రచన: మంథా భానుమతి చిన్నాకి, అబ్బాస్ తో మాట్లాడ్డానికి సమయం దొరకలేదు. తమ ‘ఇంటి’కి వెళ్లగానే పెట్టె తీసి బట్టలు తడిమి చూశాడు. చేతికి గట్టిగానే తగిలింది. ఫోన్ కూడా తీసి ఇంకొక షర్ట్ జేబులో పెట్టాడు. గుడ్ అంకుల్ ధర్మమా అని నాలుగు షర్టులు, నాలుగు నిక్కర్లు ఉన్నాయి. నజీర్ ఎప్పుడూ తన పెట్టె జోలికి రాలేదు. అబ్బాస్, నజీర్ తోనే ఉన్నాడు. ఇద్దరూ ఒంటెల దగ్గర, వాటికి కావలసిన తిండి చూస్తున్నారు. రేసులు దగ్గర […]
Category: కలియుగ వామనుడు
కలియుగ వామనుడు 8
రచన: మంథా భానుమతి వణుకుతున్న చేత్తో మళ్లీ, ఎన్నోసారో.. చూసింది మెస్సేజ్. ఎన్ని సార్లు చూసినా అవే మాటలు. తల అడ్డంగా తిప్పింది, మాట రానట్లు. “మెస్సేజ్ ఎక్కడ్నుంచొచ్చిందో నంబర్ ఉండదామ్మా? ఫోన్ లో మాట్లాడుతే వస్తుందంటారు కదా?” బుల్లయ్య ప్రశ్నకి మరింత తెల్ల బోయింది సరస్వతి. తనకెందుకు తట్టలేదు? చదుకున్న వాళ్లకంటే చదువురాని వాళ్లు నయం అంటారందుకే. మెస్సేజ్ చూసిన హడావుడిలో బుర్ర పన్చెయ్య లేదు. వెంటనే మెస్సేజ్ మళ్లీ చూసింది. నంబర్ ఉంది. ఏం […]
కలియుగ వామనుడు 7
రచన: మంథా భానుమతి అల్లా ఎందుకు ఒక్కొక్కరికి ఒక్కోలా ఇస్తాడు జీవితాన్ని? నోరంతా చేదుగా అయిపోయింది. “అన్నా ఆ ఎలుగుబంటి గాడు నిన్ను యబ్యూజ్ చేస్తున్నాడా? నీ మీద పడుతున్నాడా?” చిన్నా బాంబేసినట్లు అడిగాడు. అబ్బాస్ కళ్లు పెద్దవి చేసి చూడ్డం తప్ప ఏం మాట్లాడలేక పోయాడు. “నాకు తెలుసన్నా. హోమో సెక్షువల్స్, పీడో ఫైల్స్.. చాలా పుస్తకాల్లో చదివాను. కంప్యూటర్ లో కూడా వాళ్ల గురించి చదివాను.” అబ్బాస్ ఇంకా మిడిగుడ్లేసుకుని చూస్తున్నాడు. “నాకు పన్నెండేళ్లే […]
కలియుగ వామనుడు – 6
రచన: మంథా భానుమతి మళ్లీ ఎలాగా ట్రాక్ కెళ్లాలి. ఆ రోజు చాలా పనే చేయించారు వాళ్ల చేత. ఎప్పడెప్పుడు కాసేపు వాలదామా అని చూస్తున్నారు. చిన్నా టి.వి ఆన్ చేశాడు. వెంటనే ఆన్ అయింది. చిన్నాకి ఆనందంతో గంతులేయాలనిపించింది. అయితే.. ఒక్క దుబాయ్ ప్రోగ్రామ్స్ మాత్రమే వస్తున్నాయి. కేబుల్ కనెక్షన్ లేదు. ఎక్కువ అరేబిక్.. ఏదో ఒకటి. కొత్త మనుషులు, కొత్త పరిసరాలు కని పిస్తున్నాయి. అందులో అరాబిక్ లెసన్స్ ఒక ఛానల్ లో వస్తోంది. […]
కలియుగ వామనుడు – 5
రచన: మంథా భానుమతి హలీమ్ నలుగురికి శిక్షణ ఇస్తుంటే, వాళ్లకి అసిస్టెంట్ల కింద అబ్బాస్ లాంటి వాళ్లు అరడజను మంది ఉంటారు. నజీర్ దగ్గర పని చేస్తూనే, హలీమ్ ఫామ్ కి వచ్చినప్పుడు ట్రయినీ ముధారీ లాగ కొంత డబ్బు సంపాదిస్తాడు అబ్బాస్. అందులో సగం నజీర్ నొక్కేసి, సగం అబ్బాస్ బాంక్ లో వేస్తాడు. ఒంటె నడుస్తుంటే ఎగరకుండా, గట్టిగా మూపురాన్నీ, మెడకి కట్టిన తాడునీ పట్టుకోమని, ఎలా పట్టుకోవాలో మిగిలిన పిల్లలకి చూపిస్తున్నాడు నజీర్. […]
కలియుగ వామనుడు – 4
రచన: మంథా భానుమతి అంతలో.. భళుక్ మని టింకూ మమ్మీ మీద కక్కేశాడు. “ఓహ్.. ఎయిర్ సిక్ నెస్ ఉన్నట్లుంది. ఇదే ఫస్ట్ టైమా? టాయిలెట్ లోకి తీసుకెళ్లండి.” హోస్టెస్ సహాయంతో, టింకూని తీసుకుని వెళ్లింది మమ్మీ. ఏ మాత్రం అసహ్యించుకోకుండా సొంత అమ్మ లాగే శుభ్రం చేసి తీసుకొచ్చింది. తన బట్టలు కూడా.. ఎవరో చెప్పినట్లున్నారు.. ఒక జత బట్టలు కూడా తెచ్చుకున్నట్లుంది.. అవి మార్చుకునొచ్చింది. టింకూ, చిన్నాలవి ఎలాగా బాక్ పాక్ లో పైన […]
కలియుగ వామనుడు 3
రచన: మంథా భానుమతి “మరి నువ్వు.” ఇంత లావెలా ఉన్నావని అడగలేక పోయాడు చిన్నా. కిషన్ కి అర్ధమైపోయింది, ఏమడగాలనుకుంటున్నాడో. “ఇంట్లో, బైటా కనిపించిందల్లా ఫైట్ చేసి తినెయ్యడమే. మిగలిన వాళ్ల గురించి చూడను. ఐనా నా కడుపు ఎప్పడూ కాళీగానే ఉంటుంది. అందుకే అమ్మేసుంటారు, నన్ను భరించలేక. ఎక్కడో అక్కడ తింటాన్లే కడుపునిండా అని. వీళ్లు కూడా కడుపు విండా పెట్టట్లేదు. ఎప్పుడూ ఆకలిగానే ఉంటోంది.” కిషన్ హిందీ, మరాటీ కలిపి మాట్లాడుతుంటే బాగా అర్ధమవుతోంది […]
కలియుగ వామనుడు 2
రచన: మంథా భానుమతి ఈళ్లేం సెయ్యలా.. బానే ఉంది. అమ్మయ్య అనుకుంటూ, మూల తలుపు కేసి సైగ చేశాడు కొత్తవాడు. టింకూని తీసుకుని ఆ తలుపు తోసుకుని లోపలికి వెళ్లాడు చిన్నా. టింకూ ఇంకా వెక్కుతూనే ఉన్నాడు. వాడిని కూడా తీసుకుని లోపలికెళ్లి తలుపేసేశాడు. బాత్రూం, లెట్రిన్ కలిపే ఉన్నాయి. ఇద్దరూ ముక్కు మూసుకుని నడిచారు. ఎవరూ శుభ్రం చేస్తున్నట్లు లేదు. చిన్న పిల్లలు భయానికి, ఎలా వాడాలో తెలిసినా నీళ్లు పొయ్యట్లేదనుకున్నాడు చిన్నా. టింకూ, తనూ […]
“కలియుగ వామనుడు” – 1
రచన:మంథా భానుమతి. 1 “ఏటేటి తిన్నా ఏ పన్జేసినా ఎవ్వురైన.. ఏటి సేత్తారీ నిశి రేతిరీ ఏమారి ముడుసుకోని తొంగుంటే ఏడనుంచొత్తాదొ నిదురమ్మ ఏమడగకుండ తన ఒడికి సేర్సుకోదా!” వీధి చివరున్న ముసలి బిచ్చగాడు సన్నగా పాడుతూ, మలుపు మూల బొంత పరచి ముడుచుకుని పడుక్కున్నాడు. వెంటనే గుర్రు పెట్ట సాగాడు. మధ్యరాత్రి ఒంటిగంట దాటింది. రెండో ఆట సినిమాకి వెళ్లొచ్చిన వారు కూడా గాఢ నిద్రలోకి జారుకున్నారు. వీధి దీపాలు నాలుగింటికి ఒకటి చొప్పున, నీరసంగా […]
ఇటీవలి వ్యాఖ్యలు