March 29, 2024

శ్రీదేవీభాగవత మహత్మ్యము . 2

రచన: ఓలేటి స్వరాజ్యలక్ష్మి మొదటి స్కందము మూడవ కథ రైవతుడను మనువు వృత్తాంతము ఈ కథను మిత్రావరుణుని నుండి ప్రకటితుడైన అగస్త్యమునికి శివకుమారుడైన స్కంధుడు వివరించినది. దేవీ భాగవత మహాత్మ్యము ఇందు చెప్పబడినది. ఋతువాకుడను ముని గలడు. అతడికి ఒక పుత్రుడుదయించెను. పుత్రోత్సాహము జరుపబడెను. అతడు రేవతీ నక్షత్రమందు నాల్గవ పాదమున జన్మించెను. అది గండాంతము అని చెప్పుదురు. చేయవలసిన సంస్కారాదులన్నీ ముని అతనికి జరిపించెను. జాతకర్మాదులు, ఉపనయన సంస్కారము చేసెను. అ పిల్లవాడు పుట్టినప్పటినుంచి తల్లిదండ్రులు […]

కథ విందువా … నా మనసుకథ విందువా…

రచన: కోసూరి ఉమాభారతి వెన్నెల ఆకస్మిక మరణం, ఆమె నుండి అందిన ఉత్తరంలోని సారాంశం… అమ్మాపిన్ని శారదని విపరీతంగా కృంగదీశాయి. వారం రోజులుగా నిద్రాహారాలు మాని, మాటాపలుకు లేకుండా నిర్లిప్తంగా ఉండిపోయిన ఆమెని…. తమకి యేళ్లుగా తెలిసిన డాక్టర్. వాణి మీనన్ వద్దకు బలవంతంగా తీసుకుని వెళ్లారు ఆమె భర్త రామ్, కొడుకు సాయి. విషయం వివరించి, చనిపోయేముందు వెన్నెల… శారదకి రాసిన ఉత్తరాన్ని కూడా డాక్టర్ చేతిలో పెట్టారు. *** ఆ ఉత్తరాన్ని ఒకటికి రెండుమార్లు […]

నాచారం నరసింహస్వామి గుడి

రచన: రమా శాండిల్య తెలంగాణాలో, ఇంత మంచి దేవాలయాలు ఉన్నా, అవి ప్రాచుర్యంలో లేకపోవటం విచారించాల్సిన విషయం. చుట్టూ పొలాలు, చిన్న వాగు, చిన్న గుట్టమీద తాయారమ్మ, ఆండాళ్లమ్మలతో పాటుగా వెలసిన నరసింహస్వామి ఆలయమిది. ప్రశాంతమైన పరిసరాలతో ఈ గుడి చాలా బావుంటుంది. ఇక్కడ పెద్దసంఖ్యలో కోతులుంటాయి. అవి, మన చేతుల్లో ఉన్న వస్తువులను లాక్కుపోతూ ఉంటాయి. ఈ గుడి ఉదయం ఆరు గంటలనుంచీ మధ్యాహ్నం పన్నెండు గంటలవరకూ తెరచి ఉంటుంది. ఒంటిగంటకు గుడి లోపల శాకాహార […]

దానవ గురువు ‘శుక్రాచార్యుడు’

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు తెలివితేటలలో బృహస్పతి ఎంతటివాడో శుక్రాచార్యుడు కూడా అంతటి వాడు. దేవతలు బృహస్పతిని గురువులుగాఉండమని అడిగినప్పుడు బృహస్పతి , “నాకన్నా శుక్రాచార్యుడు సమర్ధుడు ఆయనను అడగండి” అని చెపుతాడు. కానీ దేవతలు బృహస్పతిని గురువుగా ఎంచుకుంటారు బృహస్పతి మీద, దేవతల మీద కోపముతో శుక్రాచార్యుడు రాక్షసులకు గురువుగా ఉంటాడు. ఆనాటి నుంచి దేవా దానవుల సంగ్రామాల్లో దానవులకు అన్ని విధాలుగా సహకరించివారి విజయాలకు తోడ్పడినవాడు శుక్రాచార్యుడు, కానీ దేవతలా పక్షనా న్యాయము ధర్మము […]

ఔషధ విలువల మొక్కలు

రచన: నాగమంజరి గుమ్మా 1. బృహతిపత్రం చేదు రుచిని గల్గు శ్రీ గణపతి పత్రి* జ్వరము, కఫము కట్టు వాంతులున్ను* వాకుడాకు పేర వర్ధిల్లు బృహతియే* ఏకదంతుని కిది మోకరిల్లె* ఏకదంతాయ నమః బృహతీపత్రం పూజయామి అని పూజించే ద్వితీయ పత్రానికే వాకుడాకు అని పేరు. ఇది కూడా ఔషధమే. జ్వరం, కఫం, వాంతులు మొదలగు వ్యాధులకు ఔషధం. పురుషుల వంధ్యత్వానికి కూడా మంచి మందు. 2. బిల్వ పత్రం శివకేశవులకు ప్రీతిగ* నవలీలగ వేడి మాన్పె […]

తుమ్మెదా.. తుమ్మెదా

రచన: శశిబాల ఎచ్చన్ని సూరీడు తుమ్మెదా సల్లంగ వచ్చాడు తుమ్మెదా పొద్దు పోడిసేనంటు తుమ్మెదా ..మరి పల్లె లేసేసింది తుమ్మెదా కొప్పులో పూలెట్టి కొత్త పావడ గట్టి మామకై వచ్చాను తుమ్మెదా మామేమో లెగడాయే పక్కేమో దిగడాయే ఊరంతా నవ్వేరు తుమ్మెదా కొండల్లో కోనల్లు ఎక్కి సూసొద్దామంటే నిద్దర లేవడు తుమ్మెదా వులుకులికి సూస్తాడు తుమ్మెదా పంట సేనుల్లోన వరికోత కొస్తేను సాటుకి లాగిండు తుమ్మెదా కొంటె కోణంగి ఐనాడు తుమ్మెదా.. నేను సిగ్గుతో సితికెను తుమ్మెదా […]

నీ నయనాలు

రచన: చంద్రశేఖర్ నీలాల నీ కనులు సోయగాల సోకళ్ళు అందాల ఆ కనులు నల్లని నేరేడు పండ్లు చేప వంటి నీ కనులు చెబుతున్నాయి ఊసులు నాట్యం చేసే ఆ కనులు మయూరానికే అసూయలు మెరిసేటి నీ కనులు వెలిగేటి జ్యోతులు తేజస్సుతో ఆ కనులు ఇస్తాయి కాంతులు కాటుక పెట్టిన నీ కనులు తెచ్చెను కాటుకకే వన్నెలు ప్రపంచంలో అందరికి రెండే కనులు కానీ నీ రెండు కనులలో దాగి ఉంది మరో అందమైన ప్రపంచం

వెన్నెల జాము

రచన: డా. బాలాజీ దీక్షితులు పి వి వెన్నముద్ద తినిపిస్తుంది కన్నె చందమామ కన్నుల పూసిన కలువలు గండె గూటికి చేరుస్తుంది వెన్నెల హంస మధుర మధురామృత మధువును త్రాగిస్తుంది వలపుల పందేరం పరిమళ సుధాసుగంధంతో అప్సర మధనం చేస్తుంది చిరు వయ్యారం ప్రేమ నెమిలిక నెయ్యంతో నిలువెళ్ళా పూస్తుంది వన్నెల సోయగం పదునైన పైయెదల పరువపు శూలాలతో దాడి చేస్తుంది కన్నె తనం స్వప్నం నుండి లేవగానే వెన్నెల జాము మల్లెల వర్షంలో భావుక తపస్సుచేసే […]

మాలిక పత్రిక జులై 2021 సంచికకు స్వాగతం

  Jyothivalaboju Chief Editor and Content Head పాఠకులకు, రచయితలకు మాలిక పత్రిక తరఫున మనఃపూర్వక ధన్యవాదాలు. మా పత్రికను ఆదరిస్తున్న మీ అందరికీ మరోసారి సాహితీ విందును అందజేస్తున్నాము. ఈ విందులో కథలు, కవితలు, సీరియళ్లు, యాత్రా విశేషాలు, వ్యాసాలు, కార్టూన్స్, పుస్తక సమీక్షలు ఉన్నాయి.   మీ రచనలను పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com     ఈ సంచికలోని విశేషాలు:   1.కంభంపాటి కథలు – ఏనుగా ? గేదా ? పేనా […]