May 19, 2024

చందమామ పాటలు – 2

చందమామ రావె.. జాబిల్లి రావె అంటూ బిడ్డను చంకనెత్తుకొని తల్లులు గోరుముద్దలు తినిపించే సన్నివేశాలు కనిపించేవి ఒకప్పుడు.ఏ సాంకేతిక ఆటవస్తువులు, ఉపకరణాలు లేని రోజుల్లో నింగిలో మెరిసే చందమామే ఆటవస్తువు. చందమామను అద్దంలో చూపేవరకూ బాల రాముడు పాలబువ్వ తినేవాడు కాదనీ పురాణాల్లోను, పుస్తకాల్లోనూ చదువుకున్నాం. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో తరచుగానే సందర్భానుగుణంగా చందమామను చూపించే సన్నివేశాలు ఉండేవి. ఇప్పుడూవున్నా -అప్పుడప్పుడనే చెప్పాలి. నిజానికి దక్షిణాదిన రూపుదిద్దుకున్న అనేక సినిమాల్లో చందమామ కూడా ఒక పాత్రధారే. అమ్మ […]

చందమామ పాటలు 1

కూర్పు: మురళీకృష్ణ మామలకు మామ చందమామ. చిన్నపిల్లలకు బువ్వ తినిపించడానికి ఆ మామను పిలుస్తారు తల్లులు. ప్రేయసీప్రియులు చందమామ ద్వారా తమ ప్రేమ సందేశాలను ఇచ్చిపుచ్చుకుంటారు. భార్యాభర్తల అన్యోన్య దాంపత్యంలో చందమామ తన వంతు సాయం చేస్తూనే ఉంటాడు. చందమామ చల్లగానూ ఉంటాడు. వేడిగానూ ఉంటాడట. ఆశ్చర్యంగా ఉంది కదా. మన తెలుగు సినిమాలలో చందమామ ప్రస్తావనలో వచ్చిన పాటలను గూర్చి తెలుసుకుందాం. ఈ పాటలలో సంగీతం, సాహిత్యం, అభినయానికి కూడా పెద్ద పీట వేసారు. సంగీత, […]