March 29, 2024

తాత్పర్యం – ప్రమేయం (ఒక కథ … మూడు ముగింపులు)

రచన: రామా చంద్రమౌళి అదృష్టం. అంటే దృష్టము కానిది. అంటే కనబడనిది . ఏమిటి కనబడనిది.? ఏదైనా. నేటికి రేపు. కనబడనిది. వర్తమానానికి భవిష్యత్తు కనబడనిది. మనిషికి మనసు. కనబడనిది. కళ్ళకు గాలి కనబడనిది. అసలు మున్ముందు జరుగబోయే జీవితం ఏమిటో. అస్సలే కనబడనిది. ఒక స్త్రీ, పురుషుడి జీవితంలో ‘ పెళ్ళి చూపులు ‘ అనే ప్రహసనం ఎంత పెద్ద జోకో అనుకుంది లీల. వెంటనే అమ్మ జ్ఞాపక మొచ్చిందామెకు. తనను పెళ్ళి చూపులకు అలంకరించి […]

జీవనవేదం – 4

రచన: స్వాతీ శ్రీపాద “నాగరత్నం మా అమ్మ.” అంటూ లేచి పారిజాతం “మా అమ్మ లోకం తెలిసిన మనిషి కాదు. మేనత్త దగ్గర ఒద్దికగానే పెరిగినా లోకం పోకడ అసలు తెలియదు. భర్తే ప్రపంచం అనుకుంది. పెళ్ళైన ఆరునెలలకే మేనత్త కాలం చేసినా వెళ్ళి చూసే అనుమతి కూడా దొరకలేదు. మేనత్త మైల మూడు రోజులతో సరి – అంటూ ఇంటిపనులన్నీ చేయించారట దుఃఖంలో ఉన్న అమ్మతో. ఇహ నాన్న సంగతి సరేసరి. పదిళ్లపూజారి. ఏ రోజునా […]

పరవశానికి పాత(ర)కథలు – ఓవర్ నటేశన్

రచన: డా. వివేకానందమూర్తి “కాస్త చూసి నడువికా!” అన్నాడు బేతాళుడు. విక్రమార్కుడు ఆగి బేతాళుడి కేసి కోపంగా చూశాడు. “అపార్థం చేసుకోకు మార్కా! అసలే మనం నడిచేది హైదరాబాదులో చిక్కడపల్లి రోడ్డు. అదీగాక ఎదురుగా వచ్చేది ఎవరోకాదు ఆర్. టి. సి. బస్సు, దానికి యన్టీరామారావైనా ఒకటే. ఎక్స్ ట్రా నటుడైనా ఒకటే”. విక్రమార్కుడు ఒకసారి రోడ్డంతా కలయజూశాడు. ఆవాళే రిలీజయిన చిత్రం మొదటి ఆట అప్పుడే వదిలినట్టుంది. రోడ్డు. నడక వేగం తగ్గించి జాగ్రత్త పడ్డాడు. […]

మంచుపూల వాన

రచన: రమాదేవి బాలబోయిన “శారదక్కా! ఈరోజు మీరు ఆ భోజనాల ఆటోతో రోడ్ నెంబర్ 13 లోని రాజనందనం అపార్ట్మెంట్స్ కి వెళ్ళి ఫుడ్ డెలివరీ చేయండి” అంది జ్యోతి మధ్యవయస్కురాలైన ఓ స్త్రీ వైపు చూస్తూ. “అలాగేలేమ్మా” అని తలూపుతూ…ఇక తప్పుతుందా అన్నట్లుగా మొహం తిప్పుకుని కౌంటర్ మీద ఉన్న ఐడెంటిటీ కార్డ్ మెడలో వేసుకుంది శారద. మళ్ళీ ఏదో గుర్తొచ్చిన దానిలా…”ఆహ్… అక్కా! వాళ్ళు మనకు పదహారు వేల మూడొందల రూపాయలు ఇస్తారు. ఈ […]

నమ్మక ద్రోహం

రచన: లక్ష్మీ ఏలూరి “ఓయ్…! హనుమంతురావు… నీకు మన బాస్ ఏమన్నా చెప్పారా!?అని మల్లేష్ అడిగాడు. “ఆ… చెప్పారు, మనం ఆఫీసులో కొన్ని పోస్ట్ లకు ఇంటర్వూ లు జరుగుతాయని, వాటికి అప్లై చేయమన్నారు. దాని కొరకు ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ కి వెళ్లి సీనియారిటీ లెటర్ తెచ్చి అప్లికేషన్ నింపి సబ్మిట్ చేయమన్నారు”అని హనుమంత రావు చెప్పాడు. “నాకు కూడా అదే చెప్పారు, నేను వెళ్లి మన ఇద్దరి సీనియారిటీ లెటర్స్ తెస్తాను లే” అని మల్లేష్ […]

పునర్జన్మ

రచన: G.S.S. కళ్యాణి సమయం సాయంత్రం మూడు గంటలు కావస్తోంది. నగరంలోని ఒక ప్రఖ్యాత కార్పొరేట్ ఆసుపత్రిలో మంచంపై పడుకుని ఉన్న ప్రసాదరావుకి మెల్లిగా స్పృహ వస్తోంది. అలా ఎన్ని గంటలు పడుకున్నాడో తెలియదు, కానీ తన భార్య కళావతి తనున్న గది బయట నిలబడి ఎరితోనో మాట్లాడుతూ ఉంటే, అస్పష్టంగా వినపడుతున్న ఆ మాటలను వినడానికి ప్రయత్నించాడు ప్రసాదరావు. “డాక్టరుగారూ! మావారిని బ్రతికించుకునే మార్గమే లేదంటారా? ప్లీజ్ డాక్టర్!! మీరే ఏదో ఒక మార్గం చూపించి […]

భగవంతుని స్వరూపం

రచన: సి. హెచ్. ప్రతాప్ ఒక చిత్రకారుడు మంచి మంచి చిత్రాలను గీస్తూ ప్రజలలో మంచి పేరు ప్రతిష్టలు, కీర్తిని సంపాదించుకున్నాడు. కానీ అవేమీ అతనికి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. ద్వారకలో వున్న శ్రీకృష్ణుడు నగరంలోని కవులను, కళాకారులను పిలిచి ఘనంగా సత్కరిస్తున్నారని అతనికి తెలిసింది. ఎలాగైనా తన ప్రతిభ శ్రీ కృష్ణుని ముందు ప్రదర్శించి శ్రీకృష్ణుడి నుండి కూడా ఆమోదం పొందాలని అతను ధృఢంగా నిర్ణయించుకున్నాడు. ఒక శుభముహూర్తాన ఆ చిత్రకారుడు ద్వారక వెళ్ళి శ్రీ కృష్ణుడి […]

విషాదాన్ని విస్మరించు..!

రచన: ధరిత్రి ఎమ్ జీవితం ఓ పయనం ఎత్తు పల్లాలు దాటుతూ సాగే గమనం రాత్రి… పగలు.. అనివార్యం ఆగమనం.. నిష్క్రమణ.. ఆగమనం.. నిష్క్రమణ.. ! నిరంతర భ్రమణం ! చీకటీ.. వెలుగూ .. అంతే కదా ! మరెందుకీ వేదన ! రాత్రి లేక పగటికీ కష్టం లేక సుఖానికీ ఉన్నదా విలువ ! రెండింటి సమాహారమే బ్రతుకన్నది… పచ్చి నిజం ! అలా సాగితేనే కద… జన్మ సార్థకం !! అందుకే… నేస్తమా… చీకటికి […]