April 20, 2024

మల్లేష్

రచన – డా. లక్ష్మీ రాఘవ బస్టాండు లో బెంగళూరు బస్సుకోసం చూస్తూ వున్నాడు దినేష్. అప్పుడే ఒక డీలక్స్ బస్ వెళ్లి పోయిందట. ఒక పదినిముషాలలో ఆర్డినరీ బస్సు వచ్చింది. ఏదో ఒకటి‘ అనుకుంటూ ఎక్క బోయాడు అతన్ని తోసుకుంటూ “అన్నా ఒక్క నిముషం“ అంటూ లోపలకు దూరిన 12 ఏళ్ల కుర్రాడిని చూసాడు దినేష్. ఒక నిముషంలో లోపలకు దూసుకుపోయి మధ్యగా వున్నఒక సీట్ లో కూర్చున్నాడు ఆ పిల్లాడు. బస్సు ఎక్కాక దినేష్ […]

తెగింపు

రచన: చివుకుల పద్మజ స్టాఫ్ రూమ్ లో కూర్చుని మాటి మాటికి గడియారం కేసి చూపులు సారిస్తోంది రమ్య. ఏంటి, ఇంకా నిర్మల క్లాస్ వదలలేదు అని ఎదురు చూస్తోంది. లాస్ట్ అవర్ ఈ రోజు నిర్మలది. చివరి గంట క్లాస్ తీసుకోవటం చాలా కష్టం. పొద్దుటినుంచి విని విని ఉంటారేమో విద్యార్థులు అస్సలు కూర్చోలేరు, వినలేరు చివరి దాకా. అలాగని ముందు వదిలితే ప్రిన్సిపాల్ గారు ఊరుకోరు. అందరికీ ఇది కత్తి మీద సామే. నిర్మల […]

నెరవేరిన కల

రచన: సునీత పేరిచెర్ల ” తెల్లవారనే లేదు ఇప్పటి నుండే ఏం చేసేస్తున్నావు లక్ష్మీ ” మోహన్ కళ్లు నులుముకుంటూ తన భార్యతో అంటూ హాల్ లోకి వచ్చాడు.. “మర్చిపోయారా ..! ఈ రోజు మనకెంతో ముఖ్యమైన రోజు కదా..మీతో పాటు ఫంక్షనుకు నేను కూడా వద్దామని కాస్త ముందుగానే లేచి పనులన్నీ పూర్తిచేసాను ” కాఫీ కప్పు చేతికందిస్తూ అంది లక్ష్మి…! *** మోహన్ కాలేజీలో లెక్చరర్.. మానవతా దృక్పథం ,ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి.. […]

అమ్మ కోసం

రచన: వంజారి రోహిణి చెల్లికి డెలివరీ టైమ్. అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. దూర ప్రయాణాలు చేసే ఓపిక అసలే లేకపోవటంతో చెల్లెలు గీత తనను పదే పదే బతిమాలడం తోటి తప్పనిసరి పరిస్థితుల్లో కావ్య చెల్లెలి ప్రసవ సమయంలో సాయంగా ఉండేందుకు తన ఇద్దరు చిన్నారులు లిఖిత, నిఖితలను వాళ్ళ నాయనమ్మ, తాతల దగ్గర వదిలి, వారికీ, తన భర్త విశ్వానికి పిల్లల గురించి లక్ష జాగ్రత్తలు చెప్పి అమెరికా విమానం ఎక్కింది కావ్య. పెద్ద కూతురు […]

ప్రజ్ఞ

రచన : సోమ సుధేష్ణ చెట్ల ఆకులతో దాగుడు మూతలు ఆడుతున్న లేత ఎండను చూస్తూ అర్జున్ పచార్లు చేస్తున్నాడు. ప్రతి రోజూ చూస్తున్నదే అయినా ఎప్పటికప్పుడు మొదటి సారి చూస్తున్నంతగా ఆనందిస్తుంటాడు. ప్రకృతిలో వచ్చే మార్పులు ఆయన మనసును తాకకుండా వెళ్ళలేవు. అర్జున్ ప్రకృతి ప్రియుడు. ప్రకృతిలోని ప్రతి జీవిని ప్రేమించే మనసు ఉంది. వాకింగు పూర్తి చేసుకొని పక్కనే ఉన్న ఇంట్లోకి వెళ్తూ ఎదురుగా వస్తున్న జగదీష్ గారిని చూసి నవ్వాడు. ఉదయం నాలుగింటికే […]

తల్లిని మించి ఎవరు?

రచన: శింగరాజు శ్రీనివాసరావు మానస మనసు మనసులో లేదు. పదే పదే మధు మాటలే చెవిలో మారుమోగుతున్నాయి. “మానసా నా మాట విను. ఎంతకాలమిలా ఒంటరిగా జీవితాన్ని గడుపుతావు. నీకంటూ ఒక తోడు కావాలి. భగవంతుడు వేసిన శిక్ష అనుకునో, నా బ్రతుకింతే అనుకునో కష్టాన్ని అనుభవించే రోజులు పోయాయి. నీ ప్రతి బాధ్యతను నా బాధ్యతగా తీసుకుంటాను. నిన్ను నా భార్యగా జీవితమంతా నా గుండెల్లో దాచుకుంటాను.” అతని మాటల్లో నిజాయితి వుంది. కాని అది […]

రేపటి వట వృక్షాలు.

రచన: గిరిజారాణి కలవల మాదాపూర్ లో అదొక గేటెడ్ కమ్యూనిటీ…రో హౌసెస్.. అన్నీ ఒకేలా తీర్చిదిద్దినట్లుండే ఎనభై డ్యూ ప్లెక్స్ విల్లాలు అవి. అక్కడ నివసించే వారు బాగా ధనవంతులూ.. ఉన్నత స్థాయి కుటుంబాలవారే.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులూ, డాక్టర్లు, పెద్ద వ్యాపారస్ధులే. ఇంకా కొందరి పిల్లలు ఫారిన్ కంట్రీలలో స్ధిరపడిపోతే.. పేరెంట్స్ ఇక్కడ ఇళ్లు కొనుక్కుని ఉంటున్నారు. ఎక్కడక్కడ సెక్యూరిటీ గార్డులు ఉండడంతో సేఫ్టీగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఉంటున్నారు. ఈ ఇళ్ల లో వారందరూ […]

సరుడు

రచన: పద్మజ కుందుర్తి నానబెట్టి వడేసిన నూకల్ని రొట్లో వేసి అదరాబదరా దంచుతున్న కాసెమ్మని గోడమిదుగా చూసి,” ఏందొదినో! మంచి వుసిమీద వుండావూ ….ఏంది కత? ఈరోజు మాయన్నకు పలారం వొండి పెడతన్నవే ….ఏంది సంగతీ …” కుశాలగా అడిగింది, పక్కింటి లచ్చిమి. “పెద్ద పలారమేం గాదులే ..కూసింత పాలతాలికలు జేద్దామనప్పా! శానాదినాలాయె పాలతాలికలు జేసి, మీయన్న పొద్దస్తమానుం అడుగుతా నా పెయ్య దీస్తుంటే …ఇప్పటికి కుదిరింది మరి.” సమాధానం జెప్పింది కాసెమ్మ. “సర్లే తూర్పు పొలం […]

జలజాక్షి.. మధుమే( మో) హం

రచన: గిరిజారాణి కలవల “వదినా! ఓ పంకజం వదినా!” అంటూ వీధంత గొంతేసుకుని కేకేస్తూ వచ్చింది జలజాక్షి . ఆ కేక వినపడగానే.. మళ్లీ తెల్లారిందీ దీనికి.. ఈ పూట ఏ అప్పుకోసమో…తెచ్చిన నెల వెచ్చాలు అన్నీ ఈ జలజానికి చేబదుళ్ళు ఇవ్వడానికే సరిపోతున్నాయి.. ముదురుపాకం పట్టిన బెల్లప్పచ్చులా పట్టుకుంటే వదలదు.. అని మనసులో అనుకుంటూ.. పైకి చిరునవ్వు చిలికిస్తూ..”ఏంటి ? జలజం వదినా.. పొద్దున్నే నీ దర్శనం అవందే నాకు తెల్లారదనుకో.. నీ పిలుపే నాకు […]

అమ్మ ప్రేమించింది..

రచన: రమా శాండిల్య ఉదయం మంచి నిద్రలో ఉండగా ఫోన్ రింగ్ కి మెలుకువ వచ్చి ఫోన్ వైపు చూడగా ‘ హర్ష’ అని కనిపించేసరికి ఇంత పొద్దున్నే వీడేందుకు ఫోన్ చేశాడబ్బా అని ఫోన్ తీసి ఏంటిరా నాన్నా అని కొడుకునడిగాను. “అమ్మా చెప్పేది విను”.. వాడి గొంతులో కంగారు విని పై ప్రాణం పైనే పోయింది…. “ఏమైందిరా!” అన్నా కంగారుగా.. “ఏమి లేదమ్మా కంగారుపడకు నాకు తెలిసిన అమ్మాయి ‘పూర్ణి’ సికింద్రాబాదు రైల్వే స్టేషన్లో […]