June 9, 2023

జీవన వేదం 10

రచన స్వాతీ శ్రీపాద వెనక్కు తిరిగి చూసుకుంటే నడిచి వచ్చిన దారి పూలబాట కాదు. చక్కగా పరచిన రహదారీ కాదు. డిగ్రీ పూర్తయినా చదువు ఆగలేదు, అదే ఊపులో ఆపాటికే నేర్చుకున్న ఇంగ్లీష్ భాషమీద వ్యామోహంతో ఎమ్. ఏ కూడా ప్రైవేట్ గానే పూర్తి చేసింది. సజావుగా సాగుతున్న జీవితంలో ఈవెంట్ మానేజర్ గా సీత మానేజ్ మెంట్ దారిలో రవికిరణ్ అత్యున్నత స్థాయికి వెళ్ళినా, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా పిల్లలు లేకపోవడం ఎవరూ తీర్చే లోటు […]

జీవనవేదం – 9

రచన: స్వాతీ శ్రీపాద   ఇంట్లో మిగిలినది సీత, రవికిరణ్.  ఒక గది మిత్రుడిదే.  తనగదిలో తను ఉండటం ఎప్పుడైనా తనకు కావలసినది వండుకోడం తప్ప పెద్దగా వారిని డిస్టర్బ్ చేసే వాడు కాదు. సీత మరింత బిజీగా మారిపోయింది.  రవికిరణ్ ఒక్కడూ ఉంటాడని వంటావార్పులకు వెళ్ళడం తగ్గించుకుని ఇంట్లోనే వండి సరఫరా చేసేది.  కదిలినా మెదిలినా రవికిరణ్ ను కంటికి రెప్పలానే చూసుకుంది.  వారానికి రెండు రోజులు సంగీతం నేర్పడానికి వెళ్ళేది.  ఏ పని చేస్తున్నా […]

జీవన వేదం – 8

రచన: స్వాతీ శ్రీపాద ఇమ్మిగ్రేషన్ తంతు ముగించుకుని బెరుకు బెరుగ్గా బయటకు వచ్చేసరికి రవికిరణ్ పేరు రాసిన ప్లకార్డ్ పట్టుకుని నించున్న అతని మిత్రులు ముగ్గురినీ చూసి సులభంగానే గుర్తుపట్టి చేతులు ఊపారు. చొరవగా ముందుకు వచ్చి రండి అంటూ వారి సామాన్ల ట్రాలీలను అందుకున్నారు. ఏం మాట్లాడాలో ఎవరికీ తెలియడం లేదు. సీత మనసు ఒకరకంగా మొద్దుబారిపోయింది. ప్రమాదం జరిగింది, రవికిరణ్ ఆసుపత్రిలో ఉన్నాడని విన్నది మొదలు ఒక్క మాటా నోటరాలేదు. ఏ ఆలోచనా తోచడమే […]

జీవనవేదం – 7

రచన: స్వాతీ శ్రీపాద “లాంగ్ వీకెండ్ వస్తోంది కదా, కిరణ్ ఎక్కడికి వెళ్దాం?” సోఫాలో అతన్ని ఆనుకుని కూచుని అడిగింది సుమ. “అవును, ఇంకా ఆలోచించనే లేదు.చెప్పు ఎక్కడికి వెళ్దాం.” ఎందుకో కాని అలా అడగ్గానే సిత గుర్తుకు వచ్చింది రవి కిరణ్ కు. చిన్నప్పటినుండీ ప్రతివాళ్ళూ రవి అని పిలవడమే కాని ఎవ్వరూ ఇలా కిరణ్ అని పిలవకపోడం కొత్తగా, బాగుంది అతనికి. “నువ్వే చెప్పాలి, రెండు మూడు రోజులు ఇద్దరమే ఒక ప్రపంచమై గడపాలి. […]

జీవనవేదం – 6

రచన: స్వాతీ శ్రీపాద సీతకు సంతోషంగా ఉంది. మొదటి సారి తనకంటూ వచ్చిన గుర్తింపు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. పుట్టి బుద్దెరిగి ఎప్పుడూ నా అనే ఆలోచనే లేదు. బహుమతి ప్రదానం జరిగి మీటింగ్ ముగిసేసరికి రాత్రి తొమ్మిది దాటి పోయింది. మర్నాడు ఆలిండియా రేడియో వాళ్ళు విజేతలను తమ రికార్డింగ్ కోసం ఆహ్వానించారు. నలుగురైదుగురు కలిసి రికార్డింగ్ కి వెళ్ళారు. వెంట వచ్చినలెక్చరర్ర్లు తమ బసలోనే ఉండిపోయారు. “అయితే లంచ్ కాగానే వెళ్ళిపోతారన్న మాట” అన్నాడు […]

జీవనవేదం-5

రచన: స్వాతీ శ్రీపాద అమ్మా , అమ్మమ్మ కాని అమ్మమ్మా నా లోకం. ఇద్దరూ ఊరువిడిచి హైదరాబాద్ మారు మూలకు వెళ్ళిపోయారు. నేను పుట్టాక అమ్మ మళ్ళీ ఏదో హాస్పిటల్ లో ఉద్యోగంలో చేరింది. అతి కష్టం మీద నాన్న మీద కేస్ ఫైల్ చేసి వివాహాన్ని రద్దు చేయించగలిగింది అమ్మమ్మ. అమ్మమ్మ సంరక్షణలోనే పెరిగి పెద్దై చదువుకున్నాను. కాలేజీలో ఉండగా కాబోలు అమ్మ ఏదో కాన్ఫరెన్స్ కి ఆస్త్రేలియా వెళ్ళింది. అది అమ్మ జీవితంలో గొప్ప […]

జీవనవేదం – 4

రచన: స్వాతీ శ్రీపాద “నాగరత్నం మా అమ్మ.” అంటూ లేచి పారిజాతం “మా అమ్మ లోకం తెలిసిన మనిషి కాదు. మేనత్త దగ్గర ఒద్దికగానే పెరిగినా లోకం పోకడ అసలు తెలియదు. భర్తే ప్రపంచం అనుకుంది. పెళ్ళైన ఆరునెలలకే మేనత్త కాలం చేసినా వెళ్ళి చూసే అనుమతి కూడా దొరకలేదు. మేనత్త మైల మూడు రోజులతో సరి – అంటూ ఇంటిపనులన్నీ చేయించారట దుఃఖంలో ఉన్న అమ్మతో. ఇహ నాన్న సంగతి సరేసరి. పదిళ్లపూజారి. ఏ రోజునా […]

జీవన వేదం -3

రచన: స్వాతీ శ్రీపాద “పిల్లను తీసుకు వెళ్తే బాగుండేది” అది ఏ నూటొక్కసారో అతని తల్లి అనడం. “ఉన్నపళంగా తీసుకువెళ్ళడం అంటే కుదిరే పనేనా? నేనా ఇద్దరు ముగ్గురితో కలిసి ఉంటున్నాను. మరో ఇల్లు వెతుక్కోవాలి. కొత్త ఉద్యోగం తీరిక దొరకాలి. ” అంటూ నసిగాడు. సీతకూ దిగులు దిగులుగానే ఉంది. కాని అతను చెప్పినదీ నిజమే. చదువులు ఇంకా పూర్తికానట్టే మరి. జీవితంలో ఎదగాలన్న కాంక్ష ఉన్నప్పుడు దాన్ని అదిమి పెట్టడం మంచిది కాదుగా. రవికిరణ్ […]

జీవన వేదం – 2

రచన: స్వాతీ శ్రీపాద అప్పట్లో టీవీలు, అంతర్జాలాలూ, స్మార్ట్ ఫోన్ లూ లేని రోజుల్లో ఎంత చదువుకున్నా కొంత అమాయకత ఉంటూనే ఉండేది. తల్లిని వదిలి వెళ్ళడం మరీ కష్టంగా ఉంది. అడగకముందే సమయానికీ అన్నీ అమర్చిపెట్టే అమ్మ, ఇప్పుడిహ సర్వం తనే చూసుకోవాలి. అమ్మ ధైర్యంగానే ఉంది. ” పిల్లలను కన్నాం పెంచి పెద్ద జేసాం, చదువుకుని ప్రయోజకులై వాళ్ళ జీవితాలు వాళ్ళు బ్రతకాలి కదా? అమ్మ కొంగట్టుకు తిరిగితే జీవితం గడచిపోతుందా?” అంటూ తనే […]

జీవన వేదం -1

ఏదేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా – భారతీయత ఔన్నత్యమే వేరు. భారతీయ జీవన విధానం అపూర్వం అద్వితీయం. వేరు పురుగుల్లా, బురదలో దొర్లే జీవాల్లా ఎందరున్నా అక్షయ పాత్రల్లా ఆర్తులకు అండగా నిలిచేవారు, ధర్మాన్ని మరచిపోని మహాత్ములు ఉన్నంతవరకు ఈ ధర్మపధం ఈ యాత్ర కొనసాగుతాయి. బ్రతుకు బ్రతకనివ్వు అదే జీవన వేదం. రచన: స్వాతీ శ్రీపాద ఆది దేవ నమస్తుభ్యం …. ప్రసీద మమ భాస్కరః ప్రభాకర నమస్తుభ్యం దివాకర నమోస్తుతే …. సరిగ్గా ఉదయం […]

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

June 2023
M T W T F S S
« May    
 1234
567891011
12131415161718
19202122232425
2627282930