అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 48

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య అన్నమయ్య ఈ సంస్కృత కీర్తనలో మహావిష్ణువును కీర్తిస్తున్నాడు. కృష్ణావతారంలో చేసిన కృత్యాలను వివరిస్తూ బహుధా ఉల్లేఖిస్తూ… ఆ పరమాత్మను శరణువేడుకుంటున్నాడు. కీర్తన: పల్లవి: జడమతిరహం కర్మజంతురేకోఽహం జడధినిలయాయ నమో సారసాక్షాయ ॥పల్లవి॥ చ.1. పరమపురుషాయ నిజభక్తిజననసులభాయ దురితదూరాయ సింధరహితాయ నరకాంతకాయ శ్రీనారాయణాయ తే మురహరాయ నమో నమో నమో ॥జడ॥ చ.2. నగసముద్ధరణాయ నందగోపసుతాయ జగదంతిరాత్మాయ సగుణాయ మృగనరాంగాయ నిర్మితభవాండాయ ప- న్నగరాజశయనాయ నమో నమో ॥జడ॥ చ.3. దేవదేవేశాయ దివ్యచరితాయ బహు-

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 47

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య మానవ జన్మ ప్రాముఖ్యాన్ని తెలియని వారుండరు. కానీ, అజ్ఞానం, అరిషడ్వర్గాలకు బానిసై అకృత్యాలు చేస్తుంటారు. పశ్చాత్తాపంతో తేరుకుని తెలుసుకున్నవారు చాలా తక్కువగానే ఉంటారు. ఆ విషయం తెలుసుకొని ఆచరణలో పెట్టే జనం ఇంకా తక్కువగా ఉంటారు. అలా ఆచరణలో పెట్టినవారు మాత్రమే కృతార్థులవుతారు. అన్నమయ్య సంకీర్తన ప్రాముఖ్యాని గ్రహించమంటున్నాడు. ఇకనైనా మేలుకోండి అంటున్నాడు. ఋగ్వేదంలో చెప్పబడిన “విష్ణోర్ముకం వీరాణి ప్రోవచాం” అనే శ్లోకమాధారంగా శ్రీనివాసుని స్తోత్రం చేత, సంకీర్తన చేత సేవించడమే వేదం

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 46

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య ఈ కీర్తనలో “త్రికరణశుద్దిగా చేసిన పనులకు..దేవుడు మెచ్చును లోకము మెచ్చును” అని హెచ్చరిస్తున్నాడు అన్నమాచార్యుడు. అసలు త్రికరణశుద్ధి అంటే ఏమిటి? త్రికరణాలు అంటే ఏమిటి? అవి 1.మనసా (మన ఆలోచన, సంకల్పం) 2.వాచా (వాక్కు ద్వారా, చెప్పినటువంటిది) 3.కర్మణా (కర్మ, చేతల ద్వారా) మనలో చాలామందికి మనస్సులో ఒక సంకల్పం ఉంటుంది. అది ఎదుటివారి మెప్పు కోసమో, లేక మన సంకల్పం బయల్పరచడం ఇష్టం లేకో, లేదా మరొక కారణం చేత అనుకున్నది

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 45

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య జీవుడి ప్రాణాన్ని ఒక పక్షిలా..చిలుకలా..హంసలా భావించి తత్త్వాలు చెప్పడం మనకు చాలా కాలంగా ఉన్న ఆచారమే! ఇది ఒక తత్త్వప్రబోధకమైన కీర్తన. వీటిని తెలుగుదేశంలో తత్త్వాలు అని పొట్టిపేరు గట్టిగా ప్రచారంలో ఉంది. ఐతే ఇప్పటి యువతరానికి ఆమాటకొస్తే జనబాహుళ్యానికి తత్త్వము అంటే అర్ధం తెలియదు తత్త్వాలు అంటే అంతకంటే తెలియదు. అన్నమయ్య ఆత్మ పరమాత్మల గురించి “చిలుక” అనే భావంతో మనకు తత్త్వబోధ చేస్తున్నాడు. కీర్తనలోని యధాతధ అర్ధంకన్నా గూడార్ధాలే ఇందులో

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 43

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య స్వామీ! శ్రీవేంకటేశ్వరా! నాది కుక్కబతుకైపోయింది. కొన్నాళ్ళు లౌకిక విషయాలు, మరికొన్నాళ్ళు సంసార భవ బంధాలు అంటూ అటూ ఇటూ వెంపర్లాడుతూ, కాట్లాడుతూనే ఉన్నాను. పసరం లాగా జీవించాను ఇంతకాలం. మంచి చెడుల విచక్షణ లేనివాడనయ్యాను. నన్ను గాచి రక్షించవలసినది నీవే. అంతా నీదే భారం అంటూ వృధాగా గడచిపోయిన వ్యర్ధకాలాన్ని నిందిస్తూ వాపోతున్నాడు అన్నమయ్య ఈ కీర్తనలో. కీర్తన: పల్లవి: అటు గొన్నాళ్లందాఁక యిటు గొన్నాళ్లిందాఁక కటకటా శునకపుగతియాయఁ గావవే ॥పల్లవి॥ చ.1

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 42

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య కర్మ సిద్ధాంతం ప్రకారం మనం అనుభవించే  ఆగామి, సంచితము, ప్రారబ్ధము అనే మూడు కర్మలను ఉద్దేశించి “మీకిక పనిలేదు…వెళ్ళిపొండి” అంటున్నాడు. తను శ్రీవేంకటేశ్వరుని పరమ భక్తుడనని తెలుపుతూ తనని వదిలేయమని వాటిని కోరుతున్నాడు. కీర్తన: పల్లవి: ఉమ్మడికర్మములాల వుండఁ జోటు మీకు లేదు యిమ్ముల నెందైనాఁ బోరో యివి లేనిచోటికి    ॥పల్లవి॥   చ.1 పెట్టినది నుదుటను పెరుమాళ్ళ లాంఛనము దట్టమై భుజములందు దైవశిఖామణిముద్ర నెట్టన నాలుకవిూఁద నీలవర్ణునామమిదె అట్టె హరిదాసులకంటునా పాపములు        

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 41

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య   అన్నమయ్య శ్రీనివాసుని ఘనతను గురించి మనకు వివరిస్తున్నాడు. శ్రీమహావిష్ణువే అన్నిటికీ మూలము అని ఎలుగెత్తి చాటుతున్నాడు భక్త హృదయాలకు. ఆ వివరాలను ఈ కీర్తనలో చూద్దాం.   కీర్తన: పల్లవి: అన్నిటి మూలం బతఁడు వెన్నుని కంటెను వేల్పులు లేరు                         || అన్నిటి || చ.1. పంచభూతముల ప్రపంచ మూలము ముంచిన బ్రహ్మము మూలము పొంచిన జీవుల పుట్టుగు మూలము యెంచఁగ దైవము యితఁడే కాఁడా                           ||

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 40

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య   శ్రీమహావిష్ణువు ఈ విశ్వానికంతటికీ ఆదిమూలం, భర్త, కర్త సర్వం తానే. ఆ విష్ణుమూర్తి రూపమైన శ్రీనివాసుని ఆర్తితో వేడుకుంటున్నాడు అన్నమయ్య. ఈ భవ బంధాలనుండి, ఈ లంపటాలనుండి నీ అభయ హస్తం చాచి మమ్ములను రక్షించు దేవా అని కీర్తిస్తున్నాడు అన్నమయ్య ఈ కీర్తనలో.   కీర్తన: పల్లవి: విభుడ వింతటికి వెరపుతో ననుగావు అభయహస్తముతోడి ఆదిమూలమా            || విభుడ ||   చ.1. పలులంపటాలచేత బాతువడి పాటువడి అలసితి గావవే

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 39

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య ఒక దొంగకు ఒక పాపాత్మునికి తల్లియైన స్త్రీ ఎవరికీ తన మొహం చూపలేక ఒంటరిగా మసలుతున్న రీతిని మనం గత జన్మలనుండి తెచ్చుకున్న పాపపుణ్యాలు రహస్యంగా ఖర్చవుతూనే ఉంటాయి అని ప్రభోదిస్తున్నాడు అన్నమయ్య ఈ కీర్తనలో. కీర్తన: పల్లవి: ముచ్చుగన్నతల్లి చేరి మూలకు నొదిగినట్టు తెచ్చినసంబళమెల్ల దీరుబో లోలోనె ||ముచ్చు|| చ.1.దప్పముచెడినవానితరుణి కాగిట జేరి అప్పటప్పటికి నుస్సురనినయట్టు వొప్పయినహరిభక్తివొల్లని వానియింటి కుప్పలైనసంపదలు కుళ్ళుబో లోలోనె ||ముచ్చు|| చ.2.ఆకలిచెడినవాని అన్నము కంచములోన వోకిలింపుచు నేల

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 38

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య ఎవరికి ఎవరు దిక్కు? వచ్చేటప్పుడు భూమిపైకి ఒంటరిగా వస్తున్నాము. వెళ్ళేటప్పుడు ఒంటరిగానే వెళ్తున్నాం. ఎవరికి ఎవరు? ఈ బంధాలన్నీ అశాశ్వతం. అక్కడా ఇక్కడా ఆ శ్రీనివాసుడే మనకు దిక్కుయై రక్షిస్తున్నాడన్న విషయం మరవకండి అని ప్రభోదిస్తున్నాడు అన్నమయ్య ఈ కీర్తనలో. కీర్తన: పల్లవి: ఎవ్వరు గల రెవ్వరికి ఇవ్వల నవ్వల నితఁడే కాక ॥పల్లవి॥ చ.1. ముద్ద సేసినటు మొదలఁ గడుపులోఁ బెద్దగాఁ దాఁ బెరుగునాఁడు ఒద్దనెవ్వరుండిరొకరైనా ఒద్దికైన బంధుఁడొకఁడేకాక ॥ఎవ్వ॥ చ.2