April 24, 2024

నాడు-నేడు

రచన: సాహితి నేడు నటన ఒక అవసరం లౌక్యం ఒక అందం స్వార్ధం ఒక కళ వంచన ఒక వల నాడు మాట ఒక ధర్మం నిజం ఒక న్యాయం నిజాయతీ ఒక గౌరవం మనిషి ఒక వరం నేడు చదువు ఒక సుఖం డబ్బు ఒక లక్ష్యం మనిషి ఒక వస్తువు మనసు ఒక బొమ్మ నాడు విద్య ఒక విలువ సొమ్ము ఒక కష్టం మనిషి ఒక భంధం మనసు ఒక ప్రాణం * […]

అమ్మా ! ఓ దుర్గమ్మ తల్లీ !

రచన. పోలయ్య శ్రీరస్తు ! శుభమస్తు ! సుఖశాంతులు ప్రాప్తిరస్తు ! అని సిరిసంపదలను భోగభాగ్యాలను సుఖసంతోషాలను శాంతిసౌభాగ్యాలను అష్టైశ్వర్యాలనొసగేటి కోరిన కోరికలన్నీ తీర్చేటి ఆశలన్నీ కలలన్నీనెరవేర్చేటీ అమ్మా ! ఓ దుర్గమ్మ తల్లీ ! మీ “అనుగ్రహం” కోసం మీ “విగ్రహం” ముందర “పెట్టెదం” దీపధూప నైవేద్యాలు “కొట్టెదం” కోటి కొబ్బరికాయలు “చేసెదం”చేతులు జోడించి శిరస్సులు వొంచి మీకు సాష్టాంగ నమస్కారాలు ! “పెట్టెదం”వేయి పొర్లుదండాలు ! అమ్మా ! ఓ దుర్గమ్మ తల్లీ ! […]

మన్నించవే హృదయమా

రచన: ఆశ రెక్కలు విప్పిన కోరికేదో కోరింది నా హృదయం చకోరి పక్షివలే విహరించాలని ఆశ పడుతుంది! బరువెక్కిన ఎక్కిళ్ళ వేదనను వదలి అంతరంగంలో దాగిన ఛాయా చిత్రాల అనవాళ్లను విడిచి మర్మంతో కూడిన మెత్తటి మనసు చెలిమిలో ఇమడలేక తా ననుకునే స్వేచ్చా జీవితంలో తన ఉనికిని తానుగా నిలుపుకోవాలని నా మస్తిష్కం నుండి విడుదల కోరుతుంది నా హృదయం. బదులు చెప్పని నిశ్శబ్దంగా నేనుంటే నా ప్రతిబింబం నిగ్గదీస్తుంది అసలు నీకు హృదయం అంటూ […]

ఉదయించాలనే….

రచన: చందలూరి నారాయణరావు     చెప్పడానికి ఏమి లేదన్నప్పుడే చెప్పుకొనేది ఏదో ఉన్నట్లే…   రెండు కళ్ళల్లో అలలను కట్టేసి సాగరాన్ని మోస్తున్నట్లే…   కోత పెడుతున్న జ్ఞాపకం గుండెల్లో  ఘోషిస్తున్నట్లే..   మౌనం ముసుగులో కలలను పోగుచేస్తున్నట్లే…   విరిగిన ఆలోచనకు వ్రేలాడే నిరాశకు ఒంటరిగా వేదనకు గురివుతున్నట్లే…   రాత్రిని చిట్లగొట్టి చీకటిని వెళ్ళగొట్టిన్నట్లే.   పగటిని తవ్వుతో వెలుగును వెతుకుతున్నట్లే   ఎక్కడో దూరంగా చుక్కలతో నిరంతరం సంభాషిస్తూన్నట్లే…   ఎక్కడో […]

గాంధీ మొగ్గలు

– డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ క్విట్ ఇండియా ఉద్యమంతో జాతిని ఏకం చేసి ఆంగ్లేయపాలకుల గుండెల్లో దడపుట్టించినవాడు అలుపెరుగని పోరాటానికి అసలైన స్ఫూర్తి గాంధీజీ స్వాతంత్ర్యసమరంలో ఆయుధాలనేవి పట్టకుండానే అహింసాయుధంతో ఆంగ్లేయులను తరిమికొట్టినవాడు సామాన్యులలో అసామాన్యుడిగా జీవించింది గాంధీజీ సత్యాగ్రహ మహోద్యమంతోనే సమరశంఖం పూరించి బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గాండీవం భరతజాతిని ఏకంచేసి విజయం సాధించింది గాంధీజీ పరిష్కార మార్గాలకై వినూత్నపంథాను ఎంచుకునే పోరాటాలెన్నింటికో నాందీవాచకమై నిలిచినవాడు ఆధునిక శాంతియుత ఉద్యమాలకు స్ఫూర్తి గాంధీజీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో […]

వీడికోలు!

రచన:కుసుమ.ఉప్పలపాటి. గజల్: రాగసుధల రసికులనూ అలరించే రారాజు! పాడటమే జీవంగా భావించే మహరాజు! తెనుగు భాష మాధుర్యం ఔపోసన పట్టాడె! పలుకు తల్లి వరమల్లే జనియించే రసరాజు! స్తోత్రాలతొ దేవతలకు స్వరార్చనే చేసాడు! సామవేద ఘనాపాటి తరియించే గానరాజు! గుండెగొంతు భాషతోన దేశమంత వినిపించె! వీనులున్న ప్రతివారిని మురిపించే రాగరాజు! నవరసాలు నావేనని విర్రవీగు గంధర్వుడు! సినిమాలకు కాసులనూ కురిపించే ధనరాజు! నీలిమబ్బు, గాలితెరలు వినిపించుగ నీపాట! సుస్థిరమై హృదయాలలొ జీవించే వలరాజు! అశృతర్పణ వీడికోలు అందుకొనుము […]

ఉదయ కిరణాలు…

రచన: రమా జగన్నాధ్ భానుడు ముచ్చట తో మూసి మూసి గా మూలల నుండి చిగురు కొమ్మలను ఛేదించుకుంటూ రాతి గోడలను ఎదురుకుంటూ రావాల ? వద్ద అనుకుని రాయసంగా చూసినా తప్పలేక తళుకుల మెరపూలతో రాకలు ! మొదటి కిరణ కాంతి నా కనుబొమ్మలు పై తాకే వేళలో నా శయన వాహనం పై నిద్రావస్తా నుండి మెలుకువ తో మొదలు ! నా నాసిక రంధ్రాలకి ఘుమ ఘుమ లాడే ఘాటైన తేనీటి తేటలో […]

ప్రె’ వేటు’టీచర్

రచన: రమ కుమార్ గుతుల ఐదు సెప్టెంబర్ వస్తోంది ఐతే ఇంకేం మొదలు పెట్టండి వచ్చిన శుభాకాంక్షల పోస్టులు వరుసగా పంపేయండి ఇతరులకు గుడ్డిగా దయచేసి జూమ్ చేసి చూడొద్దు దాయలేని తడి ఉండొచ్చు రాధాకృష్ణన్ కళ్ళలో రాతిగా మారిన నేటి గురువు గుండెల్లో తన కోసమో,తన వారి కోసం ఉద్దరిద్దామనే ఉద్దేశ్యంతోనో చేరినప్పుడు తెలియదు చేసే వృత్తి విక్రమార్క పాలన అని ఆరు నెలలే తరగతి గదిలో అడ్మిషన్లుకై రోడ్డెక్కె మిగతా అర్ధం వీధిన పడి,పిల్లని […]

అయ్యో పాపం!

రచన: పారనంది శాంతకుమారి ఆర్జన పేరుతొ అభ్యంతరాలనన్నిటినీ వర్జించి, అంతులేని సంపాదనను అక్రమ దారులలో ఆర్జించి, భర్తతో జీవించాల్సిన ఘట్టాలనన్నిటినీ పరాయివాడితో తెరపై నటిస్తూ ,తెర వెనుక జీవిస్తూన్న ఎందరో నటులు. పవిత్రత అనే పదాన్ని పక్కన పడేసి, మానాన్ని,అభిమానాన్ని కూడా ఎవరికీ అనుమానం రాకుండా తాకట్టు పెట్టేసి, ధనాన్ని సంపాదించటంలోనే దృష్టినంతటిని పెట్టి, నీతి,నియమాలను పక్కకు నెట్టి, అయ్యారు విటులు. ముందు భోగాలను ఆహ్వానిస్తూ, తరువాత రోగాలను అనుభవిస్తూ, తనచుట్టూ దోచుకొనే వారే తప్ప తనకై […]

వారి సందేహం

రచన: స్వరాజ్య నాగరాజారావు అమ్మపైనే ఎప్పుడూ కవితలు రాస్తూ ఉంటారు మరేమీ పని లేదా మీకు? అంటూ …..వారు కామెంట్ పెట్టేరు. మీకు అమ్మ లేదా? మీకు అమ్మ చేదా? మీరు అమ్మ కాదా? అని అడగాలనే ఆలోచన అప్పుడు నాకుతట్టింది అలా నేను అడగ్గానే ….. బదులివ్వలేని ఆమె నిస్సహాయత మౌనాన్ని దాల్చినట్టుంది, బహుశా ఆమె మనసులోనే రెండు కన్నీటి చుక్కలను రాల్చినట్టుంది. ఆలోచిస్తే ….అసలు అమ్మకంటే వేరేలోకం ఏముంది? అమ్మను మరువటంకంటే వేరేశోకం ఏముంది? […]