February 21, 2024

డయాస్పోరా జీవన కథనం – త్రిశంకు స్వర్గం

రచన: కోసూరి ఉమాభారతి క్లిష్టమైన పరిస్థితుల నడుమ నలిగి, సుస్థిరత్వాన్నే కోల్పోయిన ఓ ప్రవాస భారతీయ మహిళ కథనం… ****************** ఎవరో గట్టిగా తట్టి లేపుతున్నారు. కళ్ళు నులుముకొని లేచాను. ఎదురుగా ఓ అమెరికన్. పెద్దాయనే. అర్ధం కాలేదు. చుట్టూ చూశాను. మా ఇంటి దగ్గర పార్క్ లో ఓ చెట్టు క్రింద, బెంచ్ మీద ఉన్నాను. ‘జాక్ ఇన్ ద బాక్స్’యూనిఫారంలో ఉన్నాను. ఏమైనట్టు, పనికి బయలుదేరడం గుర్తుందే, మరి ఇక్కడున్నానేమిటి? అయోమయంగా ఉంది. టైం […]

డయాస్పోరా జీవన కథనం – పితృత్వం

రచన : కోసూరి ఉమాభారతి అహ్మదాబాద్ నుండి శారద ఢిల్లీ పయనమైంది. ఆమె కొడుకు అనిల్ ‘ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్’ (AIIMS) నుండి ఉత్తీర్ణుడవుతున్న సందర్బంగా… స్నాతకోత్సవానికి హాజరవ్వనుంది. తన భర్త ఆశించినట్టుగా సేవా దృక్పధంతో వైద్య వృత్తిని చేపట్టబోతున్న కొడుకుని చూసి గర్వపడుతుంది శారద. ఉత్సాహంగానే ఉన్నా, ఏడాది క్రితం ఆకస్మికంగా సంభవించిన భర్త మరణం ఆమెని కృంగదీస్తుంది. ** స్నాతకోత్సవం తరువాత జరిగిన తేనేటి విందులో… క్లాస్-మేట్ పూనమ్ ఖత్రి […]

డయాస్పోరా జీవన కథనం – నాతిచరామి

రచన: కోసూరి ఉమాభారతి ‘బేలార్ మెడికల్ స్కూల్’ వారి ‘థొరాసిక్ సర్జరీ’ తదుపరి ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యాడు విశ్వనాధ్. సర్జరీ చీఫ్, డా. రెనాల్డ్ జాన్సన్ నుండి అభినందనలు అందుకుని… సంతోషంగా బయటకి నడిచాడు. అమెరికాలో ‘థొరాసిక్ సర్జన్’ గా స్థిరపడాలన్న అతని కల సాకారమయ్యే అవకాశం రానే వచ్చింది. కార్ స్టార్ట్ చేసి మెడికల్ స్కూల్ గేట్ దాటాడు విశ్వనాధ్. హౌస్టన్ లోని ‘బేలర్ మెడికల్ ఇన్స్టిట్యూట్’ లోనే ఫెలోషిప్ చేసే అవకాశం రావడం […]

అనగనగా ఓ జాబిలమ్మ

రచన: కోసూరి ఉమాభారతి అనగనగా ఓ జాబిలమ్మ….. “చంద్రకళా, ఎక్కడమ్మా నువ్వు?” అమ్మ పిలుపుకి, “ఇదో ఒక్క నిముషం,” అని చందూ జవాబు చెప్పింది. రాత్రి పడుకునే ముందు రోజూవారీగా జరిగే వారి ‘కథా-సమయం’ ఆసక్తికరంగా సాగుతుంది. అందుకోసం అమ్మ ఇలా దాన్ని పిలవడం, చందూ అలా జవాబివ్వడం రోజూ వినేదే. మామూలుగా అయితే, ఆ సమయానికి, అమ్మ గది సర్దుతూ వాళ్ళ మాటలు వింటుంటాను. రెండు రోజులుగా చందూ పుట్టినరోజు పనులతో, అమ్మ గది వైపు […]

‘డయాస్పోరా జీవన కథనం’ – ముళ్ళ గులాబి

రచన: కోసూరి ఉమాభారతి ‘మారుతున్న యువత దృక్పధాలకి, నాటి తరాల మనస్తత్వాలకి నడుమ సంఘర్షణే ‘ముళ్ళ గులాబి’ లోని కధాంశం’ “మమ్మీ! కరెక్ట్ గా ఆరు గంటలకి, మిల్పిటాస్ బాబా టెంపుల్ కి వచ్చేయి. నేను, మాలిని అక్కడ నిన్ను కలుస్తాము. తరువాత డిన్నర్ కి వెళదాము….సరేనా?” ఫోన్ లో కిరణ్. ఉత్సాహంగా ఉన్నాడు మావాడు. న్యూయార్క్ కాలేజీ నుండి ‘లా’ డిగ్రీ తీసుకొని, బిజినెస్ MBA చేసాడు. ఆరు నెలల క్రితమే శాంహోజే, కాలిఫోర్నియాలో ఉద్యోగంలో […]