April 20, 2024

చంద్రోదయం 16

రచన: మన్నెం శారద “ఈ రోజు నానీ బర్త్‌డే” స్వాతి ఎటో చూస్తున్నట్టుగా చెప్పింది. వాష్‌వేసిన్ దగ్గర అద్దం ముందు నిలబడి షేవ్ చేసుకొంటున్న సారధి వెనక్కి తిరిగి చూసేడు. “ఈజిట్?” అంటూ. అప్పటికే స్వాతి లోపలికి వెళ్లిపోయింది. ఆమె చెప్పింది తనకేనని సారధికి తెలుసు. త్వరగా షేవింగ్ అయిందనిపించి స్వాతి ఉన్న గదిలోకి వచ్చేడు. స్వాతి నానికి తల స్నానం చేయించి ఇస్త్రీ బట్టలు తొడుగుతోంది. “నిన్న చెప్పలేదేం? ఆఫీసు నుండి వచ్చేటప్పుడు కొత్త బట్టలు […]

చంద్రోదయం 15

రచన: మన్నెం శారద ఇంతకూ అతను తనని నిజంగా ప్రేమించి వుండక పోవచ్చు. ఆ వయసు కుర్రాళ్లలా తమాషాకి అతనూ చేయి వూపి వుండొచ్చు. నిజంగా ప్రేమించి వుంటే తనని వెతుక్కుంటూ రాడూ. తన ప్రేమని తెలుపుకోడూ. ఇలా రోజూ ఎంతమందిని చూసి చిరునవ్వులొకల బోస్తాడో.”టాటా” చెబుతాడో. ఆమె నిస్పృహగా నిట్టూర్చింది. అయినా ఆమె విశాలమైన కళ్లు ఎన్నాళ్లపాటో రెప్పవేయడం మర్చిపోయి రోడ్లన్నీ అతని కోసం గాలించేవి. కనీసం అతని పేరు కూడా తెలియదు. ఏం చేస్తాడో […]

చంద్రోదయం – 14

రచన: మన్నెం శారద సారధి బ్యాంక్ నుంచి వచ్చేటప్పటికి టేబుల్ మీద లెటర్ వుంది. అది శేఖర్ దస్తూరి గుర్తుపట్టేడు సారధి. వెంటనే ఆత్రంగా విప్పేడు. డియర్ సారధి, నువ్వెళ్లిపోయాక వైజాగ్ కళ పోయింది. సముద్రం చిన్నబుచ్చుకుంది. బీచ్ రోడ్డు బావురుమంటోంది. ఎల్లమ్మ తోట సెంటర్ వెలవెలా బోతోంది. మరి నీకక్కడ ఎలావుందో? ఈ పరిస్థితిలో స్వాతే లేకపోతే నీ ఎడబాటు నాకు పిచ్చెక్కించేసేదే. నీ బెంగవల్లనేమో నా ఆరోగ్యం కాస్త దెబ్బతింది. మరేం కంగారుపడకు. కాస్త […]

చంద్రోదయం 13

రచన: మన్నెం శారద అతని కళ్ళు మసకబారుతున్నాయి. చీకటిని మింగుతోన్న సముద్రం నల్లగా మారుతోంది. అతని కళ్లనుంచి రెండు వేడి కన్నీటి బొట్లు జారిపడ్డాయి. ఇప్పటికే శేఖర్‌కి తానన్ని విభాగాలుగా రుణపడిపోయి వున్నాడు. ఇంకా అతన్ని స్నేహం పేరుతో దోచలేడు. శేఖర్ మనస్ఫూర్తిగా స్వాతిని ఇష్టపడుతున్నాడు. పెళ్ళికూతుర్ని చూసి వచ్చిన దగ్గర నుంచి ఊహాలోకంలో తేలిపోతున్నాడు. అలాంటి శేఖర్‌కి నిజాన్ని చెప్పి అఘాధంలోకి త్రోయలేడు. ఈ రోజు తను, తన వాళ్ళు ఇలా సుఖంగా బ్రతకటానికి అతనే […]

చంద్రోదయం 12

రచన: మన్నెం శారద సిగ్గు మొగ్గలేస్తున్న ఆమె కళ్లలో.. మెరుస్తోన్న మెరుపు… ఎర్రబడుతోన్న చెక్కిళ్ళు.. మెల్లగా క్రిందికి వాలిపోతున్న చూపులు. సారధి నిలువునా నీరుకారిపోతున్నాడు. గొంతు తడారిపోతోంది. ఏదో దారుణం జరిగిపోతోన్న అనుభూతి.. నిలువునా తనని హత్య చేస్తోన్నట్టుగా భ్రాంతి. అతని మొహంలో కత్తివాటుకి నెత్తురు చుక్క లేదు. అచేతనంగా కూర్చుండిపోయాడు. “అమ్మాయి పేరు స్వాతి. బి.ఏ. ఫైనల్ పరీక్షలు రాసింది.” మాస్టారు గొంతు వినబడింది. ఒక్కో అక్షరం ఒక్కో కొరడా దెబ్బలా తగులుతోంది సారధికి. “ఇక […]

చంద్రోదయం – 11

రచన: మన్నెం శారద “నువ్వేలేరా బాబూ! ఎలాగూ ఆ అమ్మాయి నిన్నే చేస్కోబోతుంది కదా.. నువ్వు ఒప్పుకున్నావు. ఇంకా ఈ తతంగం దేనికి?” “జస్ట్ ఫర్ థ్రిల్!” “ఏం థ్రిల్లో. నా ప్రాణం తీస్తున్నావు” అన్నాడు సారథి నవ్వుతూ. శేఖర్ సీరియస్‌గా “చూడు సారథి! మనిషి బ్రతుకులో ఎన్నో లింకులు తెలీకుండానే ఏర్పడుతుంటాయి. నీ స్నేహం నాకు అలాంటిదే. ఈ రోజు మాస్టారి ఆనందం కోసం ఆయన ఆల్లుడిగా జీవితంలోకి ప్రవేశించబోతున్నాను. ఇదీ కొత్త లింకే. కాని […]

చంద్రోదయం – 10

రచన: మన్నెం శారద “రెండు మూడేళ్ళు ఆగితే ఆ ముసిలోడు అంటే నీ మామగారు గుటుక్కు మనేవాడు. నీకా ఒక్కగానొక్క బిడ్డ. ఆస్తంతా చచ్చినట్లు నీ చేతికి దొరికేది. మొగుడు లేకపోతేనేం మహారాణిలా వుండేది జాతకం! ఈ పనికిమాలిన పెళ్లి వల్ల ఆ ఛాన్సు కాస్తా చక్కాబోయింది.” స్వాతి తేలిగ్గా ఊపిరి తీసుకుంది. అవన్నీ ఆమె చెప్పకపోయినా తనకీ తెలుసు. ఇది క్రొత్త విషయం కాదు. తను అన్నింటికి సిద్ధపడే ఈ పెళ్ళి చేసుకుంది. “నాకు తెలుసు […]

చంద్రోదయం – 9

రచన: మన్నెం శారద చేతి గడియారంలోకి చూసేడు. అయిదున్నరవుతోంది. తూర్పు తెల్లబడుతోంది. పక్షులు రొదచేస్తూ గూళ్లు వదలి వినీలాకాశంలోకి ఎగురుతున్నాయి. తెల్లవార్లూ అంతులేని ఆలోచనలతో, గతంలోని జ్ఞాపకాలతో నిద్ర కరువైంది. ఏదో నీరసం! కళ్ళలో అలసట! కళ్లు మూతలు పడుతున్నాయి. చలగాలికి కాస్త శరీరం వొణుకుతోంది. అయినా అతను లేవలేదు. గుమ్మంలో స్వాతి నిలబడి వుండటాన్ని అతను గమనించాడు. కానీ చూడనట్టుగా ఊరుకున్నాడు. “మమ్మీ” నానీ పిలుస్తున్నాడు స్వాతిని. “ఊ” మాటలు సారధికి వినబడుతున్నాయి. “అంకుల్ నిద్రపోతున్నారా”? […]

చంద్రోదయం – 8

రచన: మన్నెం శారద గంగాధరంగారు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఆయన ముఖంలో కండరాలు బిగుసుకున్న తీరులోనే ఆయనెంత కోపంలో వున్నది అర్ధమవుతుంది. ఆయన పక్కన ఆయన సతీమణి శాంతమ్మగారు ఆందోళనగా నిలబడి చూస్తున్నారు. శేఖర్ తల వంచుక్కూర్చున్నాడు. సారధి గుమ్మానికి జేరబడి నిలబడ్డాడు. అతనికి జంకుగా వుంది. ఒక విధంగా యిలాంటి వాతావరణం కల్పించింది తనే. “అంటే నీ నిర్ణయం మారదంటావు?” గంగాధరంగారు మరోసారి అడిగేరు. “ఇందులో మార్చుకొవాల్సింది ఏముంది డాడీ?” శేఖర్ నెమ్మదిగా అన్నా, స్థిరంగా వున్నాయా […]

చంద్రోదయం – 7

రచన: మన్నెం శారద “నాకు నీ పెళ్ళి చూడాలని వుందిరా. పెళ్లికొడుకు వేషంలో నువ్వు చాలా బాగుంటావు. నా కోరిక తమాషాగా అనిపిస్తోంది కదూ!” “బావుంది. నీ సరదా కొసం ఎవర్ని బడితే వాళ్లని కట్టుకోమంటావేం ఖర్మ” “అలా ఎందుకంటాను? నచ్చితేనే” “అంటే ఏదో సంబంధం తెచ్చేవన్నమాట.”అన్నాడు సారధి శేఖర్‌ని పరీక్షగా చూస్తూ. “ఓ విధంగా అంతేననుకో. కాని కథంతా విని ఆలోహ్చించి నీ నిర్ణయం తెలియబరచు” సారధి మాట్లాడలేదు. శేఖర్ కూడా కాస్సేపు మౌనంగా కూర్చుని […]