April 19, 2024

తప్పంటారా ?

రచన: డాక్టర్. కె. మీరాబాయి సరోజ కథనం :- బి ఎ ఆఖరి సంవత్సరంలో వున్న నేను, ఇంటర్మీడియేట్ తప్పి, ఆటో నడుపుకుంటున్న సందీప్ ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని కలలో కూడా వూహించలేదు. అందుకేనేమో ప్రేమ గుడ్డిది అంటారు. మేము వుండే హౌసింగ్ బోర్డ్ కాలనీ కి నేను చదివే కాలేజీ చాల దూరం. నాకు మోపేడ్ నడపడం వచ్చినా మా నాన్నది బండి కొనివ్వలేని ఆర్థిక పరిస్థితి. నన్ను ఇంతవరకు చదివించడమే గొప్ప విషయం. […]

ఇంతేలే ఈ జీవితం

రచన: వసంతశ్రీ కావేరీ ఇంటి పనమ్మాయి వాళ్ళ స్వంత ఊరు వెళ్ళిపోతున్నాదట. అందుకని పని మానేసింది. కొత్త పనిమనిషిని పెట్టుకోవడం అంటే పని తర్ఫీదు ఇవ్వడం చాలా కష్టమైన పని అని ప్రతి ఆడవారికి తెలుసు. కావేరీ పాత పనమ్మాయి లక్ష్మి పొందిగ్గా, నిదానంగా చేస్తూ ఉండడంతో సుఖంగానే ఇన్ని రోజులూ గడిచిపోయాయి. తీరా సత్యవతిని పనిలో పెట్టుకున్నాక కథ మొదటికి వచ్చినట్లయింది.ఏ పల్లెటూరి నుంచి వచ్చిందో కానీ కొత్తగా సిటీలో అడుగుపెట్టిన సత్యవతికి బొత్తిగా ఫ్లాట్ […]

ఇక్కడ జాతకాలు చెప్పబడును.

రచన: గిరిజారాణి కలవల అమ్మ దగ్గరకి వెళ్లి ఈ దసరాకి రెండేళ్లు పైనే అయింది. ఫోన్ల మీద ఫోన్లు చేస్తోంది. చెల్లి అమెరికా లో వుంది కాబట్టి మాటి మాటికి అది రాలేదు.. ఇండియాలో వున్న నువ్వూ అలాగే చేస్తే ఎలాగే? దసరాకి బొమ్మలకొలువు పెట్టడం మీ చిన్నప్పటి నుంచి చేస్తున్నాను.. మీరు రాకపోవడంతో.. మరీ మానేయకూడదని ఏవో నాలుగు బొమ్మలు పెట్టి హారతి ఇచ్చేస్తున్నా… పిల్లలు చిన్నపుడు ప్రతీఏడూ దసరాకి వచ్చేదానివి… ఇప్పుడు వాళ్ళ కి […]

ఆత్మీయులు

రచన: లక్ష్మీ రాఘవ తిరుమల రావు ఆఫీసు నుండీ ఇంటికి రాగానే భార్య కవితతో “షాపింగ్ వెళ్లి వచ్చావా? పని పూర్తి అయ్యింది కదా” అన్నాడు. “వెళ్లి వచ్చాను. అంతా రెడీ… మీరు ఆలస్యం చేశారేమిటి.?” “నా సూట్కేసు సర్దావా??” “అన్నీ అయ్యాయి మీరు స్నానం చేసి రండి. డ్రైవర్ వున్నాడు కదా” “డ్రైవర్ వున్నాడు మనల్ని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి వెడతాడు.” అంటూ బాత్రూం లోకి దూరాడు తిరుమలరావు. ఏరోప్లేన్ లో కూర్చున్నాక కొడుకు […]

ఆ ముగ్గురు – సమీరా

రచన: లత పాలగుమ్మి హై వే మీద రయ్ రయ్ న జిగ్ జాగ్ గా అందరిని ఓవర్ టేక్ చేసుకుంటూ ఒక బైక్ దూసుకు వెళుతోంది. భయమంటే ఏమిటో తెలీదు బైక్ మీదున్న ఆ ముగ్గురు యువకులకు. వాళ్ళే సంతోష్, అమర్, సూర్యాలు. ఒకోసారి ఇలాంటి వాళ్ళ వలనే యాక్సిడెంట్స్ అయి అమాయకులు బలి అయిపోతూ ఉంటారు. ఒకటే నవ్వులు, అరుపులు, కేకలతో ఇంజినీరింగ్ కాలేజీ చేరుకున్నారు. ఫోర్త్ ఇయర్ లో ఉన్న ఈ ముగ్గురు […]

ప్రయత్నం

రచన: రమ శేషు “మామయ్యా, మామయ్యా,” బైట నుండి పిలుస్తూ గేట్ తీసుకుని హాల్ లోకి వచ్చాడు హర్ష. “ఏంటిరా హడా‌వుడి, అమ్మ ఏమైనా కబురు చెప్పమందా!” అనడుగుతూ గది లోంచి హాల్ లోకి వచ్చాడు శేఖర్, హర్ష మామయ్య. “ఏమయ్యా, ఇదేనా రావడం, వదిన బాగుందా” అంటూ మంచినీళ్ళు ఇచ్చింది శేఖర్ భార్య లక్ష్మి. “బాగుంది అత్తయ్యా. మిమ్మల్నందరినీ అడిగానని చెప్పమంది.” అన్నాడు హర్ష మంచినీళ్ళు తాగుతూ. “కబుర్లకేం గానీ, కాఫీ పట్రా, ఎప్పుడు బైల్దేరాడో […]

ఆఖరి కోరిక

రచన: లక్ష్మీ రాజశేఖరుని తన బ్రతుకుకి మిగిలిన చివరి రాత్రి. తెల్లార కూడదని ప్రతిక్షణం తలచుకుంటూ బ్రతికిన రాత్రి. తెల్లారితే తన బ్రతుకు తెల్లారి పోయే రాత్రి. ఇంకా కొద్ది గంటలు మాత్రమే తనకు మిగిలి ఉన్నాయి. అమ్మ గుర్తొచ్చింది. పిచ్చిదానిలా ఎన్ని సంవత్సరాలు కోర్టుల చుట్టూ జైలు చుట్టూ తిరిగింది. కనీసం జైల్లో అయినా ప్రాణాలతో ఉంటే చాలు అనుకుంది. శిక్ష ఖరారు అయిన రోజు అందరి కాళ్ళు పట్టుకుని బతిమిలాడింది. ఛీ! ఎలాంటి అమ్మకి […]

మారిపోయెరా కాలం

డా. కె. మీరాబాయి ముందుగా ఒక మాటకూడా చెప్పకుండా సెలవు పెట్టి వచ్చిన కొడుకును చూసి ఆశ్చర్య పోయింది భారతి. పోయిన నెలలోనే బెంగుళూరు వెళ్ళి కొడుకు ఇంట్లో పదిహేను రోజులు వుండి వచ్చింది. ముప్ఫై అయిదేళ్ళు దాటుతున్నా పెళ్ళి కాని కొడుకు పరిస్థితి తలచుకుంటే భారతికి దిగులుగా వుంటుంది. ఒక అచ్చటా ముచ్చటా లేదు…..పండుగా పబ్బమూ లేదు. పొద్దున్నే ఆ ఎం ఎన్ సి కంపెనీకి పోవడం రాత్రికి వరకు పనిచేసి గూడు చేరడం గానుగెద్దు […]

అమ్మమ్మ అనుభవం

రచన: యశస్వీ రచన “అమ్మా జానకీ !!! నువ్వు, అల్లుడుగారు పిల్లాడిని రాష్ట్రం దాటించి చదివించాలని అనుకుంటున్నారట, , మీ నాన్నగారు అన్నారు. , నిజమేనా!?” అని ఆయాసంగా తన కూతురుని అడిగింది రత్నమాల. “అమ్మా!! ముందు నువ్వు ఆ కర్రల సంచి నా చేతికి ఇచ్చి, ఇలా సోఫాలో కూర్చో!! ” అంటూ జానకి ఆ సంచి తీసుకుని పక్కన పెట్టి, వంట గది నుండి చల్లటి కడవ నీళ్లు తీసుకువచ్చి తల్లి చేతిలో పెడుతూ. […]

నా బంగారు తల్లి

రచన : సోమ సుధేష్ణ “అమ్మకు వంట్లో బాగాలేదు, నిన్ను చూడాలంటుంది. ఒకసారి వచ్చి వెళ్ళు.” బెంగుళూరు నుండి తండ్రి ఫోనులో చెప్పినప్పుడు సుజన మనసులో అలజడి అనిపించింది. “ఏమయింది? అసలు ప్రాబ్లమేమిటి? డాక్టరు చూసాడా?” “రఘువర్మ చూస్తున్నాడు. ఒవేరియన్ కేన్సర్ అని డయగ్నోజ్ చేసారు. ట్రీట్ మెంటు ఇస్తున్నాడు.” “ఎప్పుడు తెలిసింది? రఘువర్మ అంకుల్ బెస్ట్ కేన్సర్ స్పెషలిస్టు.” “నువ్వు ప్రేగ్నెంటు అని చెప్పినపుడు నీకు సాయం అవుతుందని తను అమెరికాకు రావాలనుకుంది. వచ్చే ముందు […]