March 28, 2024

శ్రీగణేశ చరిత్ర

రచన: నాగమంజరి గుమ్మా 101 ముల్లోకమ్ముల జనులకు కల్లోలము సేయుచున్న కర్కశ దనుజుల్ ఉల్లము దలచిన కదిలెడు ఇల్లులు గట్టుకు తిరుగుచు నిడుముల పెట్టెన్ భావం: మూడు లోకాలలో ఉన్న ప్రజలను బాధలు పెడుతున్న రాక్షసులు మనసులో తలచుకోగానే కదిలే ఇళ్లు కట్టుకుని నానా కష్టాలు పెడుతున్నారట. (త్రిపురాసురుల వృత్తాంతం) 102 వ పద్యం అసురుల బాధల కోర్వక వెసవెస వేల్పులు కదిలిరి వెన్నుని కొలువన్ అసురుల కిచ్చిన వరములె లసకమ్మౌ సమయమిదని లచ్చిమగడనెన్ భావం: రాక్షసుల […]

దేవశర్మ పత్ని- రుచి

రచన: శ్యామసుందర రావు ఈ కధను భీష్ముడు అంపశయ్య మీద ఉండగా తన దగ్గరకు వచ్చిన ధర్మరాజుకు అనేక నీటి సూత్రాలు , ధర్మబోధ చేస్తూ చెపుతాడు. ఆడవాళ్ల కోసము యుద్దాలు జరగటం అనేది చరిత్రలో సర్వసాధారణంగా జరిగేదే మనము ఎప్పటి నుంచో వింటున్నదే. చివరకు మేధావులు ఆడదాని మనస్సును తెలుసుకోవటం కష్టము అని సింపుల్ గా తేల్చేశారు. దీనికి ఉదాహరణగా పురాతనకాలములోని భారతములోని కథ చెప్పుకుందాము. పూర్వము దేవశర్మ అనే బ్రాహ్మణుడికి రుచి అనే సౌందర్యరాశి […]

నీ కోసమై నేను

రచన: డా. బాలాజీ దీక్షితులు పి.వి నీ చూపులు దూసే బాణలు నీ పెదవులు లాగే అయస్కాంతాలు నీ అందాలు కాల్చే వలపు కణికలు నీ వంపులు కోసే చురకత్తులు నీపై మేరువులు రాజేసే రవ్వల కేరింతలు నీవు నిలువెళ్ళా కాటేస్తుంటే….. నేను మూగపోయాను నేను నీతో మనసు విప్పి మాట్లడాలనుకున్నా… నీవు తప్పించుకుపోయావు నేను నీ గుండెన నిలిచి పోవాలనుకున్నా నీవు అమాంతం అదృశ్యమయ్యావు కానీ నీ కోసమై నేను

అమ్మ

రచన: లక్ష్మీ ఏలూరి అవని పైన నడయాడే దేవత అమ్మ। అనురాగం పంచే మాతృమూర్తి అమ్మ। మాతృదేవోభవ। అని వందన నమస్సులు అమ్మకు। మన ఉనికికి ఆద్యం అమ్మేగా। తను పునర్జన్మ ఎత్తి మనకు జన్మనిచ్చినది అమ్మ। తప్పటడుగులు నుంచి తప్పుటడుగులవరకు పడకుండా కాపాడుతుంది అమ్మ। కొవ్వొత్తిలా తాను కరుగుతూ, మనకు జ్ఞానమార్గాన్ని ప్రసాదించేది అమ్మ। అమ్మ ప్రేమ అనంతమయినది। అమ్మ ప్రేమకు విలువ కట్టే బేహారి ఈ జగతిలో లేనే లేడు। మనం ఉన్నతస్థాయికి ఎదిగితే, […]

మాలిక పత్రిక మే 2022 సంచికకు స్వాగతం

Jyothivalaboju. Chief Editor and Content Head మాలిక పత్రిక మిత్రులకు, రచయితలకు సాదర స్వాగతం..మీకందరికీ కూడా ఆవకాయ అభినందనలు, రాబోయే మాతృదినోత్సవ శుభాకాంక్షలు.. ఆవకాయ అభినందనలు ఏంటి అనుకుంటున్నారా.. రెండేళ్లకు పైగా ఉన్నామో లేదో అన్నట్టు కాలం గడిపిన మనం ఇప్పుడు హుషారుగా, మునుపటలాగే ఆవకాయలు పెట్టడం మొదలెట్టేసాము కదా. మే నెల అంటే దాదాపు ప్రతీ తెలుగింట వినపడే మాట మల్లెపూలు, మామిడిపళ్లు, ఆవకాయలు, వడియాలు.. సూర్యనారాయణ ఎంత మండినా కూడా వీటిని మనం […]

(వ్యంగ్యల్పిక) ప్రేమల పార్టీలు.. దొంగప్రేమల పార్టీలు!

రచన:-కర్లపాలెం హనుమంతరావు ‘ప్రేమే దైవం! యువతే లక్ష్యం!’ ‘ఇదివ రకు ఓన్లీ ఒన్ సేవే లక్ష్యం అన్నట్లు గుర్తు?’ ‘అది ముగిసిపోయిన పార్టీ పొట్టి కేప్షన్ బాబాయ్! ఇది ముందుకు దూసుకొస్తోన్న పార్టీ కొత్త స్లోగన్. మాది దక్షిణాది రాష్ట్రాల మార్కు లవ్ పార్టీ! అదేమో ఉత్తరాది రాష్ట్రాల ఉత్తుత్తి ప్రేమ పార్టీ! మాధుర్ నాథ్ చౌధురి గుర్తున్నాడా?’ ‘మర్చి పోదగ్గ మహానుభావుడట్రా బాబూ! పాఠాలు చెప్పమని పెద్దబళ్లో పంతులుద్యోగ మిస్తే .. ప్రేమ పాఠాలు వల్లించి […]

ధృతి – 11

రచన: మణికుమారి గోవిందరాజుల స్వాతీ… చెప్తే అర్థం చేసుకో… ఆ అమ్మాయి చాలా తెలివితేటలు కలది. అదే కాక మనవాడికి తగినజోడి అవుతుంది కూడాను” అప్పటికి చాలా సేపటినుండి నచ్చ చెప్తున్నాడు శేఖరం. “అంత మాత్రం జోడీ మనవాడికి ఎలానూ దొరుకుతుంది. ఇలా చిన్నపిల్లను ఒప్పుకుని వయసొచ్చేదాకా ఎదురు చూడక్కరలేదు. ఎట్టి పరిస్తితుల్లోనూ నేను ఒప్పుకోను” ఖరాకండిగా చెప్పింది స్వాతి. “ఇప్పుడు నీకు అర్థం కావటం లేదు. ఆ అమ్మాయి మన కాలేజ్ లో మూడేళ్ళుగా టాపర్ […]

అమ్మమ్మ – 35

రచన: గిరిజ పీసపాటి కొన్ని విషయాలు మనం ఎంత దాచాలనుకున్నా దాగేవి కావు కనుక అన్ని విషయాలూ ఒక్క తమ ఆర్థిక ఇబ్బందులు తప్ప ప్రసాద్ గారితో వివరంగా చెప్పింది నాగ. జరిగినదంతా విన్నాక ఆయన చాలా బాధపడి “అయ్యో! మీరు పిల్లలు ఇంత బాధలో ఉన్నారని తెలియదు మేడమ్! ఎవరికైనా హెల్త్ బాగోలేదేమో అవసరమైతే తెలిసిన డాక్టర్ దగ్గరకు తీసుకెళ్దామని వచ్చాను. మీరు ధైర్యంగా ఉండండి. సర్ వచ్చేస్తారు. మిమ్మల్ని పిల్లల్ని వదిలి వారు మాత్రం […]