March 28, 2024

కంభంపాటి కథలు – కౌసల్య నవ్విందిట

రచన: కంభంపాటి రవీంద్ర శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ తీసుకోగానే , టాక్సీ డ్రైవర్ అడిగేడు .. ‘ఏమ్మా ఇంటర్నేషనలా లేక డొమెస్టికా?’ కిటికీలోంచి బయటికి చూస్తున్న కౌసల్య బదులిచ్చింది ‘ఇంటర్నేషనల్ టెర్మినల్ దగ్గర డ్రాప్ చెయ్యి బాబూ ‘ ‘అమెరికాకా అమ్మా?’ అడిగేడతను ‘అవును బాబూ. మా అమ్మాయి ఉద్యోగం చేస్తూందక్కడ .. ” ‘మా అబ్బాయి కూడా అక్కడే జాబ్ చేస్తున్నాడమ్మా… అట్లాంటాలో ఉంటాడు … రెండుసార్లు చూసొచ్చేను ‘ అన్నాడతను. కౌసల్య ఆశ్చర్యంగా చూసిందతని […]

కంభంపాటి కథలు – మతి”మెరుపు”

రచన: కంభంపాటి రవీంద్ర ఇంటికి వచ్చి షూస్ విప్పుకుంటూంటే , తను చెప్పింది, “పక్క ఫ్లాట్ లో కొత్తగా ఓ ఫ్యామిలీ వచ్చేరు . మళయాళీ వాళ్ళట !” “ఊహూఁ” “ఊహూఁ అనడం కాదు… అతను మీ కాలేజీయేనట” “మా కాలేజీ అంటే…అందులో ప్రతీ ఏడాదీ ఓ బ్యాచ్ బయటకి వస్తూంటుంది… అందులో అతను ఏ ఏడాది బ్యాచో” “ఏ ఏడాదో అయితే… మీకెందుకు చెబుతాను? మీ బ్యాచేనట” “అవునా? అతను చెప్పేడా ?” “లేదు… ఆవిడ […]

కంభంపాటి కథలు – భూలోక రహస్యం

రచన: కంభంపాటి రవీంద్ర బాప్టిస్టు చర్చికి ఎడమ పక్కకి తిరిగితే వచ్చే వీధిలోని మూడో ఇల్లు అచ్యుతమణి గారిది. ఆ ఇంట్లోని నాలుగు వాటాలూ అద్దెకిచ్చేయగా, ఇంటి ముందు ఖాళీ స్థలంలో ఓ మూలనున్న ఎర్ర మందార చెట్టు పక్కనున్న చెక్కల బడ్డీ భూలోకంగాడిది. అచ్యుతమణిగారి ఇంట్లోని ఓ వాటాకి, ఈ చెక్కల బడ్డీకి కలిపి నెలకి యాభై రూపాయలు అద్దిస్తూ, ఐదేళ్ల నుంచీ అక్కడే గడిపేస్తున్నారా భూలోకంగాడి కుటుంబం. అప్పట్లో ఆ వీధికే కాదు, ఆ […]

కంభంపాటి కథలు – దేవుడికి భయం లేదు

రచన: రవీంద్ర కంభంపాటి సాయంత్రం నాలుగున్నర అవుతూంది. ఆదిలక్ష్మి ఇంటిపక్కనే ఉన్న సందులోకి తిరిగి, వీధి వైపుకి వచ్చింది. ఇంటి ముందుభాగం అద్దెకిచ్చేసేరేమో, తిన్నగా వీధిలోకి వచ్చే వెసులుబాటు లేదు. ఆ సందులోంచి బయటికి వచ్చి, వీధిలోకి తిరిగేసరికి బజ్జీల నూనె వాసన నుంచి, కోడిమాంసం, కోడిగుడ్ల వాసన వరకూ రకరకాల వాసనలొచ్చేయి ! వెనక్కి తిరిగి తన ఇంటి వేపు నిరసనగా చూసింది. ఇంటి ముందు శ్రీ సాయి విలాస్ టిఫిన్స్, నూడుల్స్, కర్రీస్ అనో […]

కంభంపాటి కథలు – సమయానికి తగువు మాటలాడెనే

రచన: కంభంపాటి రవీంద్ర ‘ఏవండీ… ‘ ‘ఊఁ’ ‘ఓ మాట’ ‘చెప్పు ‘ ‘రేపటి నుంచీ మనిద్దరం తగులాడుకోవద్దు’ ‘రెండు విషయాలు’ ‘రెండు విషయాలా? ‘అవును… ఒకటి. తగూలాడుకోవద్దు అనడం తప్పు… తగువుపడొద్దు అనాలి… రెండు… మనిద్దరం తగువుపడకూడదు అంటే… రేపటిదాకా ఎందుకు? ఇవాళ్టి నుంచే మనిద్దరం గొడవ పడకుండా ఉండొచ్చుగా’ ‘ముందు మొదటి పాయింట్ చర్చిద్దాం… మీ ఉద్దేశం ఏమిటి? నాకు తెలుగు రాదనేగా?’ ‘రాదని కాదు… సరిగా రాదని… ఒకవేళ వచ్చుంటే… పాయింట్ బదులు […]

కంభంపాటి కథలు.. ఆవిడేమందంటే..

రచన: రవీంద్ర కంభంపాటి ‘ఏమిటి..నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు? ‘ఆఁ..ఏం లేదూ.. పక్కింటి స్వర్ణ గారి మాటలు గుర్తొచ్చి ‘ఏవన్నారు ఆ స్వర్ణ గారు?’ ‘ఆవిడేమందో మీకెందుకండీ అంత ఆసక్తీ? ‘నువ్వేదో అన్నావని అడిగేను గానీ.. ఆవిడ గురించి ఆసక్తీ లేదు.. ఆవిడేమందో వినే శక్తీ లేదూ ‘ ‘ఆఁ.. ఏదో అలా పైకంటారు గానీ.. మీకెప్పుడూ అవతలాళ్ళు ఏం మాట్లాడుకున్నారా అని.. మహా ఇది!.. నిజం చెప్పండి.. అత్తగారి మీద ఒట్టేసి.. మీకాసక్తి లేదని చెప్పండి ‘ […]

కంభంపాటి కథలు – ఏనుగా ? గేదా ? పేనా ?

రచన: కంభంపాటి రవీంద్ర “ఇదిగో ..బయటికెళ్తున్నా .. తలుపేసుకో” “ఎక్కడికేమిటి ?” “బయటకి వెళ్ళేటప్పుడు ఎక్కడికీ అని అడగొద్దని ఎన్ని సార్లు చెప్పాలి ?” “అడిగినన్ని సార్లూ చెప్పాలి” “అంటే ..ఓసారి చెబితే బుర్రకెక్కదన్నమాట” “బుర్రకెక్కేలా చెబితే ఎందుకెక్కదూ ?” “అయితే, నేను బుర్రకెక్కేలా చెప్పనన్నమాట ! !” “మన బలహీనతలనెరడగం కూడా ఓ రకమైన బలం” “ బలహీనతేమిటీ ?” “ఇప్పుడే చెప్పేరు కదా !” “నేను నా బలహీనత చెప్పేనా ??” “అంటే .. […]

కంభంపాటి కథలు – అటకెక్కేడు

రచన: రవీంద్ర కంభంపాటి ఒకటే వాన..రెండ్రోజుల్నుంచీ తెరిపినివ్వకుండా కురుస్తోంది. వర్షానికి, బిళ్ళ పెంకేసున్న ఆ వీధిలో దూరంగా విసిరేసినట్టున్న మండువా ఇంట్లో వంటిల్లు, వరండా తప్ప అన్ని గదులూ కారుతున్నాయి. చేసేదేమీ లేక డెబ్భై ఐదేళ్ల గంగాలక్ష్మిగారు ఆ వరండాలో ముడుచుక్కూర్చుని ఆ వర్షాన్ని చూస్తున్నారు. లోపలికెళ్ళి ఏదైనా వండుకుందామనుకుంటే, కళ్లజోడెక్కడ పెట్టేసుకున్నారో ఏమో, అన్నీ మసకమసగ్గా కనిపిస్తున్నాయి ఆవిడ గాజు కళ్ళకి. రెండ్రోజులైంది ఆవిడ తిని, ఇవాళ ఏదో ఒకటి ఉడకేసేసుకుని తినకపోతే ఈ ప్రాణం […]

కంభంపాటి కథలు – నీచు

రచన: రవీంద్ర కంభంపాటి వేప, నేరేడు, ఉసిరి, సపోటా చెట్లు, అక్కడక్కడా బాదం చెట్లు, కనకాంబరాలు, సన్నజాజి తీవెలు, మల్లె పొదలు, బెండకాయ, బీరకాయపాదులు. ఓ అందమైన వనంలా ఉంది . అందులో బాగా పెద్దగా ఉన్న వేప చెట్టు కింద కట్టిన చప్టా మీద, అన్నయ్యలతో అష్టా చమ్మా ఆడుకుంటూ తను. చిన్నన్న ఏదో జోకేసేడు.. ఒక్కసారి గవ్వలు వదిలేసి మరీ నవ్వేను, వాడంతే. ఎప్పుడూ అలా జోకులేస్తూ నవ్విస్తూంటాడు . దూరం నుంచి అమ్మ […]

కంభంపాటి కథలు – పర్ఫెక్ట్

రచన: రవీంద్ర కంభంపాటి ‘ఈ ఆదివారం మా వకుళ వాళ్ళ గృహప్రవేశం.. ముందే చెబుతున్నాను మనిద్దరం వెళదాం ‘ అని మావారితో అంటే, ‘నాకూ రావాలనే ఉంది.. అసలే ఆమె నీకున్న ఒకే ఒక ఫ్రెండు కదా.. కానీ.. ఈ వీకెండ్ ఆఫీస్ వర్కు.. ఇంట్లోంచి పని చెయ్యక తప్పదు ‘అన్నారాయన ‘ఏదైనా ఫంక్షన్ కి నేనొక్కదాన్నే వెళ్ళడం నాకు ఇష్టం లేదు ‘ ముభావంగా అన్నాను ‘నిన్నొక్కదాన్నీ పంపడం నాకూ ఇష్టం లేదు.. పోనీ.. ఏ […]