April 20, 2024

అత్రి మహర్షి

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు అత్రి ఒక మహా ఋషి.అత్రి సప్తర్షి మండలంలో ఏడవ ఋషిపుంగవుడు అంటే దైవిక వృత్తాంతం ప్రకారం సప్త ఋషులలో చివరివాడు, నాలుక నుండి ఉద్భవించినట్టుగా నమ్ముతారు. వైఖానస సంప్రదాయాలను అనుసరించి మహామునులను నలుగురుగా నిర్ధారించారు. వారు అత్రి, భృగువు, మరీచి, కష్యపుడు.అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు అంటే బ్రహ్మ దేవుని మనస్సు లోనుంచి పుట్టినవాడు బ్రహ్మదేవుడు అత్రి మహమునితో తనకు సృష్టి కార్యములో సాయపడటానికి పుట్టించాను అని చెపుతాడు అత్రి […]

నాన్న…

రచన: చంద్రశేఖర్   అమ్మ కడుపులో ఉన్నపుడే, నాకోసం ఎదురుచూశావు.. నాకోసం ఎన్నో బొమ్మలు తెచ్చావు… నా భవిష్యత్ కోసం ఎన్నో కలలు కన్నావు… నేను పుట్టగానే పండగ చేశావు…   నన్ను గాలిలోకి ఎగురవేసి పట్టుకుని ముద్దాడి మురిసిపోయినావు…. నీ గుండెను పూలపాన్పుగా చేసి నన్ను జోకొట్టి నిద్రపుచ్చావు…..   నా చిట్టి పాదాలు కందిపోకుండా నీ అర చేతులు పై నడక నేర్పించావు… ఎత్తుకుని లోకాన్ని చూపించావు… అమ్మ వద్దన్నా గారం చేశావు….. అడగకుండానే […]

ఇప్పుడన్నీ…

  రచన: – సాంబమూర్తి లండ.     అవి ఎవరివైనా కానివ్వండి జీవితాలన్నీ గతితప్పిన గమనాలే.   సంపాదన ఎరలకు చిక్కుకుని విలవిల్లాడుతున్న చేపలు సుఖాల వలల్లో పడి పంజరాల పాలవుతున్న పావురాలు స్వార్ధం మొసళ్ళకు ఆహారమైపోతున్న జీవితాలు అవినీతి అనంత బాహువులతో మనిషిని ఒడిసిపట్టి అమాంతం మింగేస్తోంది   ఉన్నతంగా ఉజ్వలంగా బతకాలన్న ప్రతి ఆశా ఓ కొత్త రెక్క ఓ లేత చిగురు! ఎన్ని రెక్కలుంటే ఆకాశం అంత చేరువ ఎన్ని ఆశలుంటే […]

మౌనం.

రచన: విజయలక్ష్మి కొఠారి.   రూపు లేని నేను, రూపము లోని స్పందనను. అనుభవములోని అనుభూతిని, అవగాహా న్ని, అతీతాన్ని, జీవములోని చలనాన్ని. భాష లేని నేను భాష లోని భావాన్ని. సహనాన్ని నేను,  మౌనాన్ని నేను. నీ చుట్టూ నేనే, నీ తోడు నేనే. నీ రూపు నిశ్చలమై, చివరకు చేరేను … నాలో మౌనాన్ని నేను. మౌనాన్ని నేను, నీలో, నీ చుట్టూ మౌనాన్ని నేను, మౌనం ఎంత మనోహరమో, మౌనం ఎంత కర్కశమో, […]

మాయచేయు మాంత్రిక

రచన: డా|| బాలాజీ దీక్షితులు పి.వి   వెన్నెల హంస వాలిందా పున్నమి రేయిన గుండె కొలనుపై   కన్నె కలువ విచ్చిందా వలపుల సడి వేణువు స్వరమై   పరిమళ సుమం తాకిందా మయ మరపుల మధుాలికై   కలల మాటు కంత్రిక   ఓ సొగసుల మాంత్రిక   నీవు మాయ చేసి మాయమయ్యే దేవతవు కాని అక్కరతీర్చే ఆర్తివో కనురెప్పల కాంచే శక్తివో అనే నమ్మకం ఎప్పుడో సడలింది…      

మాలిక పత్రిక మే 2021 సంచికకు స్వాగతం…

    Jyothivalaboju Chief Editor and Content Head Maalika Magazine మిత్రులు, రచయితలు, పాఠకులందరికీ మనఃపూర్వక స్వాగతం.. మాలిక పత్రికను ఆదరిస్తున్న మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇటీవల మాలిక పత్రిక తరఫున నిర్వహించిన కథలపోటి ఫలితాలు వచ్చేసాయి.. మాలిక పత్రిక, మంథా భానుమతిగారు కలిసి నిర్వహించిన ఉగాది కథలపోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన పది కథలను ఈ మాసపు సంచికలో ప్రచురిస్తున్నాము. విజేతలందరికీ అభినందనలు. ఎప్పటిలాగే మీ అందరినీ అలరించి, ఆనందింపజేయడానికి […]

1. నివురుకప్పిన నిప్పు – ఉగాది కథలపోటి

రచన: పోలంరాజు శారద “ఈ రోజు గెస్ట్స్ వస్తున్నారు. మీరిద్దరూ మీ గదిలోకెళ్ళి కూర్చోండి?” అప్పటి దాకా చెట్లకు నీళ్ళుపట్టి వరండాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న ఆయన కోడలి మాటలకు భార్యకు కళ్ళతోటే సైగ చేసి. “అట్లాగేనమ్మా! వసూ పద చల్లగాలి మొదలయింది. లోపల కూర్చుందాము. ” కిట్టయ్య అని అందరికీ తెలిసిన ఆ పెద్దమనిషి మెల్లిగా లేచి లోపలికి నడవగానే వసుంధర కూడా లేచి వెళ్తూ, నీలిమ ముఖం చిట్లించుకొని ఏదో గొణుక్కోవడం కనిపించింది. […]

2. మేడిపండు జూడ – ఉగాది కథలపోటి

రచన: డా. కె. పద్మలత నీలిమ స్కూల్కి వెళ్ళడానికి రడీ అయి టిఫిన్ బాక్సు బ్యాగులో పెట్టుకుంటూ ఆఫీసుకెళ్ళడానికి బయటికి వెళ్తున్న భర్త దగ్గరకొచ్చి ”ప్లీజ్ ! ఈ రోజు నన్ను స్కూల్ దగ్గర దించి మీరు వెళ్ళండి. ఆటో అతను రానన్నాడు” అంది. ”వారానికి రెండు రోజులు రాడు అతను, మీరు గట్టిగా అడగరు. సరే, తొందరగా రా, నాకు ఆఫీసుకు లేట్ అవుతుంది’ ”వస్తున్నా!” అని ఇంటికి లాక్ వేసి బయలుదేరి స్కూటర్ మీద […]