April 25, 2024

పరిపూర్ణం

రచన : రమ శాండిల్య భానుమూర్తి ఒక మధ్య తరగతి చిరు ఉద్యోగి. అతనికి అమ్మవైపువారి నుంచి కానీ, అత్తగారి వైపునుంచి కానీ ఎటువంటి ఆధారం లేదు. తనకొచ్చే కొంచెం జీతంతో ముగ్గురు పిల్లల్ని చదివించుకోవాలి. సంసారం దానితోనే సర్దుకుపోవాలి. మీనాక్షి, భానుమూర్తికి తగిన భార్య. భర్త తనకిచ్చేదానిలోనే గుట్టుగా సంసారం చేసుకుంటూ, చిన్నపిల్లలకు తనకొచ్చిన కొద్దిపాటి సంగీతము నేర్పుతూ వారిచ్చిన తృణమో ఫణమో స్వీకరిస్తూ, ఇరుగుపొరుగులకు సహాయపడుతూ చుట్టుపక్కల వారిలో మంచి ఇల్లాలు అనే పేరు […]

గిరిజా సదన్

రచన: ప్రభావతి పూసపాటి “కాత్యాయిని” ప్రశాంతం గా వున్న “గిరిజాసదన్” లో ఒక్కసారి మారుమోగినట్టు వినిపించింది ఆ పేరు. గిరిజాసదన్ స్థాపించింది నేనే అయినా అంతా తానే అయి చూసుకొంటున్నారు రామనాథంగారు. గిరిజాసదన్ కేవలం ఎవరి పిల్లలు ఉద్యోగరీత్యా విదేశాల్లో స్థిరపడిపోయారో అక్కడ జీవన విధానంలో ఇమడలేని వారి తల్లితండ్రులకి మాత్రమే ఆశ్రయం కల్పిస్తుంది. అందుకు ఇక్కడికి చేర వచ్చేవారి వివరాలు పూర్తిగా తెలుసుకొంటే కానీ వసతి కల్పించరు రామనాధంగారు. ఆ వివరాలు సేకరిస్తున్నారు. “కాత్యాయిని” ఈ […]

రాములమ్మ- బంగారు కమ్మలు

రచన: డా. కె. మీరాబాయి నేను కాలేజీ నుండి వచ్చేసరికి అలవాటుగా మా ఇంటి గుమ్మం ముందు కూర్చుని ఎదురు చూస్తోంది రాములమ్మ. గేటు తాళం తీసి లోపలికి రాగానే కొబ్బరి పొరక చేతపట్టి ఇంటి ముందున్న కడప బండల మీద రాలిన సుంకేసుల చెట్టు ఆకులు వూడవడం మొదలు పెట్టింది. ” వచ్చి ఎంత సేపు అయ్యింది రాములమ్మా? అందరింట్లో పని అయిపోయిందా? ” ముందు గదికి వేసిన తాళం తీస్తూ యథాలాపంగా అడిగాను. ” […]

చిన్న బతుకులు

రచన -డా. లక్ష్మీ రాఘవ రామయ్య కాలుచాపి దారం పేడుతూ కూర్చున్నాడు. “ఎన్ని దారాలు పేడుతావు? బయట పోయేది లేదు, పైసా సంపాదనా లేదు. ఇంట్లో పొయ్యి ముట్టించి ఎన్నాళ్ళయిందో… రోజువారీ ఎవరో ఒకరు రోడ్డు మీద పంచినప్పుడు తినడమే. రాత్రిపూట అదీ గతిలేదు” భార్య శివమ్మకు ఏడుపు ఆగటం లేదు. “ఏడ్చినా పని దొరుకుతుందా? బయటకే పోకూడదాయే ఏమి చెయాల?” అన్నాడు చెప్పులు కుట్టే రామయ్య శివమ్మను జాలిగా చూస్తూ. రోడ్డు మీద చెప్పులు కుట్టి, […]

” ఇస్పేటు రాజు ❤ ఆఠీను రాణి”

రచన: గిరిజారాణి కలవల ” కంచం ముందు కూర్చుని ఏం ఆలోచిస్తున్నావురా ? నెయ్యి వేసాను, ముక్కలు కలుపు” అంటూ కొడుకుని గదిమింది సావిత్రి. ” ఏంటీ ముక్కలు వేసావా? కోసిందెవరూ? జోకరేంటీ ? ” అన్నాడు రాజు. ” ఏడిసినట్టే ఉంది నీ జోకు.. జోకరట, జోకరు, పొద్దస్తమానం ఆ పేకముక్కల్లో పడి దొర్లుతూంటే, కంచంలో వేసినవి కూరముక్కలని కూడా తెలీకుండా ఉంది నీ బుర్రకి. నా ఖర్మ కొద్దీ దొరికారు ఆ తండ్రీ, ఈ […]

నిష్క్రమణ…

రచన: చిత్రపు లక్ష్మీ పద్మజ సుమతీ కాఫీ తీస్కురా ఎన్ని సార్లు చెప్పాలి. వినబడట్లేదా లేక విననట్టున్నావా అరిచాడు విశ్వం. అదిగోండీ అక్కడే పెట్టాను. చూస్కోండి, మీకు కాఫీ ఇచ్చే ఇటొచ్చాను సంజాయిషీగా చెప్పింది సుమతి. “సర్లే” కసిరాడు విశ్వం ఇంతలోపే మమ్మీ బాక్సు అయ్యిందా.. ఇంకా పావు గంటే టైం ఉంది అరిచాడు రాజా, సుమతి కొడుకు. అయిపోతుందిరా ఒక్క నిమిషం గబగబా కూరలో ఉప్పు, కారం వేసి అన్నం పెట్టి బాక్సు మూత పెట్టింది. […]

హరిలో రంగ హరీ.. జలజం పని హరీ

రచన: గిరిజారాణి కలవల ” ఇదిగో.. చెపుతున్నది కాస్త ఓ చెవిన పడేసుకోండి.. ఆనక మళ్లీ.. నాకు ఎప్పుడు చెప్పావు అంటే ఊరుకోను” .. అంది జలజం . ” అసలు నువ్వు ఏం చెప్పాలనుకున్నావో చెప్పకుండా ఈ నిందా స్తుతేంటే.. ఏం కావాలో చెప్పు.. ఒక్క చెవిలో ఏం ఖర్మ.. రెండు చెవుల్లోనూ గరాటు వేసుకుని మరీ పడేసుకుంటా.. ” అన్నాడు జలజాపతి . ” అబ్బో, మీ ఎకసెక్కాలు చాల్లెండి.. మొన్న కొన్న పుస్తకాల […]

దివి నుండి భువికి

రచన: చెంగల్వల కామేశ్వరి “రేపేనా నువ్వు వెళ్లేది? అడిగాడు శర్మ “అవునండీ! కొంచెం హుషారుగా బదులిచ్చాడు ఈశ్వర్, వచ్చాకా విశేషాలు చెప్పు! అంటున్న మామగారి మాటలకు ‘ఉండేది ఒకరోజు! ఏముంటాయి. ?’ మళ్లీ ఇక్కడికే రావాలి. ఇలాగే ఉండాలి. వాళ్లక్కడ మనమిక్కడ” ఉదాసీనంగా అంటున్న ఈశ్వర్ మొహం చూసి, ఒకసారి దీర్ఘంగా నిట్టార్చారు శర్మగారు . “నిజమే! కాని ఏం చేయగలం? మనకి మాత్రం ఇష్టమా! మనవాళ్లందరిని వదిలి ఇలా ఉండటం . “వలస పక్షుల్లా చెట్టుకొకరు […]

రింగుల జీవన వలయం

రచన: – పిడపర్తి భారతి కాళ్ళు టపాటపా నేల కేసి కొడ్తూ, రెండు చేతులూ బాగా ఆడిస్తూ, ఇంట్లో కొచ్చి, సోఫాలో నాన్న పక్కన బుంగ మూతి పెట్టుకుని కూర్చుంది, కల్యాణి. కల్యాణి కూర్చున్న జోరుకి, గోపాల్రావు గారు చదువుతున్న పేపర్ని కొంచెం పక్కకి జరిపి, కూతురి వైపు చూసి, “ ఏం. తల్లీ.? “ అని, యధాలాపం గా అన్నట్టుగా అంటూ, మళ్ళీ పేపర్ లో దూరిపోయారు. ఒక్క రెండు నిమిషాలు ఆగి, ఇంక లాభం […]

అల

డా.తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం ” అమ్మా! కమల ఆంటీ సిల్వర్ జుబిలీ పెళ్ళిరోజు వేడుకకి నాన్న వస్తున్నారా ” తను వేసుకున్న గులాబి రంగు గాగ్రా చోళీ ఒంటిమీద సరిగ్గా అమిరిందా అని అద్దం ముందు నిలబడి చూసుకుంటున్న అనుపమ అద్దంలో నుండే అమ్మను చూస్తూ అడిగింది. ” నాకెలా తెలుస్తుంది? నేను నా తమ్ముడి ఇంట్లో వున్నాను. మీ నాన్న ఎక్కడో తన ఇంట్లో వున్నాడు. పైగా కమల నాతో బాటు పనిచేస్తున్న నా స్నేహితురాలు. మీ […]