October 16, 2021

ఔషధ విలువల మొక్కలు – 3

రచన: నాగ మంజరి గుమ్మా 11. *చూత పత్రం* చూత పత్రమేది? చూడగ తెలియునా? * మామిడదియె కాద మంగళమ్ము* తోరణమున, చేరు తొలి పూజ దేవుని* ఔషధముగ నాకు లమరియుండు* శ్రీ గణేశ పూజా పత్రాలలో చూత పత్రం ఒకటి. మంగళకరమైన మామిడి దీని మరో నామము. లేత మామిడి ఆకును పెరుగులో నూరి దానిని సేవిస్తే అతిసారం తగ్గుతుంది. మామిడి జిగురులో ఉప్పు చేర్చి వేడి చేసి ఔషధంగా పూస్తే కాళ్ళ పగుళ్ళు, చర్మవ్యాధులు […]

ఔషధ విలువల మొక్కలు -2 (6 – 10)

రచన: నాగమంజరి గుమ్మా *దూర్వాయుగ్మ పత్రం* గరిక పోచ యనుచు కడు హీనముగ జూచు* జనుల మనములెల్ల ఝల్లు మనగ* ప్రీతి తోడ మెచ్చె విఘ్నేశ్వరుడు తాను* గరిక నిచ్చినంత గరిమ నిచ్చు* శ్రీ గణేశునికి చాలా ఇష్టమైన పత్రులలో మొదటిది గరిక అనబడే దూర్వాయుగ్మం . గడ్డి పోచ అని తక్కువ చేసి పలికే వీలు లేకుండా తనకు ఎంతో ఇష్టమైన ద్రవ్యంగా స్వీకరించారు స్వామి . ప్రేమగా గరికను సమర్పిస్తే చాలు కోరిన కోరికలు […]

ఔషధ విలువల మొక్కలు

రచన: నాగమంజరి గుమ్మా 1. బృహతిపత్రం చేదు రుచిని గల్గు శ్రీ గణపతి పత్రి* జ్వరము, కఫము కట్టు వాంతులున్ను* వాకుడాకు పేర వర్ధిల్లు బృహతియే* ఏకదంతుని కిది మోకరిల్లె* ఏకదంతాయ నమః బృహతీపత్రం పూజయామి అని పూజించే ద్వితీయ పత్రానికే వాకుడాకు అని పేరు. ఇది కూడా ఔషధమే. జ్వరం, కఫం, వాంతులు మొదలగు వ్యాధులకు ఔషధం. పురుషుల వంధ్యత్వానికి కూడా మంచి మందు. 2. బిల్వ పత్రం శివకేశవులకు ప్రీతిగ* నవలీలగ వేడి మాన్పె […]