March 29, 2024

అమ్మజోల

రచన: నాగజ్యోతి రావిపాటి అద్ధరాత్రి 12 గం అవుతున్నా నిద్రపోకుండా ఏడుస్తున్న పిల్లాడిని విసుకుంటూ పక్కగదిలోకి వెళ్లి పడుకున్నాడు శేఖర్. అనితకు ఏమి చేయాలో పాలుపోక ఫోన్లో ఇంగ్లీష్ లల్లబై పెట్టింది. కొద్దిసేపటికి నెమ్మదించిన కొడుకుని చూసి హమ్మయ్య అనుకొని పడుకోబెట్టి . . పాటని అలవాటు చేసిన తల్లి జయంతిని విసుక్కుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు తీర్థయాత్రలకని వెళ్లిన తల్లి ఫోన్ చేయగానే పిల్లాడిని నిద్రపుచ్చడానికి తను పడిన అవస్థలు చెప్తూ ఇంకా […]

*అమ్మ తత్వం*

రచన: లక్ష్మీ రాజశేఖరుని అమ్మ గొంతులో ఉందో, పాటలో ఉందో ఆ మధురిమ, లీనమై పోతుంటాను విన్న ప్రతిసారి ఆ లాలి పాటలో. ఎప్పుడు నిద్రలోకి జారుకునే వాడనో తెలియదు. అదే లాలి పాట మళ్లీ ఇప్పుడు నా కొడుకు కోసం అమ్మ పాడుతోంది. నాకంటే వాడే అదృష్టవంతుడు అనిపించిందో క్షణం. ఆ జ్ఞాపకాలు ఒకటొకటిగా బాల్యపు తలుపులు తడుతుంటే అప్రయత్నంగానే చిన్నతనంలోకి పరిగెడుతోంది మనసు. ప్రతి కొడుక్కి అమ్మ దేవతలా కనిపిస్తుంది. కానీ మా అమ్మ […]

ఆపద్ధర్మం

రచన: డా. తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం రావి చెట్టు నీడన చప్టా మీద కూర్చున్న సుందరం చుట్టూ చూసాడు. ఉదయం పదకొండు గంటల సమయంలో గుడి నిర్మానుష్యంగా వుంది. గర్భ గుడి తలుపులు తెరిచి వున్నప్పుడే అర కొరగా వుంటారు భక్త జనం. ఇక గుడి తలుపులకు తాళం పడ్డాక పిట్ట, పురుగు కూడా కనబడదు ఆవరణలో. ఒక అరటి పండు చేతిలో పెట్టకపోతాడా పూజారి అన్న ఆశతో వచ్చిన సుందరానికి ఆ రోజున తొందరగా పూజ ముగించి, […]

కనువిప్పు

రచన: చిత్రపు లక్ష్మీ పద్మజ ఉదయం ఏడున్నరయింది. సుశీల ఈలోపు ఆరుసార్లు వాకిట్లోకి తొంగి చూసింది. పనమ్మాయి రత్నమ్మ కోసం. గేటు ఇప్పుడు చప్పుడవటంతో మరోసారి చూసింది. రత్నమ్మ. ”ఏమే ఇవాళ ఇంత ఆలస్యం అయ్యింది” అంది సుశీల. ”ఏం చెప్పను అమ్మా వస్తూనే వున్నా, రాత్రంతా మా మరిది తాగేసి వచ్చి పెళ్లాన్ని చితక బాదాడు. గొడవంతా సద్దాుమణిగి పడుకునే సరికి ఆలస్యమైంది. కాస్త ఆలస్యంగా లేచాను. ఇదిగో ఎంత సేపు అంతా చక్కబెట్టేస్తాను”. అంటూ […]

“కళ్యాణ వైభోగమే”

రచన: రాము కోల “పెళ్ళి కుదిరింది అనుకోగానే సరిపోయిందా..రూపాయి ఎంత త్వరగా ఖర్చు అవుతుందో కూడా లెక్కేసుకోవాలి.” “ఎమంటావు మావా!” అంటూ నోట్లో ఉన్న పుగాకు కాడ నవులుతు.. పక్కనే ఉన్న గొపయ్య. వైపు చూశాడు చిదానందం. “ఓసోసి! ఊరుకోవోయ్.. పెళ్లి కుదరటమే మా గొప్ప సంగతి. ఇక రూపాయంటావా? మనందరం లేమా ఏటి, తలా ఓ చెయ్య వేస్తే పిల్లకూడా ఓ ఇంటిది అయిపోద్ది. ” “నువ్వు ఏటి దిగులు పడమాక” అంటూ దైర్యం చెపుతున్న […]

నాకూ!! కూతురుంది….

రచన: సుధ ఆత్రేయ అప్పుడే కోచింగ్ సెంటర్ నుండి వచ్చిన నాకు, నీకు ఈ రోజు సాయంత్రం పెళ్లి చూపులు అని హఠాత్తుగా చెప్పింది అమ్మ. “ఇంత హఠాత్తుగానా అమ్మ!!” అంటే “అవును నా బంగారం!! శాపమో వరమో నాకు తెలీదు కానీ ప్రతి ఆడపిల్ల పుట్టింటిని వదిలి వెళ్లవలసిందే. బహుశా తానెక్కడ ఉన్న దానిని నందనవనంగా మార్చుకోవడం ఒక స్త్రీకి మాత్రమే తెలుసు కాబోలు అందుకేనేమో. అబ్బాయి పేరు మదన్. శ్రీహరికోటలో సైంటిస్ట్ గా పని […]

కొలీగ్

రచన: రామశేషు “రాధా, ఆఫీస్ టైం అవుతోంది. త్వరగా రా.” నవీన్ పిలుపు కి “ఇదిగో, వస్తున్నా.” అని జవాబు చెప్తూనే గబగబా ఇంటికి తాళం వేసి మెట్లు దిగింది రాధ. వెంటనే స్కూటర్ తీసి పోనిచ్చాడు నవీన్. నవీన్ రాధని ఆఫీస్లో దిగబెట్టి తన ఆఫీసు కి వెళతాడు. ఇద్దరివీ ఒకే టైమింగ్స్ కావడం కూడా బాగా కలిసివచ్చింది. వెళ్ళేటప్పుడు కూడా తనే పికప్ చేసుకుని వెళ్తాడు. రోజులేవో సాఫీగా వెళ్తున్నాయి అనేసరికి నవీన్ కి […]

ఇది కథ కాదు

రచన: రాజశేఖర్ “నీ కథలో కంగారుందోయ్ రాంబాబు!” అన్నారు జోగిశాస్త్రిగారు చిరునవ్వుతో, పడకకుర్చీలో వెనుకకు జారపడుతూ. మీ టూత్పేస్ట్లో ఉప్పుందోయ్ అన్నట్టుగా కథలో కంగారేమిటో బోధపడలేదు రాంబాబుకి. తలగోక్కుంటూ “ఆయ్” అన్నాడు అయోమయంగా. ****** మొన్నామధ్యన ఆఫీసుపనిమీద కాకినాడ నుంచి విజయవాడ శేషాద్రిలో కిటికీకి పక్కసీటులో కూర్చుని వెళ్తోంటే ఆ కనిపించే పచ్చని పంటపొలాలు, చెరుకులారీలు, పూరిగుడిసెలు, కరెంటుస్తంభాల మీద కావుమనకుండా ఉన్న కాకులని చూసి భావుకత పెల్లుబుకి సమాజానికి తనవంతు సాయం చేయాలని అర్జెంటుగా నిర్ణయించుకొని.. […]

తల్లి మనసు

రచన: నళిని ఎర్ర పచ్చని మావిడి తోరణాలు కట్టిన గుమ్మంలోకి భర్త చిటికెనవేలు పట్టుకుని అత్తవారింటికి వచ్చిన సావిత్రి గడప లోపలికి అడుగుపెట్ట బోయింది .. వదినా అన్నయ్య పేరు చెప్పి వెళ్ళు అంటూ వరసకు ఆడపడుచులు అంటుంటే వర్థనమ్మ విసుక్కున్నారు చాల్లే సంబడం అవన్నీ అవసరమా పదండి లోపలికి అంటూ కసురుకున్నారు.. ఒక్కసారి ఉలికిపడింది సావిత్రి రామారావు చేయి గట్టిగా పట్టుకుని లోపలికి అడుగు పెట్టింది.. ఆరోజు మొదలు సావిత్రి రోజుకు పది సార్లు ఉలికి […]

అమ్మ మనసు

రచన: కె. మీరాబాయి ( తంగిరాల. మీరాసుబ్రహ్మణ్యం ) శస్త్ర చికిత్స జరిగే గదిలో బల్ల మీద పడుకుని ఉన్నాడు చక్రపాణి. “ చక్రపాణీ! సిద్ధంగా ఉన్నారు కదా? మనసులో ఏ ఆలోచనలు పెట్టుకోకుండా విశ్రాంతిగా ఉండండి. నిజంగా నా జీవితంలో ఈ రోజు ఒక గొప్ప అద్భుతాన్ని చూసాను చక్రపాణీ! ఈ కాలంలో తాము జీవితంలో పైకి వచ్చి, నిలదొక్కుకున్నాక, తమకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం వాళ్ళ బ్రతుకులను ధారపోసిన తలిదండ్రులను పాత సామాను […]