April 24, 2024

అమ్మమ్మ – 43

రచన: గిరిజ పీసపాటి ఆ రోజు షాపుకి రానని ముందే చెప్పి ఉండడం వల్ల ఇంట్లోనే ఉండిపోయింది నాగ. కాసేపటికి ఢిల్లీ వచ్చి అమ్మమ్మతో కబుర్లు చెప్పి, నానిని తీసుకొని పనికి వెళ్లిపోయాడు. పదకొండు గంటలకల్లా వంట ముగించిన వసంత, ముందుగా అమ్మమ్మకి భోజనం వడ్డించింది. అమ్మమ్మకి మడి, ఆచారం, ఎంగిలి వంటి పట్టింపులు ఎక్కువ. కనుక వీళ్ళతో కలిసి తినదు. అమ్మమ్మ తినగానే, నాని కూడా రావడంతో అందరూ కలిసి భోజనాలు ముగించి కాసేపు విశ్రాంతి […]

అమ్మమ్మ – 42

రచన: గిరిజ పీసపాటి “ఇంతకీ విషయం నీకు ఎలా తెలిసిందో చెప్పనేలేదు!?” అన్న కూతురుతో “మీ మామగారి నాటకం హైదరాబాదులో జరిగినప్పుడల్లా నేనా విషయం పేపర్లో చదివి తెలుసుకుని, ఒకసారి ఆయన్ని కలిసి మీ యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటాను”. పదిహేను రోజుల క్రితం రవీంద్రభారతిలో ఆయన నాటకం ఉందని తెలిసి ఎప్పట్లాగే వెళ్తే, ఆయన జరిగిన విషయం చెప్పి, మిమ్మల్ని, నన్ను కూడా నానా మాటలు అన్నారు. అవి విని నేను భరించలేకపోయాను”. “ఆయన కన్నా వయసులో […]

అమ్మమ్మ – 41

రచన: గిరిజ పీసపాటి వీళ్ళ నవ్వులు విన్న అన్నపూర్ణ ఆంటీ తలుపు తీసి, వీళ్ళను చూస్తూ “ఎన్నాళ్ళు అయిందండీ మీరు ఇలా హాయిగా నవ్వగా చూసి. అన్నయ్య గారు వెళ్ళిపోయాక మీరందరూ అసలు నవ్వడమే మర్చిపోయి, మర మనుషుల్లా మారిపోయారు. మీ ఇంట్లో మళ్ళీ మునుపటిలా నవ్వులు వినిపిస్తే ఎంతో సంతోషంగా అనిపిస్తోంది. మీరు నలుగురూ ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి” అంటూ మనస్ఫూర్తిగా దీవించారు. అప్లికేషన్ పోస్ట్ చేసి, చాలా రోజులు ఇంటర్వ్యూకి పిలుపు వస్తుందేమోనని […]

అమ్మమ్మ – 40

రచన: గిరిజ పీసపాటి వసంత చెప్పిన విషయం విన్నాక నాగ కూడా నిర్ఘాంతపోయి “అదేంటి వసంతా! మీ నాన్న ఇంటికి కూడా రాకుండా అలా ఎలా వెళ్ళిపోయారు? అసలు మనం చేసిన తప్పేంటి? ఆ రోజు మీ తాతకి కూడా మరీ మరీ చెప్పాను కదా! ఒక్కసారి మీ నాన్నను ఇంటికి పంపమని. ఆయన ఈ విషయం మీ నాన్నకి చెప్పలేదం టావా!? ఒక వేళ మీ తాత చెప్పినా నాన్నే వినలేదా!? ఇప్పుడు మనం ఏం […]

అమ్మమ్మ – 39

రచన: గిరిజ పీసపాటి అయినా, వచ్చిన కార్యం ముఖ్యమైనది కనుక ప్రసన్నంగానే ఆయనతో “అవన్నీ నిజం కాదు మామయ్యగారు. ఒక్కసారి ఇంటికి రండి. ఇన్నాళ్లు మేమెందుకు అక్కడికి రాలేదో, అసలు ఆయనకి, నాకు మధ్య జరిగిన గొడవేమిటో వినండి. ఆ తర్వాత మీరే శిక్ష విధించినా నేను, పిల్లలు భరిస్తాము. ఈ ఒక్కసారి నా మాట మన్నించండి” అని వేడుకుంది. “నన్ను అభిమానించేవారు, నేను తమ ఇంటికి వస్తే చాలు అనుకునేవారు చాలామంది ఈ ఊరిలో ఉన్నారు. […]

అమ్మమ్మ – 37

రచన: గిరిజ పీసపాటి తల్లి చెప్పిన విషయం మొత్తం విన్నాక వసంత తోక తొక్కిన త్రాచులా పైకి లేచింది. “అసలెందుకీ దాగుడుమూతలు? ఇక్కడాయనకి ఏం లోటు జరిగిందని వెళ్ళిపోయారో నాకర్ధం కావడం లేదు. కుష్ట మామ అబద్ధం చెప్తున్నారని నాకప్పుడే అనుమానం వచ్చినా, ఢీల్లీ మామ కూడా వెళ్ళొచ్చి ఆయన మన ఊరిలో లేరనేసరికి నిజమే అనుకున్నాను. చిన్నప్పటి నుండి మన ఇంట్లో మనిషిలా ఉంటూ ఢిల్లీ మామ కూడా అబద్ధం చెప్తాడని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు […]

అమ్మమ్మ – 36

రచన: గిరిజ పీసపాటి అన్నపూర్ణ గారు రెండు కాఫీ గ్లాసులు తెచ్చి వసంత చేతికిచ్చి “తమ్ముడికి, చెల్లికి ఇచ్చి రామ్మా!” అనడంతో మారు మాట్లాడకుండా గ్లాసులందుకుని, తమ ఇంట్లోకెళ్ళి ఇద్దరికీ కాఫీ ఇచ్చి వచ్చింది వసంత. మరో రెండు గ్లాసుల కాఫీ తెచ్చి తల్లీకూతుళ్ళకి ఇచ్చారావిడ. మౌనంగా కాఫీ తాగేసి తాము వచ్చిన విషయం చెప్పింది నాగ. ఆవిడ ఎప్పటిలాగే ప్రశాంతంగా అంతా విని “తప్పకుండా మీ అన్నయ్య గారు ఆయనకు ఫోన్ చేసి చెప్తారు. మీరు […]

అమ్మమ్మ – 35

రచన: గిరిజ పీసపాటి కొన్ని విషయాలు మనం ఎంత దాచాలనుకున్నా దాగేవి కావు కనుక అన్ని విషయాలూ ఒక్క తమ ఆర్థిక ఇబ్బందులు తప్ప ప్రసాద్ గారితో వివరంగా చెప్పింది నాగ. జరిగినదంతా విన్నాక ఆయన చాలా బాధపడి “అయ్యో! మీరు పిల్లలు ఇంత బాధలో ఉన్నారని తెలియదు మేడమ్! ఎవరికైనా హెల్త్ బాగోలేదేమో అవసరమైతే తెలిసిన డాక్టర్ దగ్గరకు తీసుకెళ్దామని వచ్చాను. మీరు ధైర్యంగా ఉండండి. సర్ వచ్చేస్తారు. మిమ్మల్ని పిల్లల్ని వదిలి వారు మాత్రం […]

అమ్మమ్మ – 34

రచన: గిరిజ పీసపాటి పండుగ వెళ్ళిన ఐదు రోజులకే ఇంట్లో బియ్యంతో సహా సరుకులన్నీ నిండుకున్నాయి. వసంత చెల్లిని తీసుకుని వీళ్ళు నెలవారీ కిరాణా సరుకులు తీసుకుని షాపుకి వెళ్ళి ఐదు కేజీల బియ్యంతో పాటు, అవసరమైన సరుకులు ఇమ్మని అడిగింది. తండ్రి ప్రతీనెలా ఆ షాప్ లోనే కిరాణా సామాను అరువుగా తీసుకొని జీతం రాగానే సొమ్ము చెల్లించేవాడు. డబ్బు తండ్రి కట్టినా సరుకులు మాత్రం పిల్లలే తెచ్చేవారు కనుక వసంత వెళ్ళి సరుకులు అడగగానే […]

అమ్మమ్మ – 33

రచన: గిరిజ పీసపాటి పరిస్థితులు ఇలా ఉండగానే పెద్ద పండుగ అని పిల్చుకునే ముచ్చటైన మూడురోజుల పండుగ వచ్చింది. భోగీ పండుగ రోజు ఉదయాన్నే ‘ఢిల్లీ’ అని అందరూ పిలుచుకునే ‘లక్ష్మణరావు’ అనే అబ్బాయి వేరేవాళ్ళ ద్వారా పెదబాబు ఇంట్లోంచి వెళ్ళిపోయాడనే విషయం తెలిసి వీళ్ళింటికి వచ్చాడు. నాగ వాళ్ళు వైజాగ్ లో కాపురం పెట్టిన కొత్తల్లో చెంగల్రావు పేటలో వీళ్ళు అద్దెకుండే ఇంట్లోనే మరో వాటాలో అద్దెకుండేవారు ఢిల్లీ వాళ్ళు. ఢిల్లీ అమ్మానాన్నలను నాగ ‘పిన్ని, […]