April 20, 2024

“ఇంటర్నేషనల్ కల”

రచన: కవిత బేతి “అమ్మూ! పడుకుందాం రా” భోజనం టేబుల్ మీద పెట్టేసి, హాల్లో ఆడుకుంటున్న కూతురిని బెడ్రూములోకి లాక్కెళ్ళింది శివాని. అక్కడే కూర్చొని లాప్టాపులో చేస్తున్న పని ఆపి, ఓసారి నిట్టూర్చి, రెండుచేతులు తలపైన పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు రవి. రవి ఆర్కిటెక్ట్. శివాని మేనమామ కూతురే. చిన్నప్పటినుండి కాదుగాని, ఇంటర్, డిగ్రీలలో ఉన్నప్పుడు మనసులు కలిసాయి. ఇరువైపులా అంగీకారంతో ఆనందంగా పెళ్లి జరిగిపోయింది. పచ్చని పల్లెటూరంత స్వచ్ఛమైన ప్రేమ శివానిది. ఒకరంటే ఒకరికి ప్రాణం. […]

చంద్రహారం.

రచన- కిరణ్మయి గోళ్లమూడి. “ఈ ఏడాది ఇల్లు సంగతి చూడు సూర్యం! గోడలు పెచ్చులూడిపోతున్నాయి! కాంపౌండ్ గోడ విరిగిపోయింది. నీకు చాలా ఖర్చు ఉంది!” అంది కౌసల్య కంచంలో మిరప పళ్ళ పచ్చడిలో కాచిన నెయ్యి వడ్డిస్తూ. “అవునమ్మా!.. పంట డబ్బు చేతికి వచ్చాక ఇల్లు బాగు చేయిద్దాం! ఉగాదికి రెడీ అయిపోతుంది!” అన్నాడు సూర్యం ముద్ద నోట్లో పెట్టుకుంటూ. “సున్నాలు వేసి కూడా ఆరేళ్ళయింది.” పాతబడి పోయి, వెలిసి పోయిన గోడలు చూస్తూ దిగులుగా అంది […]