April 25, 2024

పొద్దు పొడుపు

రచన: రత్నశ్రీ వఠెం “కౌసల్యా సుప్రజా రామా” ఫోన్ లో అలారం రింగ్ టోన్ మోగేసరికి గాఢనిద్రలో ఉన్న నేను ఉలిక్కిపడి లేచాను. “మరో పొద్దు మొదలయింది దేవుడా!, నా జీవితానికి మలిపొద్దు ఎప్పుడవుతుందో??” అనుకుంటూ మంచం దిగాను. మంచం మీద నా మొగుడు గురక పెడ్తూ పడుకుని ఉన్నాడు…. అర్ధరాత్రి దాకా బార్ల వెంట దార్ల వెంట తిరిగి బారెడు పొద్దెక్కేదాకా నిద్రపోతాడు… దేనికైనా పెట్టి పుట్టాలి మరి. నాకు మాత్రం తెల్లవారి నాలుగు గంటలకల్లా […]

పూలమ్మాయి

రచన: లక్ష్మీ పద్మజ సెల్‌ఫోన్‌ రింగ్‌కు మెలకువ వచ్చింది లలితకి. నెంబర్‌ చూసి వెంటనే లేచి కూచుంది. “లలితా నిద్ర లేచావా” అరిచినట్టు అంది మాలినీ దేవి. అయ్యో లేచాను మేడమ్‌ నేనే చేద్దామనుకుంటున్నాను అంది సంజాయిషీగా లలిత. “ఆ పర్లేదు నీ అకౌంట్‌లో నలభై వేలు వేశాను చూస్కున్నావు కదా. ఎంతవరకు వచ్చింది నా శారీ సంగతి” అంది మాలినీ దేవి. అదే చూస్తున్నాను మీ రంగుకు, అందానికి తగ్గది వెతుకుతున్నాను… రోజూ అదే పని […]

ప్రేరణ

రచన: లలితా వర్మ “అక్కడ సీటుంది కూర్చోండి.” తన వెనకగా వినబడిన చిరపరిచితమైన కంఠస్వరం తల వెనక్కి తిప్పేలాచేసింది. వెనుదిరిగిన వాసంతి తన వెనకాల నిలబడిన వ్యక్తిని చూసి సంభ్రమానికి గురైంది. అప్రయత్నంగా ఆమె పెదవులు వుచ్చరించిన పేరు “ప్రభాకర్.” కదులుతున్న బస్ లో ఒకచేత్తో పాపని యెత్తుకుని, మరో భుజానికి బరువైన హాండ్ బాగ్ వేలాడుతుండగా డ్రైవర్ వెనకాలవున్న రాడ్ ని ఆనుకుని నిలబడిన వాసంతికి అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా వుంది. సందేహిస్తూ […]

మీలాంటివాడే చెపితే వినడు, కొడితే ఏడుస్తాడట

రచన: గిరిజరాణి కలవల “మండోదరరావు మూర్ఖత్వం “ “మీలాంటివాడే చెపితే వినడు, కొడితే ఏడుస్తాడట.. చస్తున్నా మీతో.. “ పెనం మీద అట్టు తిరగేస్తూ అంది రావణి. “ఏంటోయ్! ఇప్పుడు నేనేం చేసానూ? నామీద ఎగురుతున్నావు”అన్నాడు మండోదరరావు. “ఏం చేయలేదు అని అనండి… ఏం చేసినా, ఏం చెప్పినా రెట్టమతమే మీరు. ఫలానాది తీసుకురండి అని ప్రత్యేకంగా చెపితే, అది తప్ప మిగతావన్నీ తెస్తారు. తేవద్దు అని ఏదైనా చెపితే అదే విపరీతంగా తెచ్చి పడేస్తారు. అయోమయం […]

రాజకీయ చదరంగం

రచన: గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం బ్రజరాజపురం ఒక మున్సిపాలిటీ. ఆ ఊళ్ళో ఒక జూనియర్ కాలేజీ, రెండు సెకండరీ స్కూళ్ళు, ఒకటి ప్రభుత్వంది, మరొకటి ప్రైవేటుది ఉన్నాయి. ప్రభుత్వంది ఒక ఆసుపత్రి ఉంది. అందులో డాక్టరు ఉంటే మందులుండవు, మందులుంటే డాక్టరుండడు. ఊరు శివార్లలో ఒకే ప్రాంగణంలో శివాలయం, ఆంజనేయ ఆలయం ఉన్నాయి. రెండింటికి పూజారి ఒక్కడే. శేషాచారి. బ్రజరాజపురంలో అందరికి తెలిసిన వ్యక్తి సత్యానందం. ఊరంతా అతనిని సత్తిబాబు గారు అంటారు. సత్తిబాబు మునిసిపాలిటీ […]

మబ్బు తెరలు

రచన: ప్రభావతి పూసపాటి “శ్యామల వాళ్ళ అబ్బాయ్ కి ఈ సంబంధం కూడా కుదరలేదుట” సీట్లో కూర్చుంటూ చెప్పింది కస్తూరి. శ్యామల, కస్తూరి నేను ఇదే ఆఫీస్ లో పదియేళ్ళుగా కలిసి పని చేస్తున్నాము. కోలీగ్స్ కన్నా మంచి స్నేహితుల్లా కలిసి ఉంటాము. ‘శ్యామల పిచ్చిగానీ ఈ రోజుల్లో అబ్బాయ్ నచ్చడమే పెద్ద విషయం అనుకొంటుంటే, రాబోయే అమ్మాయి ఆడపడుచుతో కూడా సఖ్యంగా ఉంటేనే సంబంధం కుదుర్చుకుంటాం అని శ్యామల అనడం నాకే విడ్డురంగా అనిపిస్తోంది “అని […]

ఆదిగురువు

రచన: డా. తంగిరాల. మీరాసుబ్రహ్మణ్యం “ఇదిగో విశాలా మాట” రాధమ్మ పిలుపు విని విసుగ్గా ముఖం చిట్లించి ఆమె దగ్గరకు వచ్చింది రెండో కోడలు విశాల. “చక్రపొంగలిలో పచ్చ కర్పూరం వేయడం మరచి పోవద్దని వంటాయనకు చెప్పు. ” గుర్తు చేసిందామె. ” వాళ్ళకు తెలియదా ఏమిటి? మనం ప్రత్యేకం చెప్పాలా? ” అనేసి పట్టు చీర రెప రెప లాడించుకుంటూ వెళ్ళిపోయింది విశాల. ఆమె చేతికి వున్న అరడజను బంగారు గాజులు మట్టి గాజులతో కలిసి […]

దండోపాయం

రచన: వి ఎస్ శాస్త్రి ఆకెళ్ళ సుబ్బారావు, ఇరవై రెండేళ్ల జీవితంలో సింగల్ బెడ్ నుండి డబల్ బెడ్ కి మారిన కొత్త రోజులు. ప్రక్కన మల్లెపూల సువాసనలు. పదిహేను రోజులుగా అలవాటు పడిన సహవాసం. రెండు రోజుల వ్యాపార ప్రయాణం తరువాత, నిద్రాదేవత గాఢ పరిశ్వంగం. అర్ధరాత్రి తలుపు చప్పుడు. పాపం ఎంత సేపటి నుండి కొడుతున్నారో, కొండచిలువలా చుట్టుకున్న పావనిని విడిపించుకుని సుబ్బారావు మంచం మీద నుండి లేచి కూర్చున్నాడు. ఇంత అర్ధరాత్రి వచ్ఛేదెవరు. […]

మామ్మగారి వంటామె

రచన: రమా శాండిల్య “ఓరి ఓరి ఓరి. . . . ఓ చడీలేదు, చప్పుడూలేదు అజా, ఆనవాలూ మచ్చుక్కి లేవు. . చుంచుమొహంది. . హేంత పనిచేసింది నంగానాచి మొహంది. . . ” హాల్లోని చెక్క ఉయ్యాలలో కూర్చుని గీత చదువుకుంటున్న రంగనాధం తాతగారితో వంటమ్మాయి ‘లక్షుమమ్మ’ గురించి గొంతు తగ్గించి గుసగుసగా చెప్పింది సీతమామ్మా. . . “మరే! శుద్ధ చలితేలు వాటం. . . దీని దుంప తెగ, చేతివాటం చూపించడంలో […]

సహారా

రచన: ఓలేటి స్వరాజ్యలక్ష్మీ. ” కౌసల్యా సుప్రజా రామా పూర్వ సంధ్యా ప్రవర్తతే.ఉత్థిష్ఠ నర శార్దూల కర్తవ్యం దైవ మాహ్నికమ్” స్నానం చేసి తడి తలను భజం మీది తువ్వాలతో తుడుచుకుంటూ వెంకటేశ్వర సుప్రభాతం పాడుతూ దేవుడి గదిలోకి వచ్చిన శంకరానికి పెద్ద పెద్ద ఇత్తడి కుందులలో దీపాలు వెలుగుతూ స్వాగతించాయి. దేవుడి ప టాలు నిండా పువ్వుల దండలు ఇత్తడి సింహాసనంలో దేవుడి విగ్రహాలనిండా ఎర్రని మందారాలు పసుపు తెలుపు నంది వర్ధనాలు పొగడ పూల […]