March 28, 2024

మాయచేయు మాంత్రిక

రచన: డా|| బాలాజీ దీక్షితులు పి.వి   వెన్నెల హంస వాలిందా పున్నమి రేయిన గుండె కొలనుపై   కన్నె కలువ విచ్చిందా వలపుల సడి వేణువు స్వరమై   పరిమళ సుమం తాకిందా మయ మరపుల మధుాలికై   కలల మాటు కంత్రిక   ఓ సొగసుల మాంత్రిక   నీవు మాయ చేసి మాయమయ్యే దేవతవు కాని అక్కరతీర్చే ఆర్తివో కనురెప్పల కాంచే శక్తివో అనే నమ్మకం ఎప్పుడో సడలింది…      

మాలిక పత్రిక మే 2021 సంచికకు స్వాగతం…

    Jyothivalaboju Chief Editor and Content Head Maalika Magazine మిత్రులు, రచయితలు, పాఠకులందరికీ మనఃపూర్వక స్వాగతం.. మాలిక పత్రికను ఆదరిస్తున్న మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇటీవల మాలిక పత్రిక తరఫున నిర్వహించిన కథలపోటి ఫలితాలు వచ్చేసాయి.. మాలిక పత్రిక, మంథా భానుమతిగారు కలిసి నిర్వహించిన ఉగాది కథలపోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన పది కథలను ఈ మాసపు సంచికలో ప్రచురిస్తున్నాము. విజేతలందరికీ అభినందనలు. ఎప్పటిలాగే మీ అందరినీ అలరించి, ఆనందింపజేయడానికి […]

1. నివురుకప్పిన నిప్పు – ఉగాది కథలపోటి

రచన: పోలంరాజు శారద “ఈ రోజు గెస్ట్స్ వస్తున్నారు. మీరిద్దరూ మీ గదిలోకెళ్ళి కూర్చోండి?” అప్పటి దాకా చెట్లకు నీళ్ళుపట్టి వరండాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న ఆయన కోడలి మాటలకు భార్యకు కళ్ళతోటే సైగ చేసి. “అట్లాగేనమ్మా! వసూ పద చల్లగాలి మొదలయింది. లోపల కూర్చుందాము. ” కిట్టయ్య అని అందరికీ తెలిసిన ఆ పెద్దమనిషి మెల్లిగా లేచి లోపలికి నడవగానే వసుంధర కూడా లేచి వెళ్తూ, నీలిమ ముఖం చిట్లించుకొని ఏదో గొణుక్కోవడం కనిపించింది. […]

2. మేడిపండు జూడ – ఉగాది కథలపోటి

రచన: డా. కె. పద్మలత నీలిమ స్కూల్కి వెళ్ళడానికి రడీ అయి టిఫిన్ బాక్సు బ్యాగులో పెట్టుకుంటూ ఆఫీసుకెళ్ళడానికి బయటికి వెళ్తున్న భర్త దగ్గరకొచ్చి ”ప్లీజ్ ! ఈ రోజు నన్ను స్కూల్ దగ్గర దించి మీరు వెళ్ళండి. ఆటో అతను రానన్నాడు” అంది. ”వారానికి రెండు రోజులు రాడు అతను, మీరు గట్టిగా అడగరు. సరే, తొందరగా రా, నాకు ఆఫీసుకు లేట్ అవుతుంది’ ”వస్తున్నా!” అని ఇంటికి లాక్ వేసి బయలుదేరి స్కూటర్ మీద […]

3. అత్త వెర్సెస్ కోడలు

రచన: జి. యస్ సుబ్బలక్ష్మి అప్పటికింకా కరోనా మన దేశంలోకి ప్రవేశించలేదు. అసలు లాక్ డౌన్ అన్నమాటే సామాన్య జనాలకు తెలీని రోజుల్లో ఒక డబ్బున్నవాళ్ళబ్బాయికి పెళ్ళి కుదిరింది. ఇంకేముందీ. . మామూలువాళ్ళే ఉన్న ఒక్క అబ్బాయి పెళ్ళీ, అమ్మాయిపెళ్ళీ ధూమ్ ధామ్ గా చేసేస్తున్న ఆ రోజుల్లో బాగా డబ్బున్న మన రాజా పెళ్ళి ఇంకెంత ఘనంగా చెయ్యాలీ అనుకుంటూ ఎంగేజ్ మెంట్ అవగానే అప్పటికే మరుగున పడిపోయిన సాంప్రదాయాలని తిరగతోడి అయిదురోజులపెళ్ళికి పక్కాగా ప్లాన్ […]

4. హెడ్మాస్టర్ కొడుకు – ఉగాది కథలపోటి

రచన: లక్ష్మీ రాఘవ “నేను, నా ఫ్రెండ్స్ ఏదైనా కలిసి వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాము నాన్నా” ఇంజనీరింగ్ పూర్తి చేసిన కొడుకు రాహుల్ మాటలకు జవాబుగా తండ్రి ఆదినారాయణ “అంతే చేయలేమో. ఈ కరోనా టైమ్‌లో వుద్యోగాలు దొరికేది కష్టం. నీకా కాంపస్ సెలెక్షన్ రాలేదు. ఇంట్లో కూర్చోవడం కంటే మీ ఫ్రెండ్స్అందరూ కలిసి ఒక నిర్ణయానికి రండి. డబ్బు విషయం ఆలోచిస్తాను” అన్నాడు. “స్టార్ట్ అప్ కంపెనీల గురించి ఇన్ఫోర్మేషన్ కలెక్ట్ చేసుకుంటున్నాము. ఈ రోజు […]

5. కోడలి వేదన – ఉగాది కథలపోటి

రచన: మంగు కృష్ణకుమారి సుప్రజానివాస్ ఠీవీగా తన ఛైర్లో కూచుంది. మెత్తగా కుర్చీ, ఎసి రూమ్ చల్లదనం హాయిగా ఉంది. చిన్నతనంనించీ ఎప్పుడూ క్లాస్ టాపర్, స్కూల్ టాపర్, ఇంటర్ లో గోల్డ్ మెడల్, ఇంజనీరింగ్ మీద ఇంటరెస్ట్ లేదంటే, నవ్వుతూ ఆమె ఇష్టానికి వదిలేసిన తల్లితండ్రులు సుప్రజకి ఆత్మవిశ్వాసం పెరిగేటట్టు చేసేరు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కొన్నాళ్ళు ప్రైవేట్ గా హెచ్ ఆర్ మేనేజర్ గా చేసింది. అప్పుడే నివాస్ తో ప్రేమ. నివాస్ […]

6. తన ధైర్యమే తనకు రక్ష

రచన- మీనాక్షి చెరుకువాడ జాతీయ రహదారి. నడి రేయి దాటుతుండగా, అంతటా నిర్మానుష్యంగా ఉన్న వేళ ఓ పాత వ్యాను సడెన్ బ్రేక్ తో రోడ్డుకు వారగా ఆగింది. డ్రైవర్, క్లీనర్ కూడా తెచ్చుకున్న సరుకు ఖాళీ చేసీ, దారిలో ఉన్న ధాబాలో తెచ్చుకున్న బిర్యానీ తిన్నారు. ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుని నవ్వుకుంటూ లోపల పడ్డ చుక్క నరాలను మత్తెక్కిస్తుండగా మెల్లిగా ఆ వాను వెనక్కి వచ్చి తలుపులు తెరిచారు. అందులో ముందంతా కూరగాయల గోనెలూ, […]

7. అమ్మ – ఉగాది కథలపోటి

రచన: నన్ద త్రినాధరావు పూవమ్మ ఆందోళనగా చూస్తోంది ఆయన కేసి. ఒక పక్కగా నిల్చుంది. ఆ గదిలో ఏసీ ఉన్నా ఆమెకు చమట్లు పడుతున్నాయి. తన చేతిలో రిపోర్టులు వంక చూసాడు డాక్టర్. మళ్లీ మళ్లీ చూసాడు. అతను అలా చూస్తున్న కొద్దీ పూవమ్మలో ఆత్రుత ఉధృతం కాసాగింది. ఆయన ఏం చెబుతాడా అని ఆమెలో ఒకటే ఉత్కంఠ! డాక్టర్ పెదవి విప్పాడు. “చూడమ్మా. . పెద్దగా భయపడాల్సిoది ఏమీ లేదు. హార్ట్ లో చిన్న లోపం […]

8. (అ)ఋణానుబంధం – ఉగాది కథలపోటి

రచన: రమా శాండిల్య ఆ పెద్ద హాలులో ఉన్న కిటికీ ప్రక్కన నిలబడి బయటకి చూస్తోంది రమణి. సంధ్యాసమయం. బయట సైనికులల్లే నిలిచిన పచ్చని చెట్లు, గూళ్ళకు తరలి ఎగిరే పక్షులు, పూలమొక్కలతో, అస్తమిస్తున్న సూర్యుడి బంగారు కిరణాలు పడి, ఆ ప్రాంగణమంతా ఎంతో ఆహ్లాదభరితంగా ఉంది. ఇటుతిరిగి చూసేసరికి, పిల్లలంతా ఎంత త్వరగా చేసేసారో కానీ, హాలులో డెకరేషన్ అంతా తాజా తాజా పూలతో , చిన్న చిన్న రంగు రంగుల బుడగలతో చేసి ఉంది. […]