June 24, 2024

“పడతి! ఎవరు నీవు?” కథలపోటి ఫలితాలు

అభినందనలు… శుభాకాంక్షలు… శ్రీ శారదా సత్యనారాయణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ , మాలిక పత్రిక సంయుక్త నిర్వహణలో “పడతీ! ఎవరు నీవు?” శీర్షికన కథల పోటి ప్రకటింపబడింది. ఈ పోటీకి అనూహ్యమైన స్పందన వచ్చింది. వందకు పైగా కథలు వచ్చాయి… ముందుగా మేము ఉత్తమమైన 25 కథలను పుస్తకంగా అచ్చువేయాలి, రచయితలకు తలా రెండు కాపీలు ఇవ్వాలని అనుకున్నాము. కాని ఉత్తమమేమోగాని , చాలా మంచి కథలు ఎక్కువ రాలేదు. అందుకే పుస్తక ప్రచురణ వద్దనుకుని అయిదుగురికి […]

అర్చన కథల పోటి – దీర్ఘ సుమంగళీ భవ!

రచన: ఎస్. జి. జిజ్ఞాస “వాడికి కోర్టులో శిక్ష పడకుండా తప్పించుకున్నాడనుకో…. ఏంచేస్తావు నాన్నా?” ఈ ప్రశ్నే రఘురాంను ఎంతో ఉద్వేగానికి గురిచేస్తోంది. కూతురు రాసిన ఉత్తరంలోని ఆ వాక్యాన్ని చదివిన ప్రతిసారీ మనసులో మెదిలే విపరీత ఆలోచనను తలుచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. ఈ మూడేళ్ళలో ఎన్ని వందల సార్లు చదివాడో ఆ ఉత్తరాన్ని….పరుపు కింద పెట్టుకున్న ఆ ఉత్తరాన్ని రాత్రి పడుకునేటప్పుడు తడిమి చూసుకోవడం అలవాటైంది. “ఎందుకండీ! ఆ ఉత్తరాన్ని రోజూ చూస్తూజరిగినదంతా గుర్తుతెచ్చుకొని పదే […]

అర్చన కథల పోటి – వాళ్ళూ మనుషులే

రచన: జి.యస్.లక్ష్మి సాయంత్రం అయిదుగంటలయింది. ఆఫీసులోని తన సీట్లోంచి లేచి, పక్కనున్న షోల్డర్ బేగ్ అందుకుంటున్న వేణు “డాడీస్ పెట్…స్వీటీ ఈజ్ ద బెస్ట్” అంటూ తన యెనిమిదేళ్ళ కూతురు స్వీటీ పాడినపాట తో పెట్టుకున్న రింగ్ టోన్ తో మొబైల్ మోగడంతో దాన్ని తీసేడు. వెంటనే భార్య వనజ గొంతు “మన స్వీటీ స్కూల్లో లేదుటండీ. స్కూల్ నించి ఫోన్ వచ్చింది.” అంటూ ఆదుర్దాగా వినిపించింది. ఒక్కసారి అతని బుర్ర పనిచెయ్యడం మానేసింది. కాస్త తేరుకుని, […]

అర్చన కథల పోటి – సెలెబ్రిటి

రచన: పోలాప్రగడ జనార్ధనరావు ” ‘సెలెబ్రిటి’ అంటే ఎవరు నాన్నా?” నాని అడిగిన ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పాలా అని ఆలోచనలో పడ్డా. “నాకు అర్థమయ్యేటట్టు చెప్పు. నీకు తెలుసున్నదంతా చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చెయ్యకు నాన్నా” నీరసంగా, నిస్సత్తువుగా, మంచం మీద పడుకున్న నా ఒక్కగానొక్క కొడుకు ‘నాని’ని చూసేసరికి, నాలో ఏదో ఆందోళన. అది కప్పిపుచ్చుకునేందుకు మొహం మీద నవ్వు మాస్క్ పులుముకొని “సెలెబ్రిటీ అంటే… సెలెబ్రిటీ అంటే… గొప్పవాళ్ళు” అన్నా. “అంటే గొప్పవాళ్ళందరూ […]

అర్చన కథల పోటి – నేనూను

రచన: అఫ్పరాజు నాగజ్యోతి “ షాప్ కి వెళ్ళాలంటే భయమేస్తోంది లతా. రాత్రుళ్ళు నిద్ర కూడా పట్టడంలేదు. తెల్లవారుతోందంటే చాలు గుండెలు దడదడలాడుతున్నాయనుకో! ఏ రోజుకారోజు ‘ ఈవేళే ఆఖరు , రేపటినుండీ ఉద్యోగానికి ఛస్తే వెళ్ళను ‘ అనుకుంటాను. అయితే ఇంటికి చేరుకోగానే వరండాలో మంచంపైన నీరసంగా మూలుగుతున్న అమ్మా, బట్టలచిరుగులని దాచేందుకు విఫలయత్నాలు చేస్తున్న చెల్లెళ్ళూ కనిపిస్తారు. అంతే, అందాకా తీసుకున్న నిర్ణయం కాస్తా వీగిపోతుంది. ఏమిటోనే ఈ జీవితం ! “ ఉష […]

అర్చన కథల పోటి – పథకం

రచన: మన్యం రమేష్ కుమార్ సంగీతం క్లాసు పూర్తయ్యాక బైటికొచ్చి ఆ దారి వెంట నడవసాగారు సుదీప్తి, నీరజ. ఆ సందు చివరికి వెళితే మెయిన్ రోడ్ వస్తుంది. అక్కడి వరకూ వెళ్లి అక్కడ ఆటో ఎక్కి ఇద్దరూ ఉమెన్స్ హాస్టల్ కి వెళతారు. “నీ వల్ల సంగీతం నేర్చుకోవాలన్న నా కల కొంతవరకైనా నేరవేర్చుకోగలుగుతున్నానే..” అంది నీరజ. సుదీప్తి నవ్వి “అది నీ కల మాత్రమే కాదు. నాది కూడా..” అంది. సుదీప్తి, నీరజ ఇద్దరూ […]

అర్చన కథల పోటి – రక్షణ కవచం

రచన: శ్రీ శేషకల్యాణి గుండమరాజు – USA సాయంత్రంవేళ రైల్వేస్టేషన్ జనంతో కిటకిటలాడుతోంది. రైళ్లు ఎక్కేందుకు వేచి ఉన్న వాళ్ళు కొందరైతే అప్పుడే రైలు దిగి సామాన్లతో స్టేషన్ బయటకు వెళ్లేవారు కొందరు. ఆ రద్దీలో తన సూట్ కేసు పై కూర్చుని కొంచెం తాపీగా ఆ రోజు వార్తాపత్రిక తిరగేస్తున్నాడు రాఘవ. వార్తాపత్రికలో ప్రస్ఫుటంగా ప్రచురించిన వార్త ఒకటి రాఘవ దృష్టిని ఆకర్షించింది. అది ఒక యువతి కనబరచిన ధైర్యసాహసాలకు సంబంధించినది. ఊరి పొలిమేరల్లో ఎవరో […]