April 19, 2024

రైతు మొగ్గలు

రచన: – డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ దేశానికి వెన్నెముక అన్నదాత అంటున్నప్పుడల్లా రైతన్నల మదిలో రాచపుండులా అనిపిస్తుంటుంది అప్పులఊబిలో కూరుకుపోయిన ఎండమావి అన్నదాత రైతు నాగళ్ళతో పొలాన్ని దున్నుతున్నప్పుడల్లా తన ఆకలిని ఎప్పుడూ మర్చిపోతూనే ఉంటడు అన్నాన్ని పండించే అసలైన అన్నదాత రైతన్న యుద్ధవాతావరణంలా తుఫానుమేఘాలు కమ్మినా ఎప్పుడూ ఆశనిరాశలతోనే జీవనాన్ని సాగిస్తుంటడు కలలా బతుకీడుస్తున్న రైతన్న కన్నీటిసముద్రం కరువురక్కసి రైతన్నలను పీడించి తరుముతుంటే బతుకుపై ఆశలు మిణుకుమిణుకుమంటూనే ఉంటవి ప్రతి అన్నం మెతుకు మీద రైతన్న […]

దీపపు దివ్యవ్యక్తిత్వం

రచన: భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు. కొడిగడుతోంది దీపం దైవపుఒడి చేరుతోంది,పాపం. వేకువతో సమానంగా వెలుగులను పంచాలనే ప్రయత్నంలోనే ప్రతిక్షణం జీవించి, చీకటితెరలను తన శాయశక్తులా తెంచివేయాలనే తాపత్రయాన్నిశ్వాసించిన ఈదీపం, పాపం,తన చివరిక్షణాలను ఎదుర్కొంటోంది. చీకటితెరలు తనని కప్పేస్తున్నా, వెలుగురేఖలు తననివీడి వెళిపోతున్నా, ధైన్యం లేకుండానే వెలుగుతోంది, నిర్వికారంగానే మలుగుతోంది. తన ఆఖరిశ్వాసను కూడా వెలుగును పంచుతూనే వదులుతోంది. తనను వెలిగించిన వారికి కృతజ్ఞతను అలా తెలుపుకుంటోంది. తను పోతేనేం? మరోదీపం వెలిగించబడుతుందని తెలుసు, తను లేకపోతేనేం? […]

ఓటరు దేవుడు

రచన: బక్కారెడ్డి ఓటరును నేను ఓటరును నేతల తల రాతల బ్రహ్మదేవున్ని ప్రజాస్వామ్యంలో కడు నేర్పరిని రాజకీయ గాలాలకు చిక్కని వాన్ని ఓటును వరముగా ఇచ్చే దేవున్ని ఓటును’నోటుకు’అమ్మని వాన్ని ‘అమ్మ’లేక కాదు! ఆత్మ కోర్టులో ముద్దాయిగా నిలబడాలని లేదు! ‘నోటా’మీట నొక్కబోను. నోటాకు పడే ఓట్లు ప్రజాస్వామ్య కోటకు తూట్లు ఐదేండ్ల ఆయువిచ్చే దేవున్ని! అయినా పాపం పండితే యమ పాశం వేయలేని వాన్ని! బహిరంగ సభల్లో జనప్రధర్శనకు లారీల్లో ఊరేగే ఓటరు దేవున్ని! దేవుడు […]

ప్రేమ సంస్థానం .. మధూలిక

సమీక్ష: శ్రీ సత్యగౌతమి   ప్రియుని ధ్యానంలో అంతర్ముఖురాలైన ప్రేయసి మధూలిక ‘నేనంటూ కదులుతున్నప్పుడు నీ అడుగులనే అనుసరిస్తున్నట్లూ నాలో మౌనం తెరవేసినప్పుడు నీ ధ్యాసలో ఎద రమిస్తున్నట్లు’ …. ఈ నాలుగు వాక్యాల్లో అంతర్లీనంగా అథ్భుతంగా మధూలిక తన ప్రణయ కోరికను ఆవిష్కరించింది .   అంతేకాదు, ‘చిరుముద్దుతో రెప్పల కదలికలు అలలలైనప్పుడు మనమో దీవికి వలసపోయినట్లు ….   ప్రియునితో దీవి ప్రాంతాన అచటి సముద్రతీరపు అలలలో మమేకమైన మధూలిక, ‘తన కనురెప్పలపై ప్రియుని […]

నేను నిత్యాన్వేషిని!

రచన: వసంతరావు నాగులవంచ గుళ్ళు గోపురాలు దండిగా దర్శించాను మసీదులు చర్చ్ లలో ప్రార్థనలు చేశాను తీర్థ యాత్రలు చేసి తిప్పలెన్నో పడ్డాను నాకు దేవుడెక్కడా మచ్చుకు కన్పించలేదు! నోములు వ్రతాలు చాన్నాళ్ళుగా ఆచరించాను ముడుపులెన్నో కట్టి మొక్కు చెల్లించాను నిలువు దోపిడీ యిచ్చి నిండా మునిగాను దేవుడెందుకో నాకు కన్పించనేలేదు! గుట్టలు పుట్టలు పిచ్చిగా వెదికాను కొండ గుహల్లోకి అత్యాశగా తొంగిచూశాను హిమాలయాలలో మౌనంగా ధ్యానం చేశాను మరెందుకో దైవం జాడ నాకు తెలియనేలేదు! గురువులు […]

దీపపు వ్యక్తిత్వం

రచన: భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు. దీపపు దివ్యవ్యక్తిత్వం కొడిగడుతోంది దీపం దైవపుఒడి చేరుతోంది,పాపం. వేకువతో సమానంగా వెలుగులను పంచాలనే ప్రయత్నంలోనే ప్రతిక్షణం జీవించి, చీకటితెరలను తన శాయశక్తులా తెంచివేయాలనే తాపత్రయాన్నిశ్వాసించిన ఈదీపం, పాపం,తన చివరిక్షణాలను ఎదుర్కొంటోంది. చీకటితెరలు తనని కప్పేస్తున్నా, వెలుగురేఖలు తననివీడి వెళిపోతున్నా, ధైన్యం లేకుండానే వెలుగుతోంది, నిర్వికారంగానే మలుగుతోంది. తన ఆఖరిశ్వాసను కూడా వెలుగును పంచుతూనే వదులుతోంది. తనను వెలిగించిన వారికి కృతజ్ఞతను అలా తెలుపుకుంటోంది. తను పోతేనేం? మరోదీపం వెలిగించబడుతుందని తెలుసు, తను […]

కాలంపై నా కలం.

రచన: మణి కాలమా ! ఓ గమనమా!! అలసట, ఆకలి ఎరుగని, వార్దక్యం లేని ఓ సొగసరి, వివిధ ప్రమాణాలు ఉన్నా, నీ ప్రయాణంలో ఏ మార్పూ ఉండదు. విశ్వ విజేతలను అలఓకగా ఓడించగల ధీశాలి, తారతమ్యభేదాలు, భేషజాలు తెలియని భాగ్యశీలి. ప్రవాహ ఝరీ వేగాన్ని ఆవలీలగా జేయించగల నీవు, కాంతి వేగాన్ని సైతం క్షణిక లో కమ్మేయ్యగలవు జననానికి నీవు, మరణానికి నీవు, జీవన స్రవంతికి నీవు చరిత్రకు సాక్షి నీవు, భవిష్యత్తుకు భరోసా నీవు […]

జీవిత గమనం

రచన: చందు కె శేఖర్ నిదుర పోదామంటే నిదుర రాదాయే తెల్లవారిందంటే టెన్షన్ మొదలాయే వ్యాయామానికి వేళ సరిపోదాయే పూజకు సమయంలేక దండమాయే ఆఫిసుకి ఉరుకులు పరుగులాయే ఎంత పరుగెడినా ఆఫీసుకి లేటాయే లేటుకి కాటు శాలరీ కట్ ఆయే ఎంత పని చేసినా గుర్తింపు లేదాయే పనికి తగ్గ ప్రతిఫలం లేదాయే మన పని చాలక ఇతరుల పని కూడాయే సాయంత్రం ఆరైనా పని తెగదాయే ఆరు ఎనిమిదాయె, తొమ్మిదాయే మల్లి ఉరుకులు పరుగులతో ఇంటికి […]

నిశా సుందరి ….. నా ప్రియ సఖి ….

రచన: భావన పాంచజన్య నీడైనా నన్ను వీడిపోతుంది కానీ… నా ఈ ప్రియ సఖి నన్ను ఎన్నటికీ వీడిపోదు.. వీడిపోలేదు డస్సిన మేనికి శీతల వింజామరలతో ఒడిన సేద దీర్చేను ఈ నిశా మాత …. ప్రియుని రాకకై చుక్కల చీర కట్టి చలి వెన్నెల తడిసి విరహాగ్నితో నిరీక్షించే విరహిణి ఈ ఇందుకాంత శశాంకుని తన వాలుజడన తురిమి వయ్యారామొలికించు ఈ చంద్ర కాంత చుక్కల హారాలు గళసీమ కైసేయు సింగారాల బంగారి ఈ తారాభూషిణి […]

మేటి ఆచారం

రచన: ఎ.బి.వి. నాగేశ్వరరావు దురాచారాల దురాగతాలు, సాంప్రదాయాల సంకెళ్ళు, కట్టుబాట్లు, వివక్షలు, ఆంక్షలు, అణచివేతలు, – వెరసి… యుగాలుగ నియంత్రిస్తున్నాయి నాతిని- ఒడిదుడుకుల ఒడిలో, సర్దుబాటు ధోరణిలో- పసి ప్రాయము నుండి పాడె ఎక్కేదాకా… మజిలి మజిలిలుగ, మూగ జీవిగ, పరాధీనమున … నిరంతరం, జీవితాంతం, జీవచ్ఛవంగా బ్రతుకీడ్చమని ! అభిరుచులు, ఆకాంక్షలు … అతివకు సొంతము, వ్యక్తిగతము- ఉండవు, ఉండకూడదని !! అందుకే, మరి అందుకే- నాడూ, నేడూ… యుగాలుగ, నిజానికి మూగదే మగువ – […]