April 24, 2024

మిధ్యాబింబాలు

రచన: ఆచార్య పి.కె. జయలక్ష్మి రెండు వారాలయింది యు.యస్ నించి వచ్చి.ల్యాప్ టాప్ లో ఫేస్ బుక్ చూస్తుంటే అవినాష్, కాకినాడ కన్పిస్తే యాదాలాపంగా ప్రొఫైల్ చూసా. సందేహం లేదు ..నా మేనల్లుడు అవినాషే! దాంట్లో ఉన్న నంబరికి అదిరే గుండెలతో ఫోన్ చేశా. అట్నించి “హలో” అన్న స్వరం వినగానే గుండె గొంతులో కొట్టుకుంది. వణికే కంఠం తో “ నేను మాధవత్తని అవినాష్ బెంగుళూరు నించి మాట్లాడుతున్నా” అన్నాను. ఒక్క నిమిషం మౌనం రాజ్యమేలింది. […]

విజ్ఞత

రచన: శుభశ్రీ అశ్విన్ పెళ్ళయి మూడు సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఇంకా పిల్లా-జల్లా లేరు!? దేనికైనా రాత ఉండాలి. వద్దు…వద్దు.. అంటుంటే నచ్చిందని చేసుకుని తీసుకొచ్చాడు. ఒక్క పని సరిగ్గా రాదు. అసలైనా ఏం పెంపకం?! మంచి మర్యాద తెలీదు!! వాళ్ళ అమ్మ-నాన్నలని అనాలి గంట నుంచి అదే పనిగా తననీ, తన పుట్టింటివారినీ ఆడిపోసుకుంటోంది అత్తగారు. అంతా వింటూ ఏం మాట్లాడకుండా మౌనంగా తన పని తను చేసుకుంటోంది సిరి. ఎందుకంటే ఇదేం తనకు కొత్త […]

ట్రీట్మెంట్!

రచన: వారణాసి వెంకట విజయలక్ష్మి ఏమండీ కూరలబ్బాయి వచ్చినట్లున్నాడు..కొద్దిగా టమాటాలు తీసుకోరా?” ముందు గదిలో పేపర్ చదువుతున్న రవి సమాధానం చెప్పలేదు…పరీక్షలకి ప్రిపేర్ అయితున్నంత సీరియస్ గా పేపర్ చదువుతున్నాడు… రెండోసారి చదవటం. ‘ఈయనకి వినపడదో, లేక ఇంతోటి దానికి సమాధానం చెప్పేదేమిటి అనుకుంటారో…సరే ఏదయినా ఇప్పుడు నాకు తప్పదు….బాబిగాడి కి పప్పు రడీ అవ్వాలి కదా’ ‘వేద’ విసుగుని పూర్తిగా కప్పెట్టేసి, చీర, జుట్టు సర్దుకుని వాకిట్లోకొచ్చింది. పొయ్యిలన్నీ ఆర్పే ఉన్నాయని చూసుకోవడం మరచిపోలేదు…మాడిపోతే మళ్లీ […]

ఊరు చేరిన పాదాలు

రచన: శింగరాజు శ్రీనివాసరావు ఆరు నెలల నుంచి జీవితం అంధకారంలో ఉన్నట్లుగా అనిపిస్తున్నది. పదవీ విరమణ చేసిన అయిదు సంవత్సరాలలో ఇంతగా ఎప్పుడూ తల్లడిల్లిన దాఖలాలు లేవు. ఉదయం పూట వ్యాయామం, దేవాలయ దర్శనం, సాయంవేళలో తోటి స్నేహితులతో ఒక గంట కాలక్షేపం. ఎంతో హాయిగా, ఉద్యోగం లేకపోయెనే అనే బాధలేకుండా జరిగిపోయింది. కానీ మొన్న ఏప్రియల్ నెల నుంచి జీవితచక్రమే మారిపోయింది. కరోనా మహమ్మారి ఏమని మనదేశంలో ప్రవేశించిందో గానీ అందరి బ్రతుకులు అతలాకుతలమయిపోయాయి. అడుగు […]

మాటే మంత్రము

రచన: ప్రభాప్రసాద్ “రేపే మనం వూరు వెళుతున్నమ్మోయ్” ఆఫీస్ నుండి వస్తూనే అరిచినట్టుగా చెపుతూ చిన్నపిల్లాడిలా సంతోషపడిపోతు సురేంద్ర సోఫా లో కూర్చుండిపోయాడు. భర్త సంతోషం చూసి తను కూడా ఆనంద పడుతూ కాఫీ చేతికి ఇచ్చి “ఇంత సంతోషం గా వున్నారు. శంకరం మాస్టారిగారి గురించి ఏమైనా తెలిసిందా “అడుగుతూ సోఫా లో కూర్చుంది . “అవును సుధా! ఈ రోజు నా చిన్ననాటి స్నేహితుడు గిరీశం కలిసాడు. శంకరం మాస్టారు ఈ నెలాఖరున అంటే […]

భయం

రచన: రాజ్యలక్ష్మి. బి అరుణకు యేమి చెయ్యాలో అర్ధం కావడం లేదు. నిజం . ఏదో ఒకరోజు బయటపడి తీరుతుంది. మరి తనేం చెయ్యాలి యిప్పుడు ? ఆ ప్రశ్నకు సమాధానం దొరకక తికమక పడుతున్నది. ఏ వుపాయము తట్టడం లేదు.. యిప్పుడు యేమి చేసినా చిక్కే ! చెయ్యకపోయినా చిక్కే ! అసలే పల్లెటూరు !చిన్న విషయం నిమిషాల్లో గుప్పుమంటుంది. పోనీ తన స్నేహితురాళ్లను అడుగుదామనుకుంటే వాళ్ళు తనని వేళాకోళం పట్టిస్తారేమోనని భయం !పోనీ జరిగినది […]

నా_యాత్రానుభవం_2021_లో_సప్తశృంగి

రచన: రమా శాండిల్య అనుకోకుండా ఒకరోజు, నా దగ్గర యోగా నేర్చుకునే ఒక శిష్యురాలు… విశాఖపట్నం నుండి ఫోన్ చేసింది. “అమ్మా, నాకు షిరిడీ వెళ్లాలనుంది, మీరు కూడా వస్తానంటే ఇరువురం కలిసి ఒక్కరోజులో షిరిడీ చూసి వద్దాము” అన్నది. అప్పుడు కోవిడ్ గురించి భయము కొంచెం తక్కువగానే ఉంది. విశాఖపట్నం నుంచి నా స్టూడెంట్ ‘సంధ్య’ హైదరాబాద్ వచ్చేట్లు, నేను అదే సమయానికి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకునేటట్లు, ప్రోగ్రాం ప్లాన్ చేసుకున్నాము. ఆ ప్రకారమే టిక్కెట్స్ […]

విదేశవిహారం చేద్దాం నాతోరండి – ( మలేషియా )

రచన: కర్రా నాగలక్ష్మి మలేషియ, ఈ మధ్య కాలంలో బలమైన ఆర్ధిక దేశంగా రూపుదిద్దుకుంటున్న దేశం, మంచి పర్యాటక దేశంగా కూడా రూపు దిద్దు కుంటోంది. మలేషియ ముస్లిం దేశంగా ప్రకటించుకుంది. అయినా ఇక్కడ హిందూ బౌద్ద మతాలకు కూడా అంతే ప్రాముఖ్యతను ఇచ్చేరు. పదమూడు రాష్టాలు, దక్షిణ చైనా సముద్రం వల్ల రెండు ద్వీపాలుగా విభజింపబడ్డ ఈ దేశంలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు వున్నాయి. ఈ సంచిక నుంచి మీకు మలేషియా లోని ప్రదేశాలను, ఒకటొకటిగా […]

ధ్యానం-యోగం

రచన: సుశీల ప్రతి సంవత్సరం జూన్ 2వ తేదీ అంతర్జాతీయ దినోత్సవానికి 2015 నుండి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి పామరునినుండి పండితుడు వరకు ఇది అత్యవసరమని గుర్తించి, ఆచరించడం జరుగుతున్నది. దీనివలన ఫలితాలను పొందుచున్నారు. యోగా అంటే “కలయిక”. వియోగంలో ధు:ఖం ఉంటుంది. యోగంలో ఆనందం ఉంటుంది. తనతో తాను కలవడమే యోగా. ప్రాపంచిక జీవితంలో డబ్బు అనేది కనీస అవసరాలకు చాలా ముఖ్యమైనది. అదే విధంగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రాణశక్తి లేక విశ్వశక్తి […]

*గొప్ప సందేశాత్మక ‘ లేఖావలోకనం ‘

సమీక్షురాలు : యడవల్లి శైలజ ( ప్రేమ్) ఉత్తరం, లేఖ ఎలా పిలిచినా ఆ మాట వింటేనే ఒక్కసారిగా బాల్యంలోకి వెళ్ళిపోతాం. పోస్ట్ మాన్ సైకిలు బెల్లు శబ్ధం విని ఆతృతతో , ఆనందంతో అందుకుని దాన్ని చింపి చదివేదాక మనసు ఊరుకోదు. ఈ ఉత్తరాల్లో రాసే ప్రతి అక్షరం రాసిన వారికి, చదివిన వారికి గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. అమ్మకు, నాన్నకు, స్నేహితులకు, పిన్నికి, బంధువులకి, ప్రేమికులకు రాసిన ఉత్తరాలే మనకు తెలుసు. ‘ఈనాడు తెలుగు […]