April 25, 2024

దానవ గురువు ‘శుక్రాచార్యుడు’

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు తెలివితేటలలో బృహస్పతి ఎంతటివాడో శుక్రాచార్యుడు కూడా అంతటి వాడు. దేవతలు బృహస్పతిని గురువులుగాఉండమని అడిగినప్పుడు బృహస్పతి , “నాకన్నా శుక్రాచార్యుడు సమర్ధుడు ఆయనను అడగండి” అని చెపుతాడు. కానీ దేవతలు బృహస్పతిని గురువుగా ఎంచుకుంటారు బృహస్పతి మీద, దేవతల మీద కోపముతో శుక్రాచార్యుడు రాక్షసులకు గురువుగా ఉంటాడు. ఆనాటి నుంచి దేవా దానవుల సంగ్రామాల్లో దానవులకు అన్ని విధాలుగా సహకరించివారి విజయాలకు తోడ్పడినవాడు శుక్రాచార్యుడు, కానీ దేవతలా పక్షనా న్యాయము ధర్మము […]

ఔషధ విలువల మొక్కలు

రచన: నాగమంజరి గుమ్మా 1. బృహతిపత్రం చేదు రుచిని గల్గు శ్రీ గణపతి పత్రి* జ్వరము, కఫము కట్టు వాంతులున్ను* వాకుడాకు పేర వర్ధిల్లు బృహతియే* ఏకదంతుని కిది మోకరిల్లె* ఏకదంతాయ నమః బృహతీపత్రం పూజయామి అని పూజించే ద్వితీయ పత్రానికే వాకుడాకు అని పేరు. ఇది కూడా ఔషధమే. జ్వరం, కఫం, వాంతులు మొదలగు వ్యాధులకు ఔషధం. పురుషుల వంధ్యత్వానికి కూడా మంచి మందు. 2. బిల్వ పత్రం శివకేశవులకు ప్రీతిగ* నవలీలగ వేడి మాన్పె […]

తుమ్మెదా.. తుమ్మెదా

రచన: శశిబాల ఎచ్చన్ని సూరీడు తుమ్మెదా సల్లంగ వచ్చాడు తుమ్మెదా పొద్దు పోడిసేనంటు తుమ్మెదా ..మరి పల్లె లేసేసింది తుమ్మెదా కొప్పులో పూలెట్టి కొత్త పావడ గట్టి మామకై వచ్చాను తుమ్మెదా మామేమో లెగడాయే పక్కేమో దిగడాయే ఊరంతా నవ్వేరు తుమ్మెదా కొండల్లో కోనల్లు ఎక్కి సూసొద్దామంటే నిద్దర లేవడు తుమ్మెదా వులుకులికి సూస్తాడు తుమ్మెదా పంట సేనుల్లోన వరికోత కొస్తేను సాటుకి లాగిండు తుమ్మెదా కొంటె కోణంగి ఐనాడు తుమ్మెదా.. నేను సిగ్గుతో సితికెను తుమ్మెదా […]

నీ నయనాలు

రచన: చంద్రశేఖర్ నీలాల నీ కనులు సోయగాల సోకళ్ళు అందాల ఆ కనులు నల్లని నేరేడు పండ్లు చేప వంటి నీ కనులు చెబుతున్నాయి ఊసులు నాట్యం చేసే ఆ కనులు మయూరానికే అసూయలు మెరిసేటి నీ కనులు వెలిగేటి జ్యోతులు తేజస్సుతో ఆ కనులు ఇస్తాయి కాంతులు కాటుక పెట్టిన నీ కనులు తెచ్చెను కాటుకకే వన్నెలు ప్రపంచంలో అందరికి రెండే కనులు కానీ నీ రెండు కనులలో దాగి ఉంది మరో అందమైన ప్రపంచం

వెన్నెల జాము

రచన: డా. బాలాజీ దీక్షితులు పి వి వెన్నముద్ద తినిపిస్తుంది కన్నె చందమామ కన్నుల పూసిన కలువలు గండె గూటికి చేరుస్తుంది వెన్నెల హంస మధుర మధురామృత మధువును త్రాగిస్తుంది వలపుల పందేరం పరిమళ సుధాసుగంధంతో అప్సర మధనం చేస్తుంది చిరు వయ్యారం ప్రేమ నెమిలిక నెయ్యంతో నిలువెళ్ళా పూస్తుంది వన్నెల సోయగం పదునైన పైయెదల పరువపు శూలాలతో దాడి చేస్తుంది కన్నె తనం స్వప్నం నుండి లేవగానే వెన్నెల జాము మల్లెల వర్షంలో భావుక తపస్సుచేసే […]

మాలిక పత్రిక జులై 2021 సంచికకు స్వాగతం

  Jyothivalaboju Chief Editor and Content Head పాఠకులకు, రచయితలకు మాలిక పత్రిక తరఫున మనఃపూర్వక ధన్యవాదాలు. మా పత్రికను ఆదరిస్తున్న మీ అందరికీ మరోసారి సాహితీ విందును అందజేస్తున్నాము. ఈ విందులో కథలు, కవితలు, సీరియళ్లు, యాత్రా విశేషాలు, వ్యాసాలు, కార్టూన్స్, పుస్తక సమీక్షలు ఉన్నాయి.   మీ రచనలను పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com     ఈ సంచికలోని విశేషాలు:   1.కంభంపాటి కథలు – ఏనుగా ? గేదా ? పేనా […]

కంభంపాటి కథలు – ఏనుగా ? గేదా ? పేనా ?

రచన: కంభంపాటి రవీంద్ర “ఇదిగో ..బయటికెళ్తున్నా .. తలుపేసుకో” “ఎక్కడికేమిటి ?” “బయటకి వెళ్ళేటప్పుడు ఎక్కడికీ అని అడగొద్దని ఎన్ని సార్లు చెప్పాలి ?” “అడిగినన్ని సార్లూ చెప్పాలి” “అంటే ..ఓసారి చెబితే బుర్రకెక్కదన్నమాట” “బుర్రకెక్కేలా చెబితే ఎందుకెక్కదూ ?” “అయితే, నేను బుర్రకెక్కేలా చెప్పనన్నమాట ! !” “మన బలహీనతలనెరడగం కూడా ఓ రకమైన బలం” “ బలహీనతేమిటీ ?” “ఇప్పుడే చెప్పేరు కదా !” “నేను నా బలహీనత చెప్పేనా ??” “అంటే .. […]

పేదోడి ప్రశ్న

రచన: జెట్టబోయిన శ్రీకాంత్ ఆకలి అంటే ఏమిటో నూకలి గింజనడుగుతా..! ఈ ఆకలి ఎందుకవుతదో, మాడుతున్న కడుపునడుగుతా..! గూడు అంటే ఏమిటో గుడిసెలున్న అవ్వనడుగుతా…! తోడు అంటే ఏమిటో నా మనసులోని మనిషినడుగుతా…! కష్టము అంటే ఏమిటో నా ఒంటిమీది చెమటనడుగుతా…! దురదృష్టము అంటే ఏమిటో నా కంటిలోని నీటినడుగుతా…! కోపము అంటే ఏమిటో నాకు జీతమిచ్చే దొరని అడుగుతా…! శాపము అంటే ఏమిటో నా నుదిటనున్న రాతనడుగుతా…! కరువు అంటే ఏమిటో ఎండిపోయిన చెరువునడుగుతా…! పరువు […]

ధృతి – 2

రచన: -మణి గోవిందరాజుల “నాన్నా కాలేజీకి వెళ్ళొస్తాను” చెప్తూ గుమ్మం దాటబోతున్న కూతురి మీద గయ్యిమని లేచింది పూర్ణ. “చచ్చిందాకా చాకిరీ నాతో చేయించుకుని కాలేజికి వెళ్ళేప్పుడు తల్లికి చెప్పాలన్న జ్ఞానం కూడా లేదు.పెంపకం సరిగ్గా లేకపోతే ఇలానే ఏడుస్తుంది… అసలు గారాబం చేసి చెడగొడుతున్న తండ్రిననాలి” “ఇదిగో! పెంపకం సరిగా లేదని మా అమ్మనను పడతాను. అంతే కానీ, మా నాన్న నంటే ఊర్కునేది లేదు” తనూ అంతే గయ్యిమని లేచింది ధృతి. “తల్లీ కూతుళ్ళిద్దరూ […]

‘అపరాధిని’

  రచన:  కోసూరి ఉమాభారతి   ప్రియమైన అమ్మాపిన్నికి, పిన్నీ, నేను అపరాధినే. నీతో మాట్లాడి నాలుగేళ్ళవుతుంది. నువ్వు తప్ప నాకింకెవరున్నారు చెప్పు. అందుకే, ఇన్నాళ్ళకి నా మనసు విప్పి .. నా నుండి కొన్ని సంజాయిషీలు, నా ప్రశ్నలకి నేనే ఇచ్చుకున్న కొన్ని సమాధానాలు నీ ముందుంచుతున్నాను. ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా కూడా నా జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలకి నీవే కారణమయ్యావు పిన్నీ. ఐదేళ్ళప్పుడు అమ్మ బంధం, అమ్మతో అనుబంధం నన్ను వీడిపోయినప్పుడు, నాన్న నన్ను […]