May 25, 2024

గోపమ్మ కథ… 8

రచన: గిరిజారాణి కలవల   గోపమ్మని అలాంటి పరిస్థితుల్లో చూసాక, ఎలా ఓదార్చాలో కూడా తెలీలేదు నాకు. “ఊరుకో! గోపమ్మా! వాడికి అంతవరకే రాసి పెట్టి వుంది. మన చేతుల్లో ఏముంది చెప్పు.” అన్నాను. “చేజేతులా చేసుకున్నాడమ్మగారూ! వాడి చావుని వాడే కొనితెచ్చుకున్నాడు. సంపాదించినదంతా… ఆ తాగుడికీ, చెడ్డ తిరుగుళ్ళకీ పెట్టి… నడి వయసులోనే చచ్చిపోయాడు. మా ఇళ్ళలో మగాళ్ళందరికీ ఇది మామూలే కదమ్మా! ఇలాంటి చావులు చస్తూనే వుంటారు. మా పీకల మీదకు తెస్తూనే వుంటారు.” […]

గోపమ్మ కథ – 7

రచన: గిరిజారాణి కలవల లక్ష్మి, కోటి కాపురం … ఇక వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. మూడు పురుడులు పోసి … తన బాధ్యత తీర్చుకుంది గోపమ్మ. మరో పక్క… కొడుకు పిల్లలు పెద్దవుతున్నారు. కొడుకు, కోడలు, మనవలు అంటూ మళ్ళీ మొదలెట్టింది. చిలక్కి చెప్పినట్లు చెప్పాను. ‘పెళ్ళి చేసావు. వాడికీ పెళ్ళాం, పిల్లల బాధ్యతలు తెలియనియ్యి. తల్లి కోడిలాగా, నీ రెక్కల కిందే ఎన్నాళ్ళు చేస్తావు? నీకూ రెక్కల శ్రమ ఎక్కువ అవుతుంది.’ వింటే కదూ! […]

గోపమ్మ కథ – 6

రచన: గిరిజారాణి కలవల   నేను చెప్పినదేదీ పట్టించుకోకుండానే గోపమ్మ … తిరనాల అయిన పదిరోజులకే లక్ష్మి,  కోటిలకి లగ్గాలు పెట్టించేసింది.  ముందు నిశ్చయ తాంబూలాలకి వాళ్ళ భాషలో పప్పన్నాలు పెట్టుకోవడం.  అలా ఓ మంచి రోజు చూసుకుని,  రెండు కుటుంబాలతో పాటు బంధువులందరూ కలిసి  పెళ్ళి నిశ్చయం చేసుకున్నారు.  అదే పప్పన్నాలు పెట్టుకున్నారు.  పేరుకే పప్పన్నాలు… ఆరోజు కోడి పలావులు,  కల్లు ముంతలు ధారాళంగా కొనసాగాయని చెప్పింది గోపమ్మ. “ఎందుకు అలా అనవసరపు ఖర్చు గోపమ్మా? […]

గోపమ్మ కథ – 6

రచన: గిరిజారాణి కలవల ఇక అప్పటినుండి గోపమ్మ , లక్ష్మిని తనతోనే తను పనిచేసే ఇళ్ళకి తీసుకువెళ్ళేది. బడిలో చేర్పించి చదువు చెప్పిస్తానంటే ససేమిరా ఒప్పుకోలేదు లక్ష్మి. లక్ష్మి చేసే సహాయంతో గోపమ్మకి మరి నాలుగు డబ్బులు చేతిలో ఆడసాగాయి. లక్ష్మి ఈడేరినప్పుడు ఫంక్షన్ చేద్దామని తలచింది. నన్ను పదివేలు సర్దమని అడిగింది. ‘ఎందుకు గోపమ్మా! ఈ ఆర్భాటాల ఫంక్షన్లు. అనవసరంగా డబ్బు దండుగ కదా! అప్పు చేసి మరీ చేయాలా?’అని అడిగాను. “ఏం చేస్తామమ్మా! మా […]

గోపమ్మ కథ – 4

రచన: గిరిజారాణి కలవల నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగా, గోపమ్మ … లక్ష్మి రెక్క పట్టుకుని ముందుకి లాగి, “చెప్పవే! అమ్మగారు అడుగుతున్నారుగా! చెప్పూ!” అంది కోపంగా. ఏం జరుగుతుందో నాకు అర్ధం కాలేదు. ఉదయం నుంచి నేను పడుతున్న ఆదుర్దా అయితే, లక్ష్మిని చూడగానే తీరింది కానీ, హైదరాబాద్ నుంచి ఇక్కడకి ఈ పిల్ల ఎలా రాగలిగిందా? అనే సందేహం వచ్చింది. “ఉండు, గోపమ్మా! దాన్నేం అనకు. నేను కనుక్కుంటాను” అన్నాను. “ఏంటమ్మా! కనుక్కునేది ? […]

గోపమ్మ కథ – 3

రచన: గిరిజారాణి కలవల ఆ రోజు మా ఇంట్లో పనికి గోపమ్మ రాను అని కబురు చేసింది కాబట్టి… నాకు ఆలోచించుకుందుకి కాస్త సమయం దొరికింది. లక్ష్మి దొరికిన పిల్లే అయినా తన స్వంత కూతురులాగే పెంచింది గోపమ్మ. ఏదో డబ్బు వస్తుందన్న ఆశతో, నా మాట మీద నమ్మకంతో హైదరాబాద్ పంపింది. ఇప్పుడు లక్ష్మి కనపడ్డం లేదంటే ఎలాంటి గొడవ చేస్తుందో అని నాకు ఆందోళన కలిగింది. ఇందులో నా తప్పు లేదు.. హైదరాబాద్ లోని […]

గోపమ్మ కథ – 2

రచన: గిరిజారాణి కలవల గోపమ్మ ఇంట్లో పెరుగుతున్న లక్ష్మి క్రమేపీ తన తల్లితండ్రులని పూర్తిగా మర్చిపోయింది. గోపమ్మ, అంజిలనే అమ్మానాన్నలుగా అనుకుని వీళ్ళతో అనుబంధం పెంచుకుంది. కొడుకు రమేష్ కి గోపమ్మ తన అన్న కూతురుతో పెళ్ళి చేసింది. విచిత్రం దాని పేరు కూడా గోపమ్మే. మేము కన్ ఫ్యూజ్ అవకుండా అత్త గోపమ్మ , కోడలు గోపమ్మ అని పిలిచేవాళ్ళం. ఆస్తి పంచినట్టూ, కోడలు రాగానే ఇనప్పెట్టె తాళాలు చేతికి ఇచ్చినట్లు, కోడలుకి తను పని […]