April 16, 2024

పరవశానికి పాత(ర) కథలు – చరిత్ర శిధిలం

డాక్టర్. కె.వివేకానందమూర్తి (యు.కె) ఉన్నట్టుండి ఏదో భరించలేని శబ్ధం గుండె బ్రద్దలు చేసింది. అధిగమించిన వేగంతో పరిగెత్తుతున్న బస్సు ప్రయాణీకులందర్నీ ఒక్కసారి కుదిపి. బాణం తగిలిన పక్షిలా కీచుమంటూ అరచి హఠాత్తుగా ఆగిపోయింది. డ్రైవరు కిందికి దిగేడు. చక్రాలవైపు వొంగి పరిశీలనగా చూస్తూ అన్నాడు – ‘దిగండి, బండి దెబ్బతింది’. కండక్టరు కూడా దిగి చూసేడు. అదే మాట తనూ చెప్పేడు. ప్రయాణీకులందరం క్రిందికి దిగేం. వెనుకపైపు వెలికివచ్చిన చక్రాలకేసి చూస్తూ డ్రైవరు కండక్టరుతో ఏదో మాట్లాడుతున్నాడు. […]

సాఫ్ట్‌వేర్ కధలు – అప్నా టైం ఆయేగా ?

రచన: రవీంద్ర కంభంపాటి శైలజ ఇంటికి వచ్చి, బయట చెప్పులు విప్పుకుంటూంటే, ఇంట్లో నుంచి అత్తగారి మాటలు వినిపిస్తున్నాయి. ‘అవును.. శైలజ కి కూడా అమెరికా కి వీసా వచ్చింది.. ఊహూ.. అఖిల్ కి డిపెండెంట్ గా కాదు.. వాళ్ళ కంపెనీ వాళ్ళే చేయించేరు.. ఒకవేళ వీసా రాకపోయినా ఊరుకోడుగా.. తన డిపెండెంట్ గానైనా తీసుకుపోతాడు ‘ అంటూ ఆవిడ ఎవరితోనో చెప్పుకుపోతూంది. లోపలికి వచ్చిన శైలజ ని చూసి, ‘పాపం వాడు ఇంకా ఆఫీస్ లోనే […]

జీవితం-జీతం-మనుగడ

రచన: రాజ్యలక్ష్మి బి   “ఈ వుద్యోగం చెయ్యాలంటే విసుగ్గా వుంది, ఎలాగైనా వదిలించుకునే మార్గం చెప్పండి” అంటూ తోటివుద్యోగి శివని అడిగాడు రామం! “రామం గారూ నా వల్ల కాదు, మీ నాన్న మన ఆఫీసర్ ఫ్రెండ్స్! మీ నాన్న మిమ్మల్ని యిక్కడ వుద్యోగంలో కుదిర్చింది యిక్కడ మంచి పేరు తెచ్చుకోవడానికి! ఆమ్మో! నా వుద్యోగం వూడగొట్టుకోను బాబూ “అంటూ శివ తన ఫైళ్లల్లో తల దూర్చాడు. అసలు విషయం యేమిటంటే పుల్లయ్యగారికి ఒక్కడే కొడుకు […]

*శ్రీ గణేశ చరిత్ర* 81 – 100

రచన: నాగమంజరి గుమ్మా..   82.   బాలుని మూడవ పిలుపును ఆలించిన రావణుండు హా వలదన్నన్ నేలందించెను లింగము జాలిగ చూచిన శివుడు నిజసదన మేగెన్ భావం: బాలుడు మూడవ పర్యాయము కూడా పిలిచేసరికి “వస్తున్నా ఆగు” మని రావణుడు ఎంతగా చెబుతున్నా వినకుండా బాలుడు లింగాన్ని నేలకు దించేసాడు. ప్రాణలింగము లోని శివుడు బయటకు వచ్చి రావణుని ప్రయత్నం విఫలమైనందుకు జాలిగా చూసి, తన ఇంటికి చేరుకున్నాడు. (భూకైలాస ఆలయం పేరుతో కోల్కతా, తెలంగాణ, […]

బ్రహ్మ జ్ఞాని జాబాలి మహర్షి

  రచన: శ్యామసుందరరావు   జాబాలి వాల్మీకి రామాయణం అయోధ్య కాండలో కనుపించే ఒక పాత్ర.   త్రేతాయుగంలో జాబాలి లేదా జాబాలి ఋషి, అనే వ్యక్తి హిందూ మతములోని ఒక పుణ్యాత్ముడు.  జబాల అనే ఒక విప్ర స్త్రీకి కన్యత్వ దశలోనే దేవతా వర ప్రసాదమున పుట్టిన వాడే ఈ జాబాలి.  జాబాలికి యుక్త వయసు రాగానే ఇతనిని తల్లి హరిద్రుమతుడు అనే గురువు దగ్గర విద్య నేర్చుకునేందుకు అప్పగిస్తుంది.   కొంతకాలానికి గురువు జాబాలికి ఉపనయనము చేసే […]

మౌనరాగం

రచన: ముక్కమల్ల ధరిత్రిదేవి   స్పందన ఎంత చల్లని తల్లివమ్మ నా తల్లీ నీవు ! వెన్న లాంటి నీ మనసు వెన్నెల చల్లదనానికి నెలవు! నీ చేతి స్పర్శ నాకు ప్రాణవాయువేను అది నిత్యం ఊపిరులూది పోస్తోంది నాకు ఆయువు! ఆ అడుగుల సడి చాలమ్మ నాకు నా మది నిండుగ సందడి రేపు నీ చూపుల మమతల జల్లుల తడిసి మైమరిచి నా కొమ్మలు రెమ్మలు పురివిప్పి పరవశించి నిను పలకరిస్తున్నాయి చూడవా ! […]

నా మనస్సు అనే దర్పణం-నా భావాలకు ప్రతి రూపం।

రచన: లక్షీ ఏలూరి అది ఒక మాయా దర్పణం-కొన్నిసార్లు నన్ను కూర్చోపెడుతుంది సింహాసనం మీద। మరి కొన్ని మార్లు తోస్తుంది అదః పాతాళానికి। అమ్మ కడుపు లోని శిశువును మావితో, నా హృది లోని కోరికలు అనే గుఱ్ఱాన్ని అజ్ఞానం కప్పి వేస్తే, మనసు అనే అద్దానికి పట్టిన మకిలిని అధ్యాత్మిక జ్ఞాన దీపాన్ని వెలిగించి పారద్రోలుతుంది। పరులాడు పరుషాలకు పగిలిన నా మాయా, దర్పణం వక్కచెక్క లయితే పవన మారుతాలు చల్లని నవనీతంపూసి సేద తీరుస్తాయి। […]

మాలిక పత్రిక ఏప్రిల్ 2022 సంచికు స్వాగతం

  Jyothivalaboju Chief Editor and Content Head     మరో కొత్త సంవత్సరానికి, కొత్త పత్రికకు స్వాగతం.. పాఠక, రచయిత మిత్రులందరికీ శ్రీ శుభకృత్ నామసంవత్సర శుభాకాంక్షలు. ఎటువంటి ఒడిదుడుకులు, సమస్యలు, విపత్తులు మళ్లీ రాకుండా ఉండాలని మనసారా కోరుకుందాం. గడచిన సంవత్సరంలోని చేదుసంఘటనలు, ఆపదలు, సమస్యలను మరచిపోవడం కష్టమే అయినా మరువడానికి ప్రయత్నిద్దాం. కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుదాం. ఈ జీవన పయనం ఆగలేదు కదా. అంతా మన మంచికే అనుకుంటూ కాలంతో […]