April 25, 2024

వెన్నెల జాము

రచన: డా. బాలాజీ దీక్షితులు పి వి వెన్నముద్ద తినిపిస్తుంది కన్నె చందమామ కన్నుల పూసిన కలువలు గండె గూటికి చేరుస్తుంది వెన్నెల హంస మధుర మధురామృత మధువును త్రాగిస్తుంది వలపుల పందేరం పరిమళ సుధాసుగంధంతో అప్సర మధనం చేస్తుంది చిరు వయ్యారం ప్రేమ నెమిలిక నెయ్యంతో నిలువెళ్ళా పూస్తుంది వన్నెల సోయగం పదునైన పైయెదల పరువపు శూలాలతో దాడి చేస్తుంది కన్నె తనం స్వప్నం నుండి లేవగానే వెన్నెల జాము మల్లెల వర్షంలో భావుక తపస్సుచేసే […]

పేదోడి ప్రశ్న

రచన: జెట్టబోయిన శ్రీకాంత్ ఆకలి అంటే ఏమిటో నూకలి గింజనడుగుతా..! ఈ ఆకలి ఎందుకవుతదో, మాడుతున్న కడుపునడుగుతా..! గూడు అంటే ఏమిటో గుడిసెలున్న అవ్వనడుగుతా…! తోడు అంటే ఏమిటో నా మనసులోని మనిషినడుగుతా…! కష్టము అంటే ఏమిటో నా ఒంటిమీది చెమటనడుగుతా…! దురదృష్టము అంటే ఏమిటో నా కంటిలోని నీటినడుగుతా…! కోపము అంటే ఏమిటో నాకు జీతమిచ్చే దొరని అడుగుతా…! శాపము అంటే ఏమిటో నా నుదిటనున్న రాతనడుగుతా…! కరువు అంటే ఏమిటో ఎండిపోయిన చెరువునడుగుతా…! పరువు […]

ఓ చల్లగాలి

రచన: డా|| బాలాజీ దీక్షితులు పి.వి నీవు ఊపిరివి సుగంధాల పరిమళం పంచాలన్నా మట్టిమధువుతో గుండె తట్టి లేపాలన్నా ఆనందాల రెక్కలు కట్టి ఎగిరించాలన్నా నీకు సాధ్యమే నీవు క్షణంలో వాలతావు ఎక్కడైనా నీవు సెకనులో దూరతావు ఏగుండెలోనైనా నీకు పరిచయంలేని మంచి మనసంటూ లేదు ఈ అవనిపై నీకు తెలియని గొప్ప హృదయమంటూ లేదు ఈ భువిపై నీవు చూడని అందమంటూ లేదు ఈ నేలపై అందుకే నిను ప్రార్దిస్తున్నా ఓ నా చల్లగాలి నాకు […]

అనుక్షణం నీతోనే…

రచన: చంద్రశేఖర్ నిన్ను చూసిన క్షణం నన్ను మరిచిన క్షణం నిన్ను తలచిన క్షణం మది పులకించిన క్షణం నిన్ను కలిసిన క్షణం ఊహకందని క్షణం నీతో మాట్లాడిన క్షణం అనుభూతి పొందిన క్షణం నీ స్నేహం పొందిన క్షణం అదృష్టం పొందిన క్షణం నీ ప్రేమ పొందిన క్షణం అన్నీ పొందిన క్షణం నిన్ను వీడిన క్షణం ఊపిరి వదిలిన క్షణం

ప్రశ్నలు స్వీయశిక్షలే …

రచన:చందలూరి నారాయణరావు ప్రశ్నలు మనసు లోతుగా మారుమ్రోగే అర్ధంకాని అగాధాలే.. అనుభవాలై పెనవేసుకొని మెలిపెట్టే మొనదేలిన వేదనాయుధాలే… ఎన్నాళ్ళుగా మోస్తున్నా కుంగదీస్తున్నా భారం తగ్గని చేదు నిజాలే…. వయసు కరిగిపారే భావసంద్రంతో అలల కలల్లో స్రవించే తీపిబాధలే… మనసు మెరుపులలో తేలియాడే తరుగులేని ఊహాలే తరిగిపోని ఆశలబాకులే. ప్రశ్నలు జీవితమంతా విధించుకొనే పరీక్షలే. స్వీయశిక్షలే. * * *

నాన్న…

రచన: చంద్రశేఖర్   అమ్మ కడుపులో ఉన్నపుడే, నాకోసం ఎదురుచూశావు.. నాకోసం ఎన్నో బొమ్మలు తెచ్చావు… నా భవిష్యత్ కోసం ఎన్నో కలలు కన్నావు… నేను పుట్టగానే పండగ చేశావు…   నన్ను గాలిలోకి ఎగురవేసి పట్టుకుని ముద్దాడి మురిసిపోయినావు…. నీ గుండెను పూలపాన్పుగా చేసి నన్ను జోకొట్టి నిద్రపుచ్చావు…..   నా చిట్టి పాదాలు కందిపోకుండా నీ అర చేతులు పై నడక నేర్పించావు… ఎత్తుకుని లోకాన్ని చూపించావు… అమ్మ వద్దన్నా గారం చేశావు….. అడగకుండానే […]

ఇప్పుడన్నీ…

  రచన: – సాంబమూర్తి లండ.     అవి ఎవరివైనా కానివ్వండి జీవితాలన్నీ గతితప్పిన గమనాలే.   సంపాదన ఎరలకు చిక్కుకుని విలవిల్లాడుతున్న చేపలు సుఖాల వలల్లో పడి పంజరాల పాలవుతున్న పావురాలు స్వార్ధం మొసళ్ళకు ఆహారమైపోతున్న జీవితాలు అవినీతి అనంత బాహువులతో మనిషిని ఒడిసిపట్టి అమాంతం మింగేస్తోంది   ఉన్నతంగా ఉజ్వలంగా బతకాలన్న ప్రతి ఆశా ఓ కొత్త రెక్క ఓ లేత చిగురు! ఎన్ని రెక్కలుంటే ఆకాశం అంత చేరువ ఎన్ని ఆశలుంటే […]

మౌనం.

రచన: విజయలక్ష్మి కొఠారి.   రూపు లేని నేను, రూపము లోని స్పందనను. అనుభవములోని అనుభూతిని, అవగాహా న్ని, అతీతాన్ని, జీవములోని చలనాన్ని. భాష లేని నేను భాష లోని భావాన్ని. సహనాన్ని నేను,  మౌనాన్ని నేను. నీ చుట్టూ నేనే, నీ తోడు నేనే. నీ రూపు నిశ్చలమై, చివరకు చేరేను … నాలో మౌనాన్ని నేను. మౌనాన్ని నేను, నీలో, నీ చుట్టూ మౌనాన్ని నేను, మౌనం ఎంత మనోహరమో, మౌనం ఎంత కర్కశమో, […]

మాయచేయు మాంత్రిక

రచన: డా|| బాలాజీ దీక్షితులు పి.వి   వెన్నెల హంస వాలిందా పున్నమి రేయిన గుండె కొలనుపై   కన్నె కలువ విచ్చిందా వలపుల సడి వేణువు స్వరమై   పరిమళ సుమం తాకిందా మయ మరపుల మధుాలికై   కలల మాటు కంత్రిక   ఓ సొగసుల మాంత్రిక   నీవు మాయ చేసి మాయమయ్యే దేవతవు కాని అక్కరతీర్చే ఆర్తివో కనురెప్పల కాంచే శక్తివో అనే నమ్మకం ఎప్పుడో సడలింది…      

జీవన సమీరం

రచన – డా. అర్చన ఆచార్య కన్నీరు ఇంకింది, మనసు మోడు వారింది నవ్వులో నిర్వేదం, నిండుగా నిండింది పుట్టింట రాణినైతి మెట్టింట జాణనైతి దృష్టికొక కోణమైతి విలువలేని వీణనైతి తింటివా అని అడిగేవారు లేక మిన్నకుంటివా అని ఓదార్చేవారు రాక మాటల అస్త్రాలు.. నిందల శస్త్రాలు అహాల మొహాలు.. అధికారాల దాహాలు మనసు పొరల తొక్కిపెట్టి పంటి కింద నొక్కిపెట్టి బాధనంత దాచిపెట్టి మోమున చిరునవ్వు చుట్టి చేపట్టిన తన తోడుకు అమృతమందించాలని అలవోకగా హాలాహలం […]