March 29, 2024

అర్చన 2020 – నువ్వేం సాధిస్తావ్

రచన: జి. రంగబాబు టార్గెట్ ఐ. ఐ. టి. అంటూ నువ్వు నీ కొడుకుని జైలు లాంటి క్లాసు రూముల్లోకి పంపేస్తున్నావ్.. నాన్నవై నందుకు నిన్నేమీ అనలేక నాకిలాంటి చదువొద్దు అనే ధైర్యం చేయలేక పాపం అలాగే బందీగా పడివుంటున్నాడు ఆ పసివాడు నువ్వెప్పుడైనా ఆలాంటి జైలు గోడల మధ్య బ్రతికావా? నువ్వెప్పుడైనా బండెడు పుస్తకాలు మోస్తూ నీ బడికెళ్లావా? మరెందుకు నీ కొడుక్కి ఈ శిక్ష? వాడే పాపం చేశాడని నీ లక్ష్యాలన్నీ వాడిపై రుద్దుతున్నావ్? […]

అర్చన 2020 – నేను ఆడదాన్ని కాను

రచన: కిరణ్ విభావరి స్త్రీ శరీరంలో బంధింపబడిన మనిషిని నేను ఓ మనిషిని నీలాంటి మనిషిని నీలో సగమైన మనిషిని నాలో దాగి ఉన్న ఆశల కెరటాలు ఈసడింపుల మధ్య నలిగిపోతే, బలహీనతకు బలమైన సాక్ష్యానిగా కన్నవారికి బరువైన బాధ్యతగా మిగిలిపోయిన నీ సాటి మనిషిని నీలాంటి మనిషిని నీ ప్రతి విజయం వెనుక నేనున్నానని నువ్వంటే, మురిసిపోయాను!!! కానీ నన్ను నీ వెనకే ఉంచేశావని తెలుసుకోలేకపోయాను భాష లేని కన్నీరుని కనుపాపలలో కప్పి, నిన్ను మేము […]

అర్చన 2020 – పండుటాకుల వసంతం

రచన: భైతి దుర్గయ్య పాలిచ్చి పెంచిన మమకారం పాతాళానికి దిగజారిన వేళ నడక నేర్పిన నాన్నతనం నయవంచనకు తలొగ్గిన సమయాన అందరు ఉన్నా అనాథల్లాగా దినమొక యుగంలా బతుకు సాగదీస్తూ జీవితాన్ని ధారగా వంశవృక్షాన్ని పెంచి రాలిపోతున్న పండుటాకుల దీనగాథలు వినేదెవ్వరు వారిని ఓదార్చేదెవ్వరు కాసులకై పరుగెత్తే కాల గమనంలో ఆత్మీయత అనుబంధాలు మటు మాయం పరాయి దేశాల విలాస మోజులో పతనమవుతున్న మానవ విలువలు ఆస్తులు అంతస్తులను పెంచే పేరాశలో కనుమరుగవుతున్న కన్న పేగులు కాటికి […]

అర్చన 2020 – భువి స్వర్గంగా మార్చు

రచన: వై చంద్రకళ ఓమనిషి, నీ గమ్యం చేరే వరకూ ఆగక సాగాలి నవ సమాజ స్థాపనకు నడుం బిగించాలి అవినీతి, అరాచకం ప్రబలిన లోకంలో ప్రాణానికి, మానానికి గడ్డిపోచ విలువైనా ఇవ్వక అధికారాల కోసం అంతస్తులకోసం ప్రాకులాడుతూ మనిషి పాపపుణ్యాల చింతన మరచి మంచి, మానవత్వమన్న ఆలోచన లేక అధోగతిలోకి పయనిస్తున్నవారిని ఆపాలి ప్రజలంతా దైర్యంగా మనగలగాలి మరో అందమయిన ప్రపంచాన్ని నిర్మించాలి స్వార్ధాన్ని విడచి, కలిసికట్టుగా నడచి సొంత లాభాన్ని కొంత మానుకోవాలి చేయి,చేయి […]

అర్చన 2020 – మాతృవేదన

రచన: ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి పాకావని పాయసం చేసా, నవ్వావని నువ్వుండలు వండా గడప దాటితే గారెలు, అడుగులేస్తే అరిసెలు నీ ప్రతి చర్యా ఒక పండగ చేసా. కాని నువ్వేమి చేసావ్? నడవ లేక నే పడిఉంటె . నవ్వుతూ నడిచి పోయావు ఓపికలేక నేనుంటే. విలాసముగా విడిచి వెళ్ళావు పళ్ళులేక ఆకలి తీరక నేనుంటే పంచభక్ష్యాలు పసందుగా ఆరగించావు నీ ప్రతిచర్యా నే పండగ చేస్తే నే చెయ్యలేని ప్రతి పని. నువ్వు హేళన […]

మాలిక పత్రిక జులై 2020 సంచికకు స్వాగతం

yothivalaboju Chief Editor and Content Head నమస్కారం.. పాఠక మిత్రులు, రచయితలు అందరికీ స్వాగతం.. మాలిక పత్రికలో మంచి వ్యాసాలు, కవితలు, కథలు మీ అందరినీ అలరిస్తున్నాయి అని భావిస్తున్నాను. అదేంటోగాని ఈ సంవత్సరం 2020 అసలు లేకుంటే బావుండు అనిపిస్తుంది కదా. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుని అప్పుడే ఆరునెలలు గడిచిపోయాయి. ఎవరనుకున్నారు హ్యాపీ కాస్తా వరస్ట్ కి మారుతుందని. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తోన్న కరోనా ఇంకా చల్లబడలేదు. అసలు రోజులు ఎలా గడుస్తున్నాయో […]

రాజీపడిన బంధం – 6

రచన: కోసూరి ఉమాభారతి “అల్లుడు శ్యాంప్రసాద్ చిన్నప్పటి నుండీ కూడా గొప్ప క్రీడాకారుడు కదా…. అలా ఆటల్లో ఎదుటివాడిని ఓడించి, తను గెలవడమే ధ్యేయంగా జీవిస్తారు కదా క్రీడాకారులు. దుర్గాప్రసాద్ చెప్పంగా శ్యాం, వాళ్ళ నాన్న కూడా అలాగే ఉండేవారంట. శ్యాం ఎందులోనూ ఓటమి ఎరుగడట. అతని చదువు కూడా స్పోర్ట్స్ స్కాలర్షిప్స్ తోనే అయిందట” క్షణమాగారు.. నాన్న చెప్పేది మౌనంగా వింటున్నాను. “దుర్గాప్రసాద్ చెప్పినదాన్ని బట్టి అల్లుడుగారి బాల్యం, పెంపకం, వ్యక్తిత్వం పై నాకు కొంత […]

గజల్

రచన: డా. భీంపల్లి శ్రీకాంత వెల్లువలా ఉప్పొంగే కడలి అలలదెంతా ఆరాటం ఉవ్వెత్తున ఎగిసిపడే జలపాతాలదెంతా ఆరాటం మంటలై ఎగిసిపడే అగ్గిరవ్వలను చూస్తుంటే చలిని పోగొట్టే వేడిదనపువాడిదెంతా ఆరాటం అజ్ఞానాన్ని తరిమేసే జ్ఞానజ్యోతులను చూస్తుంటే చీకటిని పారదోలే వెలుగుకిరణాలదెంతా ఆరాటం ఆటుపోట్ల అలజడులు జీవితాలను కమ్ముకుంటే నిత్యగాయాలను చెరిపేసే కాలానిదెంతా ఆరాటం హృదయాన్ని సాంత్వనపరిచే కన్నీటిని చూస్తుంటే దిగులును పోగొట్టే మనిషి గుండెదెంతా ఆరాటం తూర్పున ఉదయించే సూర్యోదయాన్ని చూస్తుంటే అంధకారాన్ని పోగొట్టే ఉషాకిరణాలదెంతా ఆరాటం కట్టతెగి […]

నిష్క్రమణ…

రచన: చిత్రపు లక్ష్మీ పద్మజ సుమతీ కాఫీ తీస్కురా ఎన్ని సార్లు చెప్పాలి. వినబడట్లేదా లేక విననట్టున్నావా అరిచాడు విశ్వం. అదిగోండీ అక్కడే పెట్టాను. చూస్కోండి, మీకు కాఫీ ఇచ్చే ఇటొచ్చాను సంజాయిషీగా చెప్పింది సుమతి. “సర్లే” కసిరాడు విశ్వం ఇంతలోపే మమ్మీ బాక్సు అయ్యిందా.. ఇంకా పావు గంటే టైం ఉంది అరిచాడు రాజా, సుమతి కొడుకు. అయిపోతుందిరా ఒక్క నిమిషం గబగబా కూరలో ఉప్పు, కారం వేసి అన్నం పెట్టి బాక్సు మూత పెట్టింది. […]

లోవరాజు కధలు – సూర్రావు లెక్కల పుస్తకం

రచన: రవీంద్ర కంభంపాటి తిరిగి ఊరెళ్లిపోవాల్సిన రోజొచ్చేసింది. ఏంటో నిన్న గాక మొన్నొచ్చినట్టు ఉంది. అప్పుడే వెళ్ళిపోతున్నావా అని మా అమ్మ ఒకటే గొడవ. ‘సరేలే. నువ్విలా ఏడుపు మొహం పెట్టేవంటే. ఇంకెప్పుడూ రానని’ తనతో అంటూంటే, లోవరాజుగాడొచ్చేసేడు. కారేసుకుని ! స్టేషన్ దాకా దింపడానికి కారెందుకని అడిగితే, డిక్కీ తీసి చూపించేడు. ఓ పెద్ద క్యాను నిండా ఆవు నెయ్యి, తేగల కట్టలు, సంచీడు మొక్కజొన్నపొత్తులూ, ఓ పెద్ద కరకజ్జం ప్యాకెట్టు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. […]