April 25, 2024

కంభంపాటి కథలు – కాశీ అత్తయ్య

రచన: రవీంద్ర కంభంపాటి చిన్నప్పటి నుంచీ మా కాశీ అత్తయ్యకి నవలల పిచ్చి. ఈ నవల ఆ నవల అని కాదు.. తెలుగు నవల కనిపిస్తే చాలు.. చదవకుండా వదిలిపెట్టేది కాదు! కాశీ అత్తయ్య అంటే ఆవిడేదో కాశీలో ఉంటుందని కాదు.. ఆవిడ పేరు కాశీ అన్నపూర్ణ.. మా తాతగారు ఆవిణ్ణి కాశీ అని పిలిచేవాడట.. దాంతో అదే పేరు ఆవిడ తరం వాళ్ళకీ, మా తరం వాళ్ళకీ ఖాయమైపోయింది. ఆవిడకి పుస్తకాల మీదున్న ఇంట్రెస్టు చూసి, […]

కంభంపాటి కథలు – వాచీ

రచన: రవీంద్ర కంభంపాటి దాలి నాయుడికి ఐదేళ్ల వయసున్నప్పుడనుకుంటా.. వాళ్ళ నాన్న చిట్టినాయుడు చేతికున్న రోలెక్సు స్మగుల్డు వాచీ చూసేడు. తళతళ మెరిసిపోతున్న ఆ వాచీని మెల్లగా వాళ్ళ నాన్న చేతినుంచి లాగడానికి చూసేడు గానీ చిట్టినాయుడు ఓ మొట్టికాయ మొట్టడంతో ఆగిపోయేడు. అప్పటికైతే ఆగేడు గానీ.. ఆ దాలినాయుడి బుర్రలో ఆ వాచీ అలా ప్రింటైపోయింది. ఆ పై ఏడు, కాకినాడెళ్ళినప్పుడు చిట్టినాయుడు ఓ డూప్లికేటు కాసియో వాచీ కొనిచ్చినా పెట్టుకుంటే నీకున్నలాంటి వాచీ పెట్టుకుంటా […]

లోవరాజు కధలు – సూర్రావు లెక్కల పుస్తకం

రచన: రవీంద్ర కంభంపాటి తిరిగి ఊరెళ్లిపోవాల్సిన రోజొచ్చేసింది. ఏంటో నిన్న గాక మొన్నొచ్చినట్టు ఉంది. అప్పుడే వెళ్ళిపోతున్నావా అని మా అమ్మ ఒకటే గొడవ. ‘సరేలే. నువ్విలా ఏడుపు మొహం పెట్టేవంటే. ఇంకెప్పుడూ రానని’ తనతో అంటూంటే, లోవరాజుగాడొచ్చేసేడు. కారేసుకుని ! స్టేషన్ దాకా దింపడానికి కారెందుకని అడిగితే, డిక్కీ తీసి చూపించేడు. ఓ పెద్ద క్యాను నిండా ఆవు నెయ్యి, తేగల కట్టలు, సంచీడు మొక్కజొన్నపొత్తులూ, ఓ పెద్ద కరకజ్జం ప్యాకెట్టు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. […]

కంభంపాటి కథలు – పెద్దమ్మాయిగారి కథ

రచన: కంభంపాటి రవీంద్ర ‘మధ్యాన్నం బోయనానికి ఇంటికొచ్చెయ్యి .. నిన్ననే దవిలేశ్వరం నుంచి పులసలు తెప్పించి పులుసు కాయించేను .. పైగా మా ఆవిడ ఇయ్యాల ఉదయం పెరుగావడలు చేసింది.. నిన్న ఎండబెట్టిన ఉసిరికాయ వడియాలు ఎండేయంట .. అవి కూడా టేస్టు చూద్దూగాని .. మళ్ళీ మీ హైద్రాబాదు వెళ్ళేవంటే ఇవన్నీ దొరకవు ‘ అంటూ ఉదయాన్నే లోవరాజు ఫోను ‘ఇవన్నీ ఏమో గానీ .. హైదరాబాద్ వెళ్ళేనంటే నీ కధలు మట్టుకు దొరకవు ‘ […]

కంభంపాటి కథలు – మాటరాని మౌనమిది

రచన: కంభంపాటి రవీంద్ర ఒరే నాన్నా .. ఎలా ఉన్నావు ? నీకు ఇదంతా ఎందుకు రాయాలనిపించిందో తర్వాత చెబుతాను .. నీ చిన్నప్పుడు తాతగారికి గుండె జబ్బు బాగా ఎక్కువయ్యి, హాస్పిటల్ లో చూపించుకోడానికి మన ఊరొచ్చేరు గుర్తుందా ? ఒక్క రోజు హాస్పిటల్ లో ఉండేసరికి ‘బాబోయ్ .. నన్ను చంపేయనైనా చంపేయండి .. గానీ ఈ ఆసుపత్రిలో ఒక్క క్షణం కూడా ఉండను ‘ అని తెగ గోల చేసేస్తే మన ఇంటికి […]

కంభంపాటి కథలు – పొలమారిన జ్ఞాపకం

రచన: రవీంద్ర కంభంపాటి ఆ రోజు రాజమండ్రిలో లోవరాజు గాడి ఫ్రెండొకడి స్వీటు షాపు ఓపినింగంట ..ఉదయాన్నే బయల్దేరదీసేడు లోవరాజు గాడు. ‘నీ ఫ్రెండెవడో కూడా నాకు తెలీదు , మళ్ళీ నేనెందుకురా బాబూ’ అంటే , ‘ఏమో ..ఎవరు చెప్పొచ్చేరు .. దార్లో నీకు ఏదైనా కధ దొరుకుతుందేమో ‘ అంటూ నవ్వేసరికి , ఇంక తప్పక బయల్దేరేను. ఊరు దాటి హైవే ఎక్కగానే ఉన్న వీర్రాజు హోటలు దగ్గిర ఆడి బండి ఆపి , […]

కంభంపాటి కథలు – ఇన్ డిపెండెంట్

రచన: కంభంపాటి రవీంద్ర క్యాంటీన్ లో లంచ్ తింటూంటే, ‘హలో ‘ అనే ఎవరో గట్టిగా అనేసరికి అదిరిపడి, పక్కకి చూసేసరికి నవ్వుతూ హైందవి కనిపించింది. ‘ఏమే.. ఎప్పట్లాగే వాళ్లనే చూస్తూ అలా అలా డ్రీమ్స్ లోకెళ్ళిపోయేవా ?’ అంటూంటే ‘నీ మొహం.. అయినా నాకేమైనా వినపడదా ? అంత గట్టిగా హలో అని అరిచేవు ‘ అన్నాను కోపంగా. ‘వీళ్ళిద్దర్నీ చూస్తూంటే ‘కలిసి ఉంటే కలదు సుఖమూ ‘ అనేది మార్చేసి ‘కలిసి భోంచేస్తే కలదు […]

కంభంపాటి కథలు – సీక్రెట్

రచన: రవీంద్ర కంభంపాటి హ్యుండాయ్ వెర్నా కారు హుషారుగా డ్రైవ్ చేస్తున్న వసంత్ బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తూ ‘వావ్ ..వెదర్ భలే రొమాంటిగ్గా ఉంది కద’ అన్నాడు. ‘అందుకేగా సరదాగా బయటికి వెళదామని అడిగింది…ఏసీ తగ్గించండి .. కొంచెం చలిగా ఉంది ‘ కొంటెగా నవ్వుతూ దగ్గిరికి జరిగింది సుమ ‘చలిగానే ఉండనీ .. నువ్వు దగ్గిరకి జరిగితే వేడి పెరిగింది ‘ ఎడం చేత్తో సుమ నడుం చుట్టూ చెయ్యేస్తూ, నవ్వేడు వసంత్ అంత […]

కంభంపాటి కథలు – ఫణి క్రిష్ణ స్టోరీ

రచన: రవీంద్ర కంభంపాటి ఒకటే వాన..రెండ్రోజుల్నుంచీ తెరిపినివ్వకుండా కురుస్తోంది. వర్షానికి, బిళ్ళ పెంకేసున్న ఆ మండువా ఇంట్లో వంటిల్లు, వరండా తప్ప అన్ని గదులూ కారుతున్నాయి. చేసేదేమీ లేక డెబ్భై ఐదేళ్ల పెద్దమ్మాయిగారు ఆ వరండాలో ముడుచుక్కూర్చుని ఆ వర్షాన్ని చూస్తున్నారు. లోపలికెళ్ళి ఏదైనా వండుకుందామనుకుంటే, కళ్లజోడెక్కడ పెట్టేసుకున్నారో ఏమో, అన్నీ మసక మసగ్గా కనిపిస్తున్నాయి ఆవిడ గాజు కళ్ళకి. రెండ్రోజులైంది ఆవిడ తిని, ఇవాళ ఏదో ఒకటి ఉడకేసేసుకుని తినకపోతే ఈ ప్రాణం ఉండబట్టేలా లేదు. […]

కంభంపాటి కథలు – పని మనిషి

రచన: రవీంద్ర కంభంపాటి   ‘హరిణీ .. ఇంకా ఎంత సేపు?.. మీ ఆఫీసుకి టైమవుతూంది .. మొదటి రోజే లేటుగా వెళ్తే బావుండదు ‘ అని కవిత గట్టిగా అరిస్తే , ఏ బదులూ రాలేదు హరిణి గదిలోంచి ‘లేచినట్టే లేచి ..మళ్ళీ నిద్రపోయిందేమో ?’ డైనింగ్ టేబుల్ దగ్గిర  పేపర్ చదువుకుంటూ అన్నాడు మూర్తి ‘ఏమో .. ఎప్పుడు చూసినా ఆ తలుపేసుకునే ఉంటుంది .. ఇంట్లో మనిషి లాగ కాక , ఏదో […]