April 25, 2024

చీకటైన జీవితం

రచన: కస్తల పద్మావతి “అక్కా, అక్కా ఆకలి అంటూ స్కూల్ నించి వచ్చి బ్యాగులు పక్కన పెట్టి, సుశీలను వెతుకుతూ ఇల్లంతా కలియ తిరుగుతున్నారు సుశీల చెల్లి, తమ్ముడు. సుశీలది మధ్య తరగతి కుటుంబం. తల్లి చనిపోవడంతో స్కూల్ ఫైనల్ అయిపోయిన సుశీల ఇంట్లోనే ఉంటోంది. చెల్లిని తమ్ముడిని చూసుకుంటూ, ఇంటిపని, వంటపని చేసుకుంటూ , కాలక్షేపానికి నవలలు చదువుతూ ఉంటుంది. ఒక చిన్న ఫాక్టరీలో పని చేసే సుశీల తండ్రిది షిఫ్ట్ డ్యూటీ . ఒక […]

పెద్దాయన (కథ)

రచన-డా. లక్ష్మీ రాఘవ “చిన్నక్కా నేను ఆఫీసు పనిమీద బెంగళూరు వస్తున్నా. నాకు హోటల్ లో అకామిడేషన్ వుంటుంది అయినా ఒకరోజు నీ దగ్గరకి వస్తా“ నీరజ ఫోనులో అనగానే “నీరజా, ఎంత హాపీ న్యూస్ చెప్పావే. నేరుగా ఇక్కడికే వచ్చేసేయ్.కలిసి ఉందాం …” సంతోషంగా అంది సుజాత. “అలా కుదరదులే అక్కా, అక్కడ నాకు మధ్యలో వేరే మీటింగ్స్, కస్టమర్స్ తో డిన్నర్ కూడా వుంటుంది. ఒక రోజు బ్రేక్ తీసుకుంటా నీ కోసం“ అని […]

రామదాసు గారి కుటుంబం (కథ)

రచన: రమా శాండిల్య “నీకు తెలుసా శారదా? మా ఊరిని తలుచుకుంటే నాకు ఆ రోజంతా ఒక తెలియని అనుభూతి మైకంలా శరీరమంతా అవహిస్తుంది. ఎన్నెన్నో అపురూపమైన విషయాలు, బాంధవ్యాలు, బంధుత్వాలు కలగలిపిన ఒక సువాసన మనసంతా నిండిపోతుంది.” “నాకు తెలుసుగా? ఇప్పటికి మూడు వందల ముప్పై సార్లు చెప్పి ఉంటారు! మరోసారి చెప్పండి, వింటాను!” చిరునవ్వుతో అంది శారద. శారదలో నాకు నచ్చేదదే. నేనేది చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా విసుక్కోదు. పైగా నవ్వుతూ వింటుంది. అందుకే […]

శిఖరాగ్ర సమావేశం (కథ)

రచన: మణి గోవిందరాజుల గదిలో పడుకుని తీరిగ్గా పుస్తకం చదువుకుంటున్నది శోభన. అత్తగారు తులసీ వాళ్ళ స్నేహితులూ కిట్తీ పార్టీ చేసుకుంటున్నారు. తాను కూడా ఇప్పటివరకు అక్కడే ఉంది. తంబోలా కాసేపు, బాల్ ఆట కాసేపూ ఆడాక, అత్తగారు, “శోభనా వెళ్ళి కాసేపు నడుము వాల్చమ్మా” అన్నారు. మిగతా అందరూ కూడా “అయ్యో! ఇంత సేపు కూర్చున్నావు. ఇప్పటికే నడుం పట్టేసి ఉంటుంది. పడుకోమ్మా” అన్నారు. వాళ్ళన్నారని కాదు కానీ తొమ్మిదో నెల బొజ్జలో బుజ్జిగాడు గందరగోళం […]

కొత్త కోణం (కథ)

రచన: ప్రభావతి పూసపాటి “మనం నా పరీక్షలు అయిపోయిన వెంటనే వూరు వెళ్లిపోదామే అమ్మమ్మ” కాలేజీ నుంచి వస్తూనే వత్తులు చేసుకొంటున్న కృష్ణవేణి పక్కన కూర్చుని మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద తలవాల్చి గారంపోతూ చెప్పింది స్నిగ్ధ. . “ఏమి ఉన్నట్టు ఉండి గాలి వూరు మీదకి మళ్లింది, బావ ఏమైనా ఫోన్ చేశాడా? వత్తులు చేసుకొంటూనే అడిగింది. అదేమీ లేదులే. పరీక్షలు అయిపోయాక ఇంకా ఇక్కడ మనకి పనేమీ ఉందని అన్నాను అంతేలే, […]

జ్ఞాపకాల బాటలో (కథ)

రచన: జి.వి.ఎల్ నరసింహం “కామూ, ఓ మెత్తని గుడ్డ…, పాతది…,ఏదైనా ఉందా.” పీపుల్స్ బేంకులో, ఉన్నతాధికారిగా పనిచేసి, ఇరవై మూడు సంవత్సరాల క్రితం, రిటైరయిన విశ్వనాధం, వంటింట్లోని భార్యకు వినిపించేటట్లు, వేసిన కేక. “వాటికేం భాగ్యం. మీవే ఉన్నాయి. నిన్న, స్టీలు గిన్నెలు వాడు పుచ్చుకోనివి, ఒకటో, రెండో, పాత పంచలు. ఇంతకూ, దేనికేమిటి.” కామాక్షి, ప్రశ్నను జోడించి ఇచ్చిన జవాబు. “ఈ ఆల్బమ్స్ అన్నీ ధూళి పట్టిపోయేయి. వాటిలో చాలా పాత ఫోటోలు కూడా ఉన్నాయి. […]

అదండీ సంగతి

రచన: గిరిజరాణి కలవల “ఇదిగో, ఇప్పుడే చెపుతున్నా! నా వంతు గుత్తొంకాయ్ కూరమ్మాయ్… ఇంకెవరూ పోటీకి రాకండి.. మెంతికారం పెట్టి.. లేలేత మువ్వొంకాయలు.. అలవోకగా.. అలాఅలా నూనెలో తేలాడుతూ చేసాననుకో… ఒకొక్క వంకాయీ ముచిక దగ్గర పట్టుకుని ‘ కచక్’ అని కొరికితే… బెత్తెడు దూరమే.. ఏదీ… ఆ స్వర్గానికి… మీ అందరికీ తెలిసిందేగా.. నా వంకాయ కూర రుచి ” అంటూ వనభోజనాల వాట్స్ ఆప్ గ్రూపులో మెసేజ్ పెట్టింది వంకాయల వనజాక్షి. “సరే.. వంకాయ […]

శంకరం పెళ్లి

రచన: జీడిగుంట నరసింహ మూర్తి శంకరానికి వారం రోజుల్లో పెళ్లవుతుందనగా గోదావరికి వరదలోచ్చాయి. గోదావరికి గండి పడి నీళ్ళు ఉదృతంగా ఇళ్ళల్లోకి వచ్చేసాయి. మళ్ళీ ఆర్నేల్లవరకు సరైన పెళ్లి ముహూర్తాలు లేవని శంకరం కాబోయే మామగారు వరద కాదు ప్రళయం వచ్చి పడినా పెళ్లి చేసెయ్యాలని నిర్ణయించేసాడు. శంకరానిది ఒక ప్రైవేటు కంపనీలో ఉద్యోగం. “ పెళ్ళికి నాలుగు రోజులు సరిపోవా ?” అన్నాడు లీవ్ లెటర్ ను కోపంగా చూస్తూ శంకం బాస్. అతని బాసుకు […]

వెన్నెల విరిసిన నవ్వులు

రచన: కాదంబరి కుసుమాంబ డజను ఆశల తర్వాత ఎట్లాగో పొత్తిళ్ళలో నిలిచిన పసికూన … ఆడపిల్ల అవడంతో ముక్కు చిట్లించారు. పేరు పెట్టడం, నామకరణ మహోత్సాహాదుల తలపులకు చోటు లేకుండా పోయింది. చంటిది దోగాడుతూ వచ్చి, తినుబండారాల వైపు ఆశగా చూసింది, “ఇదిగో అప్పచ్చీ!” అంటూ ఇచ్చిన అప్పచ్చితో పాటు ఆ పొరుగింటి నాపసాని పలికిన పదమే పిల్లదానికి పేరుగా స్థిరం ఐ కూర్చుంది. ఫలితం అందరూ “అప్పచ్చీ!” అని పిలిస్తే పలికేది. ఇంకేముంది, పల్లెలో అప్పచ్చి […]

అత్తమ్మ

రచన: డా.మీరా సుబ్రహ్మణ్యం స్టాఫ్ రూంలో అదరి ముఖాలు ఏదో తెలియని ఆనందంతో వెలిగి పోతున్నాయి. కారణం ఆరోజు ఒకటో తారీఖు. మధ్యాన్నం రెండు గంటలకల్లా ఆఫీస్ సూపెరింటెండెంట్ గారు ట్రెజరీ నుండి డబ్బు సంచీలో వేసుకుని వచ్చేసారని కబురు అందరికీ తెలిసిపోయింది. “మనం కూడా వెళ్ళి జీతం తెచ్చుకుంటే ఒక పనైపోతుంది”. ఉత్సాహంగా అంది సరళ. కొత్తగా ఉద్యోగంలో చేరిన ఆ పెళ్ళికాని పాతికేళ్ళ అమ్మాయికి జీతం అందిన రోజే సరదాగా షాపింగ్ చేసి చీరలు […]