December 3, 2023

చీకటి మూసిన ఏకాంతం – 10

రచన: మన్నెం శారద సుభద్రా నర్సింగ్ హోం ఏ హడావుడులూ లేకుండా అతి నిరాడంబరంగా చిన్న పూజా కార్యక్రమంతో తెరిచింది నిశాంత. ఆ విషయాన్ని తల్లిదండ్రులకి గాని- సాగర్ కి కాని తెలియజేయలేదు. ఉన్న డబ్బుతో కావాల్సినంత వరకే ఎక్విప్మెంటు కొని నడపడం ప్రారంభించింది. ఇల్లూ, హాస్పిటల్ ఒకటే కావడం వలన ఆమెకి తిరిగే శ్రమ కూడ తప్పింది. సాగర్ మాత్రం ఆమె నంబరు తెలుసుకొని ఫోను చేసేడు. “సారీ నిశాంతా! నీకు మొహం చూపించే శక్తి […]

చీకటి మూసిన ఏకాంతం – 9

రచన: మన్నెం శారద రెండ్రోజుల తర్వాత సాగర్ నుండి ఫోనొచ్చింది. “నిశాంతా నీ రిపోర్టులు వచ్చేయి. నీకేం లోపం లేదు. ఒకసారి హితేంద్రని కూడ పంపు! అతన్ని కూడ ఎగ్జామిన్ చేస్తే..‌.” “అలాగే. థాంక్స్” అంది నిశాంత. “ఎలా వున్నావు?” “బాగానే వున్నాను.” ఫోను క్రెడిల్ చేస్తుండగా లోపలికొచ్చేడు హితేంద్ర. అతనింటికొచ్చి రెండ్రోజులు దాటింది ‌ అతని వంక తేరిపార చూసింది నిశాంత. అతని మొహం సీరియస్ గా వుంది. “ఎవరితో మాట్లాడుతున్నావ్ ఫోన్లో!” అనడిగేడు సోఫాలో […]

చీకటి మూసిన ఏకాంతం – 7

రచన: మన్నెం శారద నవనీతరావు కారేసుకొని సాగర్ ఇంటికొచ్చేడు. సాగర్ ఆయన్ని చూసి “రండి రండి. కబురు చేస్తే నేనే వచ్చేవాణ్ణిగా!” అన్నాడు ఆదరంగా ఆహ్వానిస్తూ. “అంత పనేం లేదులే. ఊరికే చూసి పోదామని వచ్చేను‌. ఎలా వున్నావు?” అనడిగేడాయన కూర్చుంటూ. “బాగానే వున్నాను సర్! ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను. మొన్న మదర్ అండ్ ఛెయిల్డ్ ఆస్పత్రిలో ఇంటర్వ్యూ వస్తే వెళ్ళొచ్చేను.” “నిశాంత జాబ్ చేయడం లేదా?” “తెలీదు. నే వెళ్ళలేదు. ఈమధ్య మా ఇంటికోసారి […]

చీకటి మూసిన ఏకాంతం 6

రచన: మన్నెం శారద   నిశాంత పెళ్ళి హితేంద్రతో నిరాడంబరంగా రిజిస్ట్రాఫీసులో జరిగిపోయింది. సాక్షి సంతకాలు సాగర్, అతని తరపున సినిమా రంగం తాలూకు ఇద్దరు వ్యక్తులు పెట్టేరు. పెళ్ళిరోజు వరకు నవనీతరావు భార్యకా సంగతి చెప్పలేదు. చెబితే ఎంత రాద్ధాంతమవుతుందో అతనికి తెలుసు. అందుకే మౌనం పాటించేడు. నిశాంత కూడ చివరి రోజు వరకు తల్లిదండ్రులతో ఆ సంగతి చర్చించలేదు. కారణం – సాగర్ ఆమెకు – ఆమె తండ్రి ఎంతమాత్రం ఈ పెళ్ళికి సుముఖంగా […]

చీకటి మూసిన ఏకాంతం – 5

రచన: మన్నెం శారద   “కృష్ణారావుగారబ్బాయి ఎం.డి. చేసి ఫారిన్ వెళ్తున్నాడట!” “మంచిది. వెళ్ళిరమ్మను” అన్నాడు నవనీతరావు పేపర్లోంచి దృష్టి తిప్పకుండానే. వసుంధర అతని వైపు కోపంగా చూసి “మీరు చెప్పలేదనే వెళ్ళడం లేదు.” అంది విసురుగా. నవనీతరావు తలెత్తి “నీకేదో కోపం వచ్చినట్లుంది. అసలేం చెప్పేవు నువ్వు!” అనడిగేడు అమాయకంగా. “నా ఖర్మ కాలిందని చెప్పేను.” “తప్పు. నేను బాగానే వున్నానుగా!” “బాగానే ఉన్నారు బండరాయిలా. ఎదిగిన కూతురు కళ్ళెమొదిలేసిన గుర్రంలా తిరుగుతోంది. దానికి పెళ్ళి […]

చీకటి మూసిన ఏకాంతం – 4

రచన: మన్నెం శారద సూర్యుడు పుడమి రేఖని దాటి బయటపడలేదు గాని తూర్పు ఎర్రబడుతోంది. అతని ఆగమనాన్ని సూచిస్తూ. సముద్రం చిన్నపిల్లలా కేరింతలు కొడుతోంది. కెరటాలు నురుగుపై పడిన ఎర్రని కాంతి ముడి విడిపడిన పగడాల మూటలా చెదరిపోతున్నది. నిశాంత మెల్లిగా ఇసుకలో అడుగులేసి నడుస్తూ ఒక చోట ఆగిపోయింది. అక్కడ సముద్రానికభిముఖంగా కూర్చుని గొంతెత్తి భూపాల రాగమాలపిస్తున్నాడు హితేంద్ర. అతని కంఠం వడిలో దూకే జలపాతంగా, సుడిలో చిక్కుకున్న గోదారిలా అనంతమైన ఆకాశాన్ని అందుకోవాలని ఆరాటపడి […]

చీకటి మూసిన ఏకాంతం 3

రచన: మన్నెం శారద “ఇక చాలు!” వసుంధర మరో రెండు ఇడ్లీలు వెయ్యబోతుంటే చెయ్యడ్డం పెట్టింది నిశాంత. “తిను. మళ్ళీ అర్ధరాత్రి వరకూ తిరగాలిగా!” అంది వసుంధర కటువుగా. నిశాంత తల్లివైపదోలా చూసింది. రాత్రి సాగర్ తనని స్కూటర్ మీద వదలడం ఆమె కంటపడింది. పొద్దుటే ఆ సంగతిని ఎలా అడగాలో అర్ధంకాక విశ్వప్రయత్నాలు చేస్తున్నదావిడన్న సంగతి నిశాంతకి అర్ధమయింది. ఎదురుగా కూర్చుని టిఫిన్ తింటున్న కూతురి వైపు పరిశీలనగా చూశాడు నవనీతరావు. నిశాంత తల్లిమాటకెగిరి పడకుండా […]

చీకటి మూసిన ఏకాంతం – 2

రచన: మన్నెం శారద ‘నిన్న లేని అందమేదో నిదుర లేచేనెందుకో. నిదుర లేచేనెందుకో!’ అద్దంలో బొట్టు పెట్టుకుంటున్న నిశాంత తృళ్లి పడి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నుండి లేచి నిలబడి చుట్టూ చూసింది. అక్కడ రేడియో కాని – టేప్ రికార్డర్ కాని ఆన్ లో లేవు. ఘంటసాల పాటలంటే ఆమెకి ప్రాణం తీసుకునేంత ప్రాణం! అతని పాటల కేసెట్లన్ని సంపాదించి పెట్టుకుంది. మనసు బాగున్నప్పుడు- బాగొలేనప్పుడు కూడా అవి హృదయాన్ని తెలిక పరిచి డోలలూగించి ఎవో […]

చీకటి మూసిన ఏకాంతం – 1

రచన: మన్నెం శారద   డిసెంబరు నెల చివరి రోజులు ఆరు గంటలకే చీకటి అన్ని దిక్కుల్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోంది. డిస్పెన్సరీలో కూర్చుని పేషెంట్స్‌ ని చూస్తోంది డాక్టర్ నిషాంత. పేషెంట్సు కూడా చాల తక్కువగా వున్నారు. వింటర్ డాక్టర్స్‌ కి చాల డల్ సీసన్. వర్షాకాలంలో నీటి కాలుష్యంతో వచ్చే జబ్బుల్నుండి బయటపడి కొంచెం హాయిగా జీవిస్తుంటారు ప్రజలు. కారణం కొంత చల్లని వాతావరణం, వరదల వలన వచ్చిన నీరు నిలకడగా నిలిచి కొంత […]

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

December 2023
M T W T F S S
« Nov    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031