April 20, 2024

పిల్లలు నేర్పిన పాఠాలు

రచన: అపర్ణ క్రోవి పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అని, నా బిడ్డలు నిజంగా ఏ జన్మలోనో నేను చేసిన దానాలకి ప్రతిఫలమే. 19 ఏళ్లకి డిగ్రీ పరీక్షలు రాసిన వెంటనే, ఫారెన్ సంబంధం వచ్చిందని పెళ్లి చేసేశారు అమ్మ నాన్న. పెళ్లి అయిన రెండు నెలలకే, అందరినీ వదిలి, ఆ భగవంతుడి మీద భారం వేసి, ప్రపంచ పటంలో ఏ మూలన వుందో కూడా ఐడియా లేని దేశానికి (బ్రెజిల్) వెళ్లాను మావారితో. […]

పరివర్తన

రచన: వీణ మునిపల్లె “రేపట్నించీ ఉద్యోగానికి వెళుతున్నాను రాజ్యం” “ఏవిఁటండీ ఏమంటున్నారూ…. మీరు ఉద్యోగానికి వెళతానంటున్నారా?” నమ్మలేనట్టుగా, ఆశ్చర్యంగా అడిగింది. రాజ్యం. “ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడేంటి కొత్తగా? అయినా ఈ వయసులో మీకుద్యోగమెవరిచ్చారు? వంట్లో ఓపికుండి, చెయ్యాల్సిన అవసరంమున్నప్పుడు ఏమీ చెయ్యకుండా పెద్దలిచ్చిన ఆస్తులున్నాయని….జీవితం గడిచిపోతుందిలే అని జల్సాగా గడిపేశారు…ఇన్నాళ్ళు గడిచిపోయాక ఇప్పుడర్థమైందా మీకు ఉద్యోగం అవసరమని? ఏదైనా ఉద్యోగం చూసుకోండి అంటే…ఒకరి కింద పని చెయ్యను’ అనేవారు …మరిప్పుడు ఈ నిర్ణయమేంటీ?” ‘కుటుంబ అవసరాలు నడవడానికి, […]

అతులిత బలధామం

రచన: పద్మజ ముడుంబై ఆరేళ్ళ అతులిత్ కొచ్చిన్ లో సముద్రం దగ్గర గల చక్కటి కుటీరం లాంటి క్వార్టర్స్ లో తన తండ్రి బలరాం, తల్లి మానసలతో కలిసి ఉంటున్నాడు. బలరాం ఇండియన్ నేవీలో ఆఫీసర్. మానస పెద్ద కార్పోరేట్ కంపెనీలో మేనేజర్. బలరాం తండ్రి పరంధామం, తల్లి అరుందతి. హైదరాబాద్లో వారికి సొంతిల్లు ఉంది. తల్లిదండ్రులు లేని తన క్లాస్మేట్ మానసను ప్రేమించానని చెప్పగానే కొడుకు ఇష్టాన్ని కాదనలేక మానసతో పెళ్లి జరిపించారు. ఎవ్వరూ లేని […]

కాన్ఫిడెన్స్

రచన: మంజుల దేశ్ పాండే మా అమెరికా ప్రయాణం ఇంకా వారం రోజులే ఉంది. ఇంకా కొనాల్సినవి చాలా ఉన్నాయి. బిడ్డ అయితే.. అమ్మా నువ్వు అనవసరంగా అలసట చేసుకోకు. ఇక్కడ ఇండియన్ స్టోర్స్ చాలా ఉన్నాయి వాటిలో ప్రతి వస్తువు దొరుకుతుంది నువ్వేం హైరాణా పడకు, నీకు కావలసిన మెడిసిన్స్ మాత్రం మరిచి పోకుండా జాగ్రత్తగా తెచ్చుకో అంటూ పాఠాలు మొదలుపెట్టింది ! నా బిడ్డ ఎంత వద్దన్నా.. తల్లిని కదా, నా మనసు ఊరుకోదు […]

వారాల అబ్బాయి

రచన : తాతా కామేశ్వరి రామం స్నేహితులు రామం కోసం ఎదురుచూస్తూ ఎప్పుడు రామం కారు ఆగుతుందా? అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆ హాలు ఆ ఊరిలో కల్లా పెద్ద హాలు. అందులో రామం రిటైర్మెంట్ ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేసి, ప్రతి ఒక్కరూ నేను ముందు అంటే నేను ముందు అనేటట్టు తమ చేతులలో పూలగుచ్ఛం పట్టుకొని నిలబడ్డారు. ఆ జిల్లాకే కలెక్టర్ గా చేసి రిటైర్ అయిన రామం అతినిరాడంబరంగా ఉండి, ప్రతి ఒక్కరికి […]

కంకణాలు – జొన్నరొట్టెలు

రచన: కవిత బేతి ‘ఇవాళ ఎలాగయినా అమ్మకి ఫోన్ చేసి మాట్లాడాల్సిందే…’ ‘ఈయన కూడా ఊర్లో లేరు, క్యాంపులో ఉండగా ఇలాంటి విషయాలు చెప్పినా సరిగా పట్టించుకోరు…’ ‘రేపటికిగానీ ఇంటికి రారు…’ ఆలోచిస్తూ నడుస్తుంది సరిత. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ వాకింగ్ చేస్తుందన్నమాటే కానీ రాత్రి నుండి సరిత మనసు మనసులో లేదు. ముంబైలో ఉండే సరిత అక్క లలిత ముందునాటి రాత్రి ఫోన్ లో చెప్పిన విషయం విన్నప్పటినుండి అసహనంగా ఆలోచనలు సాగుతున్నాయి, […]

ఉనికి

రచన: మంథా భానుమతి సావిత్రికి ఎక్కడ చూసినా అందాలే కనిపిస్తున్నాయి. ఎప్పుడూ తనని విసిగించే ఎదురింటి బుల్లబ్బాయిగారి మనవడి అల్లరి ఆహ్లాదంగా. ఇంటి ముందున్న కాలువలో స్నానం చేసే పంది వరహావతారంలా.. ఆ రోజేం చేసిందో, ఎవరెవరితో తిరిగిందో ఆరా తీసే పక్కింటి అమ్మమ్మగారి ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ కి ఉపయోగపడేలా అనిపించాయి. ఆనందోత్సాహాలతో గాల్లో తేలిపోతున్నట్లు నడుస్తూ ఇంట్లో అడుగు పెట్టింది. ఎవరి పనులలో వాళ్లున్నారు. అయినా ఫరవాలేదు.. అలవాటే తనకి. సావిత్రి అక్క, సీత […]

ప్లీజ్ మైండ్ యువర్ బిజినెస్

రచన: శైలజ రాంషా Awkward : ఇబ్బందికరమైన, వికారమైన, వికృతమైన, చేతకాని – డిక్షనరీ అర్ధం. మనందరం ఎన్నో ఆక్వర్డ్ సిట్యుయేషన్స్ ఎదుర్కొంటుంటాం మన జీవితంలో. పని చేసే చోట, మనం ఉండే చోట! వీటిని ఎంత బాగా ఎదుర్కోగలిగితే అంత త్వరగా ఆ పరిస్థితిలో నుండి బయటపడతాము. రెండు రోజుల క్రితం, సార్థక్ ఫోన్, తను చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొంటూ సోఫాలు డస్టింగ్ చేస్తూ ఆలోచిస్తూంది లత. ఇంతలో, ద్వారం దగ్గర ఎవరో వెలుగుకి […]

అలసిపోతున్న ఆనందం

రచన: విజయలక్ష్మి మూడు జనరేషన్స్ ను చూస్తున్న ఎనబై పదులు వయసులో మా చిన్నతనం, మా పెద్దవాళ్ళను, మా సంతానం ప్రస్తుత వారి పిల్లల జీవనశైలి గుర్తుచేసుకోవా లని పిస్తుంది. మేము ఆరుగురం, ఐదుమంది ఆడపిల్లలo. మాకు ఒక అన్న. ఊరు , ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు దూరం కాకుండానే కొంత మార్పుతో హైదరాబాదులో ఉంటున్నాo కనుక, చదువులకని మా చిన్నాన్న పెద్దమ్మల పిల్లలు, మరొకిద్దరు మగపిల్లలుండేవారు. కాగా ఆడపిల్లలందరికి పొడవాటి వెంట్రుకలుండేవి. ఆ రోజుల్లో క్రాఫ్ […]

మంచుపూల వాన

రచన: రమాదేవి బాలబోయిన “శారదక్కా! ఈరోజు మీరు ఆ భోజనాల ఆటోతో రోడ్ నెంబర్ 13 లోని రాజనందనం అపార్ట్మెంట్స్ కి వెళ్ళి ఫుడ్ డెలివరీ చేయండి” అంది జ్యోతి మధ్యవయస్కురాలైన ఓ స్త్రీ వైపు చూస్తూ. “అలాగేలేమ్మా” అని తలూపుతూ…ఇక తప్పుతుందా అన్నట్లుగా మొహం తిప్పుకుని కౌంటర్ మీద ఉన్న ఐడెంటిటీ కార్డ్ మెడలో వేసుకుంది శారద. మళ్ళీ ఏదో గుర్తొచ్చిన దానిలా…”ఆహ్… అక్కా! వాళ్ళు మనకు పదహారు వేల మూడొందల రూపాయలు ఇస్తారు. ఈ […]