయి. అన్ని పనులూ అలాగే నడుస్తున్నాయి. […]

అమ్మమ్మ – 45

రచన: గిరిజ పీసపాటి రాత్రి షాప్ నుండి ఉత్సాహంగా ఇంటికి వచ్చిన గిరిజ, తనకోసమే ఆతృతగా ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులందరికీ షాప్ సంగతులన్నీ పూసగుచ్చినట్లు వివరించి “అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే, ఇదివరకు బిల్స్ రాసే ఆవిడ తిరిగి వచ్చేవరకే నాకీ ఉద్యోగం ఉంటుంది.” “ఆవిడ తమిళియన్ కావడంతో మద్రాస్ (ఇప్పుడు చెన్నై) వెళ్ళిందట. రెండు మూడు నెలల్లో ఆవిడ వచ్చేస్తుంది. తరువాత మళ్ళీ ఇంకో ఉద్యోగం వెతుక్కోవాలి” అంది కొంచెం దిగులుగా. “ఏం పరవాలేదు గిరీ! […]

ఏది శాశ్వతం?

రచన : తాతా కామేశ్వరి శారద తన ఇంట్లో బీరువాలు, షోకేసులలో ఉన్న వస్తువులను రెండు చేతులతో పట్టుకొని విరక్తిగా వాటికి తనకి ఉన్న బంధం తీరిపోయింది అని మనసులో అనుకుంటు వాటిని అటు ఇటు తిప్పి చూసి మళ్ళీ చక్కగా తీసిన చోటే పెట్టసాగింది. ఆమెను చూస్తే ఆమె మనసులో ఎంత విరక్తి చెంది ఉందో అర్థం అవుతుంది. అవి ఆమెకి చాలా ఇష్టమైన వస్తువులు అయినా కూడా ఆమెకు ఇపుడు వాటి మీద ఏ […]

గోపమ్మ కథ – 7

రచన: గిరిజారాణి కలవల లక్ష్మి, కోటి కాపురం … ఇక వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. మూడు పురుడులు పోసి … తన బాధ్యత తీర్చుకుంది గోపమ్మ. మరో పక్క… కొడుకు పిల్లలు పెద్దవుతున్నారు. కొడుకు, కోడలు, మనవలు అంటూ మళ్ళీ మొదలెట్టింది. చిలక్కి చెప్పినట్లు చెప్పాను. ‘పెళ్ళి చేసావు. వాడికీ పెళ్ళాం, పిల్లల బాధ్యతలు తెలియనియ్యి. తల్లి కోడిలాగా, నీ రెక్కల కిందే ఎన్నాళ్ళు చేస్తావు? నీకూ రెక్కల శ్రమ ఎక్కువ అవుతుంది.’ వింటే కదూ! […]

పరవశానికి పాత(ర) కథలు – ఊరకే రాకోయి అతిధీ!

రచన: డా. వివేకానందమూర్తి రోజూలాగే నేను రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో యిల్లు చేరాను. రోజూ ఆ టైముకి పిల్లల్ని పడుకోబెట్టి, పెద్ద లైట్లన్నీ ఆర్పేసి మా శ్రీమతి నా కోసం ఎదురుచూస్తూ వుంటుంది. కానీ ఇవాళ మాత్రం ముందుగదిలో పెద్దలైటు ఇంకా వెలుగుతోంది. తలుపులు కూడా తెరచివున్నాయి. ఎవరా! అని ఆలోచిస్తూ గదిలోకి ప్రవేశించాను. గదిలో ఒక పక్క మంచం మిద దాదాపు నలభై అయిదేళ్ళ ఆసామి ఒకాయన గురక పెట్టి గాఢంగా నిద్రోతున్నాడు. నేను హైదరాబాదులో […]

వెంటాడే కథ – 17

రచన: … చంద్రప్రతాప్ కంతేటి విపుల / చతుర పూర్వసంపాదకులు Ph: 80081 43507 నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో… రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి […]

విరించినై విరచించితిని – అడివి గీత

రచన: ఉంగుటూరి శ్రీలక్ష్మి ఢిల్లీ వారిని ఆకట్టుకున్న తెలుగు కళాకారిణి గీతారావ్ కొందరిలో సహజంగా లలితకళలు వెల్లివిరుస్తూ ఉంటాయి. ఈ పాట ఎవరు నేర్పారు? ఈ నటనకి మార్గదర్శకులెవరు? ఈ కవిత ఎవరు రాయించారు అని ఆశ్చర్యపోనక్కరలేదు. గాలికి కదలిక ఎంత సహజమో, వెన్నెలకి చల్లదనం ఎంత సహజమో, అంత సహజంగా వారిలో కళాప్రతిభ బయటపడుతుంది. అలాంటి వ్యక్తుల కోవకు చెందిన ధీరవనిత అడివి గీత. నేనూ, శ్రీలక్ష్మీ గీత వాళ్ళ గుమ్మంలోకి అడుగుపెట్టగానే ‘రండి, రండి’ […]