April 20, 2024

10. సహవాసం

రచన: శ్రీదేవి కూసుమంచి జగన్నాధం మాష్టారు గారికి లేకలేక  ఇద్దరు కుమారులు ..కలవ పిల్లలు .రాము,శరత్ .ఇద్దరి పిల్లలని ఎంతో ప్రేమతో పెంచేరు.పిల్లలు పెద్ద వాళ్ళ అయ్యారు.ఆ ఉరిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 10వ తరగతి వరకూ చదివించేరు. మాధ్యమిక విద్యకై పట్నములో  ఒక ప్రముఖ కాలేజీలో చేర్చడం జరిగింది.అయితే పట్నము వెళ్ళేక రాము ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు.పూర్వములానే బాగ చదువుతూ ,ఇంటర్ మొదటి సంవత్సరములో కూడ మంచి మార్కులతో కాలేజి ప్రథమ స్థానములో పాసవ్వడం […]

9. వైరాగ్యం

రచన:  విశాలి పేరి   “ఇది మీకు భగవంతుడు ఇచ్చిన ఇంకో జన్మ. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.. జీవిత చరమాంక దశలో ఉన్నారు. కాస్త వైరాగ్య ధోరణిలో ఆలోచించండి ” అని మాతాజీ అన్నారు. “మాతాజీ. చాలా ఆలోచించానండి. నేను వెళ్లకపోతే అక్కడ చాలా గొడవలు జరుగుతాయి.. నా పిల్లలకి లోక జ్ఞానం లేదు. వెళ్ళి అక్కడ అన్నీ వ్యవహారాలు సద్దుమణిగాక తిరిగి వస్తాను..” రత్నమ్మ అంది “మళ్ళీ చెబుతున్నాను.. అవన్నీ వదిలేసే ఇక్కడకు వచ్చారు, ఇప్పుడు […]

8. ఐ టూ…

రచన:  వారణాసి రామకృష్ణ   ఇoడియాలో సరదాగా గడుపుదామని అమెరికా నుండి వచ్చి ఫ్రెండ్ వెంకట్ రెడ్డికి ఫోన్ చేస్తే ఎంతకీ తియ్యట్లేదు.  కంగారుగా వాడి ఇంటికెళ్తే వాళ్ళావిడ ఎదురై భోరుమని ఏడుపు ప్రారంభిoచింది. కొంపదీసి వెంకట్ గాడు గానీ బాల్చి తన్నేసాడా..ఛీ ఛీ పాడు ఆలోచన అనుకుంటూ “ఏంటమ్మా వెంకట్ రెడ్డి ఇంట్లో లేడా” అడిగితే  “అయ్యో అన్నయ్య! రెండ్రోజులైంది,ఆయన ఎవరితో మాట్లాడడంలేదు! గదిలోంచి బైటికి రావట్లేదు. నాకెందుకో భయంగా ఉంది” అంటూ మళ్ళీ భోరుమంది. […]

7. ఏ తీరానికో

రచన: అమరజ్యోతి   చిమ్మ చీకటి. . . అమావాస్య. . . కన్ను పొడుచుకున్నా.  . . కానరాని  వెలుగు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తోంది. కాళ్ళ కింద నలుగుతోన్న ఎండుటాకుల చప్పుడు. దూరంగా  ఎక్కడో  నక్క  ఊళ. . . గుడ్లగూబల అరుపులు.  . . అతి భయంకరమైన   నిశ్శబ్దంలో.  . . . . ష్. . . . . . . . . . . . […]

6. దేవుడే కాపాడాలి

రచన:  రామలక్ష్మి జొన్నలగడ్డ   మా పాత మారుతి కారు సిగ్నల్‌ సమీపించిందో లేదో ఎర్ర దీపం వెలిగింది. ‘‘ఫరవాలేదు, పోనీయ్‌’’ అన్నాడు చెంగూ బాబాయ్‌ డ్రైవరుతో. ‘‘మన ముందో కారుంది సార్‌’’ అన్నాడు డ్రైవర్‌. ‘‘ఎవడ్రా వాడు, రెడ్‌ లైట్‌ పడితే కారాపేయడమే’’ విసుక్కున్నాడు బాబాయ్‌. తెల్లబోయి బాబాయిని చూశాను. నియమపాలనే ధ్యేయమనే తనేనా ఈ మాటన్నది! కానీ బాబాయ్‌ నన్ను చూడ్డం లేదు. కారు తలుపు అద్దంమీద చేత్తో పాముతున్న బిచ్చగాడికోసం – అద్దం […]

5. ఆరవ తంత్రం

రచన: మాచవోలు శ్రీధరరావు   “అదొక పసి కోడె దూడ. గ్రామంలోని తన కోడెల బృందం నుండి తప్పించుకొని దూరంగా గల అడవిలోకి చేరుకుంది. ఎడతెఱపి లేకుండా కురిసిన గాలివాన వేగానికి ఆగలేక దూరంగా గల చెట్ల కొమ్మలపై పడడంతో శరీరానికి చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయి. గాలివాన తగ్గిన తర్వాత చూస్తే పశువుల కాపరి కనిపించ లేదు. తన వారెవరూ కనిపించ లేదు. ఎటు పోవాలో పాలుపోక ఆడవి అంతా తిరిగింది. తిరిగి తిరిగి […]

4. మల్లీశ్వరి

రచన: తులసి భాను   వర్షా ఎప్పుడూ పాటలేనా నీకు..పదా, నీకు షాలిని ని పరిచయం చేస్తాను..తనిప్పుడు సెలెబ్రిటీ తెలుసా.. అని దామిని దాదాపు వర్షని లాక్కెళ్ళుతున్నట్టు తీసుకెళుతోంది .. అబ్బా ఇదొక్కపాటన్నా విననీ, నా ఇళయరాజ పాటకి, నన్ను దూరం చేయకే రాక్షసి..అని అంటోంది వర్ష..ఇయర్ ఫోన్స్ లో పాట వింటోంది కదా తను కొంచెం గట్టిగా మాట్లాడినట్లు తెలీలేదు వర్షకి.. షాలిని , హర్ష, శరత్, దివ్యా ఒకేసారి, వర్ష వైపు చూసారు .. […]

3. చైతన్య కుసుమాకరం

రచన: GSS కళ్యాణీ సచీంద్ర   “తాతయ్యా .. నాకొక కథ చెప్పవా?”, అంటూ రాత్రి భోజనాలు ముగిశాక తాత మాధవయ్య పక్కలోకి చేరి గారాబంగా అడిగాడు అయిదేళ్ల చింటూ. “ఓ అలాగే! నీకొక మంచి కథ చెప్తాను విను. ఒకప్పుడు రాము అని ఒక బాలుడుండేవాడు. వాడు ప్రతి రోజూ సూర్యోదయంకన్నా ముందే  లేచి చక్కగా స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుని పట్ల నమ్మకము, భక్తి కలిగిఉండి బడికెళ్ళి గురువుకు నమస్కరించి, చక్కగా చదువుకుంటూ […]

2. చెంప పెట్టు

  మీనాక్షి శ్రీనివాస్ వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది, అంతకంటే ఎక్కువగా ఉంది దశరథరామయ్య మనసులో ముసురు. కొడుకు ఉదయ్,  తల్లి పోయిందన్న కబురు విని సుమారు పది ఏళ్ళ తరువాత వచ్చాడు ఇండియా. అదీ ఒక్కడే .. అప్పుడు కూడా భార్యా పిల్లలని తీసుకురావాలనే కనీస జ్ఞానం కూడా లేదు. తల్లి బ్రతికి ఉన్ననాళ్ళూ చూడాలని ఉంది ఒక్కసారి వచ్చివెళ్ళమని ఎన్నిసార్లు అడిగిందో, తనెంతగా ప్రాధేయపడ్డాడో లెక్కలేదు ఒకటి కాదు రెండు కాదు పదేళ్ళు .. […]

1. ఉప్పుతాత

రచన: కాశీ విశ్వనాధం పట్రాయుడు   పుడమి తల్లి పచ్చచీర కట్టి నుదుట సింధూరాన్ని ధరించినట్లు ఉంది. సాయం సంధ్యాసమయంలో పచ్చని చెట్లతో  నిండిన కొండవాలు ప్రాంతం మదిని దోచే ఓ అద్భుత దృశ్యం. గున్నమామిళ్ల మధ్య స్వచ్ఛమైన చల్లని గాలిని పీలుస్తూ తన్మయత్వం చెందుతున్న అతడు . ‘సన్నిబాబు’ అన్న పిలుపుతో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసాడు..ఎదురుగా ఉప్పుతాత.. ఉప్పుతాతని చూడగానే  అతడి కళ్ళల్లో మెరుపు..గభాలున దగ్గరికెళ్లి  గట్టిగా కౌగలించుకుని…తాతా బాగున్నావా? ఏంటి సంగతి ఇలా […]