April 24, 2024

తాత్పర్యం – దృష్టిని బట్టి దృశ్యం

  రచన – రామా చంద్రమౌళి     “నాన్నా వీనికేదైనా మంచి పేరు సూచించండి” అంది డాక్టర్ దుర్గ. అప్పుడు నగరంలోనే అతి పెద్ద వ్యాపారవేత్త. .  దుర్గ భర్త నీలకంఠం కూడా అక్కడే ఉన్నాడు ప్రక్కన. అదొక అతిపెద్ద కార్పొరేట్ దవాఖాన. దుర్గ తండ్రి వెంకటశేషయ్య దుర్గవైపూ. .  అల్లుడు నీలకంఠం వైపూ నిరామయంగా చూచి అన్నాడు “ఊర్కే ఏదో మర్యాదకోసం అడిగి. .  నేనేదో చెప్పగానే విని. .  పెదవి విరిచి. . […]

అమ్మమ్మ – 31

రచన: గిరిజ పీసపాటి     బైపాస్ సర్జరీ కోసం ఒక పార్టనర్ డబ్బు వెనక్కి తీసుకున్నా, మిగిలిన పార్టనర్స్ పెట్టుబడి తో  షాప్ బాగానే నడుస్తోంది. ఒక రోజు వీళ్ళచేత షాప్ కి పెట్టుబడి పెట్టించిన బంధువు మళ్ళీ వీరి ఇంటికొచ్చి నాగతో “చెల్లీ! నేను బయట పనులు, రిప్రజెంటెటివ్స్ ని మోటివేట్ చెయ్యడం, వాళ్ళ MD లు వస్తే వాళ్ళతో కలిసి డాక్టర్స్ ని విజిట్ చెయ్యడం వంటి బిజినెస్ ప్రమోషన్ కి సంబంధించిన […]

వెంటాడే కథలు! – 4 . మట్టిమనిషి

రచన: చంద్రప్రతాప్ కంతేటి నా వృత్తిలో భాగంగా దేశదేశాల కథలు, మనదేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో.. రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ సంతోషం. ఆ రచయిత […]

శ్రీ గణేశ చరిత్ర (అష్టోత్తర శత కందములు)

రచన: నాగమంజరి గుమ్మా 1. స్మరియించెద గణనాధుని* స్మరియించెద విఘ్నపతిని మానసమందున్* స్మరియించెద నీశ సుతుని* స్మరియించెద గౌరి తనయు శత కందములన్* భావం: గణములకు అధిపతి యైన గణేశుని స్మరిస్తాను. విఘ్నములకు అధిపతి అయిన విఘ్నేశుని మనసులో స్మరిస్తాను. ఈశ్వరుని కుమారుడైన వినాయకుని స్మరిస్తాను. గౌరీదేవి కుమారుడైనటువంటి బొజ్జ గణపతిని నూట ఎనిమిది కంద పద్యములలో స్మరించుకుంటాను. 2. గణనాథుని నుతియించితి* నణువును నే విద్య జూప నంబిక పుత్రా* గణపయ్య నన్ను గావుము* కణమును […]

అన్నపూర్ణ తల్లి..

రచన: జ్యోతి వలబోజు వాడిపోయిన మొహంతో వచ్చి బ్యాగ్ సోఫాలో పడేసి దిగాలుగా కూర్చుంది వనజ.. తలుపు చప్పుడు విని హాల్లోకి వచ్చిన వనజ అత్తగారు లక్ష్మిని చూసి విస్తుపోయింది. “వనజా! ఏమైందమ్మా! రోజూ రాత్రి ఎనిమిది అయ్యేది, ఇవాళ ఇంత తొందరగా వచ్చేసావేమిటి? తలనొప్పిగా ఉందా? టీ ఇవ్వనా?” అంటూ పక్కనే కూర్చుంది. ఆ మాత్రం ఆప్యాయతను తట్టుకోలేక, అప్పటిదాకా మౌనంగా ఉన్న వనజ అత్తమ్మ చేయి పట్టుకుని భోరుమని ఏడ్చేసింది. “అయ్యో! ఏమైందమ్మా.. ఎవరేమన్నారు. […]

సూర్యోదయం

రచన : యం. ధరిత్రీ దేవి పార్కులో హుషారుగా నడుస్తున్న వాడల్లా ఠక్కున ఆగిపోయారు రాఘవ రావు గారు, కాస్త దూరంలో ఓ సిమెంటు బెంచీ మీద కూర్చున్న దయానంద్ గారిని చూసి. మెల్లిగా అటువైపు అడుగులు వేశారాయన. దాదాపు కొన్ని నెలలయి ఉంటుంది ఆయన్ని చూసి. మనిషి బాగా నీరసించిపోయారు. ముఖంలో ఏదో చెప్పలేని దిగులు స్పష్టంగా కనిపిస్తోంది. రాఘవరావు గారు, దయానంద్ గారు ఇద్దరూ కాలేజీ ప్రిన్సిపాల్స్ గా చేసి రెణ్ణెళ్ల తేడాతో పదవీ […]

కలహాంతరిత.

రచన: పంతుల ధనలక్ష్మి గోపీ ఆఫీసునుండి ఇంటికి వచ్చేడు. ఆ రోజు బస్సు ల వాళ్ళు ఆటోవాళ్ళు ఏదో ఏక్సిడెంట్ విషయంలో కొట్టుకుని పంతం తో ఇరువురూ స్ట్రైక్ చేసి తిరగటం మానేశారు. పదిహేను కిలోమీటర్ల దూరం నడిచి ఇంటికి చేరేడు. ఉసూరుమని కూర్చుని “రాధా! కొంచెం కాఫీ ఇస్తావా?’ అని అడిగేడు. “ఎందుకివ్వనూ? అదేదో ఎప్పుడూ ఇవ్వనట్టు! ఆ!” అంది. “ఇవాళ సినిమా ప్రోగ్రాం అన్నారు?” దీర్ఘం తీసింది రాధ. ఓ చూపు చూసి ఊరుకున్నాడు. […]

పాపం నీరజ!

రచన: రాజ్యలక్ష్మి బి నీరజకు యీ మధ్య భర్త రాజారాం పైన అనుమానం వస్తున్నది. “ఆఫీసు 5 కల్లా అయిపోతుంది కదా? మీరు రాత్రి 11 అయినా ఇంటికి చేరరు? “ఒకరోజు నీరజ భర్తను నిలదీసింది.” మా ఆఫీసర్ కి నేనంటే నమ్మకం, నమ్మకమైన ఫైళ్లు నాచేత చేయిస్తాడు, అనో “స్నేహితులు పట్టుబట్టి సినిమాకు లాక్కుపోయారు “అనో రోజూ ఏదో ఒక అల్లుతాడు రాజారాం ! ఒక్కొక్కరాత్రి మెలకువ వచ్చి చూస్తే నీరజకు పక్కమీద కనపడడు ! […]

తల్లి మనసు

రచన: G.S.S. కళ్యాణి. ఉదయం ఏడుగంటల ప్రాంతంలో, తమ వరండాలోని పడక్కుర్చీలో కూర్చుని ఆ రోజు దినపత్రికను తిరగేస్తూ, తన పక్కనే బల్లపైనున్న కాఫీ కప్పును తీసుకుని ఒక గుటక వేసిన రమాపతి, చిరాగ్గా మొహంపెట్టి, “ఒసేయ్ శ్రీకళా! ఓసారి ఇలా రావే!!”, అంటూ తన భార్య శ్రీకళను కోపంగా పిలిచాడు. భర్త అరుపుకు భయపడి, చేతిలో ఉన్న పనిని వదిలేసి పరిగెత్తుకుంటూ వరండాలోకి వచ్చి, “ఏంటండీ? ఏమైందీ??’ అని రమాపతిని కంగారుగా అడిగింది శ్రీకళ. “ఇంత […]

తీరిన కోరిక..

రచన: షమీర్ జానకీదేవి కీర్తనకు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకోవాలనే కోరిక చాలా బలంగా ఉండేది. ఎందుకో తెలియదు. తన క్లాస్మేట్ రమ్య, తను ఇద్దరు చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు ఇరుగు పొరుగున వుండేవారు. తనకు తమ పెద్ద మామయ్యంటే చాలా భయం. ఆయనను చూడగానే అందరు కనపడకుండా ప్రక్కకు వెళ్ళేవాళ్ళు. ఒక రోజు ఆ మామయ్య బయటికి వెళ్ళిన తర్వాత కీర్తన, రమ్య ఇద్దరు కలిసి సైకిల్ తెప్పించుకుని ప్రాక్టీస్ చేయాలని అనుకున్నారు. వారికి […]