February 21, 2024

సహజమైన వెండి కిరీటం(కర్ణుని కవచం లాగా…)

రచన: లలితా చెన్నూరి   ఎలా ఉన్నావూ? పిల్లల దగ్గరే ఉన్నావా? వచ్చేశావా? నీ దగ్గర నుంచి ఉత్తరం వచ్చి చాలా రోజులయ్యింది. ఫోన్ చేయడం మనిద్దరికీ నచ్చదుగా, చక్కగా అందమైన లేఖావళి మనకిష్టం. ఎప్పుడైనా పాత విషయాలు గుర్తు చేసుకుంటూ ఉత్తరాలన్నీ ముందరేసుకొని చదువుకుంటూ ఉంటే ఆ అనుభూతి, ఆ ఆనందమే వేరు. రోజంతా అలా చదువుకుంటాము కదా! ఎంత బావుంటుంది. ఇప్పటి తరాలు ఫోన్ లోనే ఎక్కువ సేపు గడుపుతారు. అందుకే వారి మాటలు […]

అత్తగార్లూ… ఆలోచించండి

రచన: ధరిత్రీ దేవి ముక్కమల “ఏంటిది రవీంద్రా! పెద్ద చదువులు చదివావు. మంచి ఉద్యోగం చేస్తున్నావు. నీ భార్య కూడా ఉద్యోగస్తురాలే. . . చివరి రోజుల్లో అనా రోగ్యంతో బాధపడుతున్న మీ అమ్మను దగ్గర ఉంచుకోమంటే వద్దంటున్నావట !!. . . ” “. . . . . . . . . . . . . . ” “మీ అన్నలిద్దరూ పెద్దగా చదువుకోలేదు. అంతంత మాత్రం ఆదాయం వాళ్ళది. […]

వైద్య నారాయణుడు

రచన: G.S.S. కళ్యాణి. సమయం సాయంత్రం అయిదు గంటలు కావస్తోంది. కుర్చీలో వెనక్కి వాలి, కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్న నారాయణ ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు. అంతలో, “బాబుగారూ!! మళ్ళీ పడ్డదండీ! తొరగా రండీ!”, అంటూ నారాయణను కంగారుగా పిలిచాడు కోనయ్య. “వస్తున్నా! వస్తున్నా! ఇంతకీ ఎవరూ? ఆ పడింది ఎవరూ?? నీ భార్య కోకిలేనా?”, అంటూ టేబుల్ పైనున్న స్టెతస్కోపును మేడలో వేసుకుని, కుర్చీలోంచి లేచి ఒక్క ఉదుటున గది బయటకి వచ్చాడు నారాయణ. “నా […]

మారిన తీరు

రచన: లక్ష్మీ రాఘవ కొడుకు వెంకటేశు మాటలు విని శానా కోపం వచ్చింది రామయ్యకు “మా చేత కాదురా. ఎట్లా బతుకుతున్నామో ఆలోచన సెయ్యి.” కాస్త గట్టిగానే అన్నాడు. “ఏమి బతుకు నాయనా? అప్పుడు తాతను చూసినా, ఇప్పుడు నిన్ను చూస్తావున్నా, ఏంది మారింది? అందరి గుడ్డల మురికి వదిలించి మనం పూసుకున్నట్టు వుంది. నీట్ గా ఇస్త్రీ చేసిస్తే వాళ్ళు దర్జాగా ఉంటే చేసిన మనమేమో నలిగిన బట్టల్లోనే వుంటూ…ఛీ …? ఎట్లో నా మొండికి […]

ప్రియనేస్తమా

రచన: శ్యామదాసి వాసుదేవా! విజయక్కా, ఏంటి తల్లీ బిజీనా, మాకు కూడ కొంచం సమయం కేటాయించండి ప్లీజ్! మాటతో పాటే నవ్వూ కలిసుండేది ఝాన్సీకి. ఆ పలకరింపుతో కూడిన చమత్కారం ఇక నాకు వినిపించదు. నాలుగు రోజుల క్రితం నాకు ఫోను చేసి అక్కా! మందుల వల్ల చాలా మత్తుగా వుంటున్నది. కొంచం సేపు పడుకుని నీతో మళ్ళీ మాట్లాడుతాను. ఈ వేళ సత్సంగానికి కూడ అటెండ్ కాలేకపోయాను. అంటూ మాట్లాడిన ఆ స్వరం ఇక నేను […]