April 25, 2024

దాగుడుమూతలు

రచన: అనుపమ పిల్లారిశెట్టి గోడ వెనక గోడ మధ్యలో ఇరికిన పిల్లవాడు. అది వాడి ప్రయత్నం కాంతిచిత్రంలో పడకూడదని… ఛాయాగ్రహుడి చిన్న అభ్యర్థన ‘బయటికి రా రమ్మని’ వాడి సిగ్గూ, బిడియం రానివ్వలేదు… సరికదా మరింత బిగుసుకున్నాడు. వాడి అమాయకత్వం ప్రపంచం చూడాలి, ఆ పెద్ద – పెద్ద కళ్ళు..కళ్ళల్లో కుతూహలం.. ఇంతలో…ఓ కన్నుతో తొంగి చూపు.. అంతే! క్లిక్కుమన్నది కెమెరా… తెచ్చింది చిరునవ్వు చాయాగ్రహుని పెదవులపై ‘.వాడు తప్పక తొంగి చూస్తాడు ‘ అన్న అతని […]

స్వప్నం

రచన: చంద్ర శేఖర్. కె స్వప్నం ఒక పూల బాట ఐతే జీవితం ఒక ముళ్ల బాట మనకు నచ్చినది స్వప్నం జీవితం ఇచ్చినది వాస్తవం స్వప్నం ఒక స్వర్గం వాస్తవం ఒక నరకం స్వప్నంలో నాతో ముచ్చటించిన ఒక తార వాస్తవంలో తళుక్కున ఒక మెరుపులా మెరిసింది నేటి స్వప్నం నిజం అవుతుందో లేదో తెలియదు కానీ రేపటి స్వప్నం అవుతుందని మాత్రం తెలుసు వాస్తవానికి భిన్నంగా కనిపించేదే స్వప్నం అని నా మనసు నాకు […]

నీ వేట మెుదలయింది

రచన : డా|| బాలాజీ దీక్షితులు పి.వి నీ వేట మెుదలయింది అని నాకు నిజంగా తెలీదు ఊహలకందని విపత్తులు ఊసులకందని గమ్మత్తులు తెలుసుకోలేక పోయా ఇంకా భవిష్యత్తు అంటే జ్యోతిష్యమో గ్రహాల గమనమో గ్రంధాల సారమో కాదు అని గుర్తించలేకపోయా విజయాలకోసం గుడికి ప్రదక్షిణలు దేవుడికి దక్షిణలు పూజలు – ఉత్సవాలు దండాలు అని భ్రమపడి పోయా కానీ ఈర్ష్య -అసూయలు ద్వేషాలు -విద్వేషాలు ఉన్నచోటే నేనుంటా అంటుంది … వినాశనం మనిషీ నీకు నీవే […]

ప్రాణబంధం

రచన: – కంచరాన భుజంగరావు, పసిపాప పాల నవ్వుల వెలుగులో మురిసిపోయే మనసుకి ముత్యమంత మురిపెం! మత్తడి పాలకంకుల గలంగళల సవ్వడిలో ప్రజ్వరిల్లే తేజానికి మొలక చురుకు! లేత కొబ్బరి పమిడి ఊటల తరళ స్వచ్ఛతలో హరిత చమత్కారానికి మచ్చుతునకల తూనిక! పెదవి దొర్లే మాట చిరుగాలి పలకరింపులో పృథివి దాటే తీరుకి తార్కాణం శబ్ద శరాల త్వరణం! చూపుల ఉషస్సు చెక్కిలి చాటు అరుణిమలో ప్రతి ప్రాణబంధానికి దివ్య దర్శనం! నరునికి అవ్యాజ అనురాగ చెలిమి […]

తెలుగు భాష

రచన: చంద్రశేఖర్ తెలుగంటే భాష కాదు దైవం తెలుగంటే సరస్వతి రూపం తెలుగంటే తీయని మమకారం తెలుగంటే అమ్మ ప్రేమ అమృతం తెలుగంటే ఓంకారంతో శ్రీకారం తెలుగంటే చక్కని సంస్కారం తెలుగంటే పల్లె సంప్రదాయం తెలుగంటే కష్టానికి తగిన ఫలం తెలుగంటే జ్ఞానానికి మూలధనం తెలుగంటే బతుకు బండి ఇంధనం తెలుగంటే వీరుల చిరస్మారకం తెలుగంటే అందరికీ ఆదర్శం తెలుగంటే పోతన కవి కల వర్షం తెలుగంటే ఎలుగెత్తిన శ్రీ శ్రీ హాహాకారం తెలుగంటే ఎందరో కవులకు […]

రైతే దేవుడు

రచన: మోహన మణికంఠ తల్లి గర్భంలో అండ సృష్టి చేసేవాడు మాధవుడు, నేలతల్లి గర్భంలో విత్తు నాటే వాడు మన కర్షకుడు. కడుపులో పెరుగతున్న బిడ్డపై తల్లికి ఎంత ప్రేమో, పుడమిలో మొలకెత్తుతున్న విత్తుపై కూడా ఆ తల్లికి అంతే ప్రేమా!! కాన్పు సమయంలో అమ్మ పడే ప్రసవ వేదనలా బహుశా విత్తు మొక్కగా మొలిసిన సమయంలో నేలమ్మా అంతే వేదన అనుభవిస్తుందేమో.. నారు పోసినవాడే నీరు పోయును అనే నానుడిలా బిడ్డకు భగవంతుని దీవన, మొక్కకి […]

నీకు ప్రేమతో…

రచన: డా. బాలాజీ దీక్షితులు పి.వి నా గుండె ధైర్యం తను నాకు కొండంత బలం తను నా ప్రేమ తపస్వి తను నా జీవన యశశ్వి తను నా మార్గ ఉషస్సు తను నా నిరంతర మేధస్సు తను గుండెలకెత్తుకు ఆడించి చిటికెన వేలు పట్టుకు నడిపించి భుజాల మోసి నెత్తుటి చెమట చిందించి తను తినక మనకు తినిపించి నను పెంచిన నాన్నా…. నీకు ప్రేమతో

తపస్సు – గుహలో వెలుగు

రచన: రామా చంద్రమౌళి ఈ హిమశిఖరంపై.. ఐదువేల అడుగుల ఎత్తులో వీళ్ళేమి చేస్తారో తెలియదు ఆకాశంలో అక్కడక్కడా నక్షత్రాలవలె ఈ అఖండ పర్వత శ్రేణుల ఏటవాలు తలాలపై ఎన్ని కుగ్రామాలో పదిహేను ఇండ్లు ఒక ఊరు నాల్గు కుటుంబాలే ఒక గ్రామం పదిమంది మనుషులే ఒక సమూహం.. ఒక కుటుంబం తోడుగా ఒక విశాలాకాశం, ఒక పర్వతం, కొంత పచ్చని గడ్డి నిట్టనిలువుగా లంబరేఖల్లా నిలబడ్డ చెట్లు – పర్వతం ఉన్నదీ అంటే ప్రక్కన ఒక లోయ […]

ముదిత

రచన: డా. అర్చన ఆచార్య కన్నీరు ఇంకింది, మనసు మోడు వారింది నవ్వులో నిర్వేదం, నిండుగా నిండింది పుట్టింట రాణినైతి మెట్టింట జాణనైతి దృష్టికొక కోణమైతి విలువలేని వీణనైతి తింటివా అని అడిగేవారు లేక మిన్నకుంటివా అని ఓదార్చేవారు రాక మాటల అస్త్రాలు.. నిందల శస్త్రాలు అహాల మొహాలు.. అధికారాల దాహాలు మనసు పొరల తొక్కిపెట్టి పంటి కింద నొక్కిపెట్టి బాధనంత దాచిపెట్టి మోమున చిరునవ్వు చుట్టి చేపట్టిన తన తోడుకు అమృతమందించాలని అలవోకగా హాలాహలం గ్రోలిన […]

ఆడపిల్ల అందమైన జీవితం

రచన: చంద్రశేఖర్ ఆబల కాదు సబల… మహిళ కాదు వెన్నెల… వనిత కాదు దేవత… సూర్యుడి తొలి కిరణమల్లె భూమిని తాకే మొగ్గల్లే పూసే పువ్వల్లె విరిసే పాదరసమల్లె పాకే బోసినవ్వులు నవ్వే చిలక పలుకులు పలికే హంసల్లే నడిచే వెన్నెలల్లే ఆడే జింకల్లే పరుగులెత్తే మయూరిలా నాట్యమాడే ముద్దబంతిలా పైటవేసే సరస్వతి అనుగ్రహం పొందే ముత్యమల్లె నవ్వే పెళ్ళికూతురిలా అలంకరించే రాకుమారుడితో జోడు కట్టే పుట్టింటి గారాలపట్టి మెట్టింట్లో దీపమై అడుగుపెట్టే గోమాత సాధుగుణమే కలిగి […]