April 25, 2024

పరవశానికి పాత(ర) కథలు – జ్వరం

రచన: డా. వివేకానందమూర్తి   భూమికి పాతికేళ్ళు పాతబడిపోయిన పరమహంసకి జీవితంలో మొదటిసారిగా జ్వరం వచ్చింది. జ్వరానికి, పరమహంసకి మధ్యన ఉన్న సంబంధం అయస్కాంతం యొక్క నార్త్ పోల్ నీ, సౌత్ పోల్ నీ గుర్తుకు తెస్తుంది, చీకటికీ, దొంగలకీ, దెయ్యాలకీ, ప్రాణం మీదికొచ్చే ప్రమాదాలకీ చివరికి భార్య మాటకి కూడా భయపడని పరమహంస జ్వరానికి భయపడతాడని తెలిస్తే నవ్వు వస్తుంది. చంటి పిల్లలు బూచాడు ఎత్తుకుపోవడం గురించి, పెద్దవాళ్లు ప్రమాదాల గురించి, రాజకీయ నాయకులు నిజం […]

పరవశానికి పాత(ర) కథలు – చావు

రచన: డా.వివేకానందమూర్తి (యు.కె) శ్రీనివాసులుకి చచ్చిపోదామనిపించింది. ఇదివరకు ఇలా చాలాసార్లు అనిపించింది. కష్టమొచ్చినప్పుడల్లా శ్రీనివాసులు చచ్చిపోదామనుకుంటాడు. అతనికి కష్టాలు చాలాసార్లు వచ్చాయి. అందుకని చాలాసార్లు చచ్చిపోదామనుకున్నాడు. శ్రీనివాసులు మానసికంగా చచ్చిపోయినప్పుడు, శారీరకంగా చచ్చిపోదామనుకుంటాడు. కష్టాలొచ్చినప్పుడల్లా శ్రీనివాసులు మానసికంగా చచ్చిపోతాడు; చావు మీది కోరికని అతనికి మనస్సు నేర్పింది. శ్రీనివాసులి మనస్సుని అస్తమానం కష్టం భయపెడుతూ వుంటుంది. కష్టపెట్టే కష్టాలు భరించలేక అతని మనస్సు పరిష్కారం వెదుక్కున్నప్పుడు శ్రీనివాసులుకి ‘చావు’ సమాధానంగా నిలుస్తుంది. శ్రీనివాసులికి ఇప్పుడు బ్రతుకు చావులా […]

పరవశానికి పాత(ర) కథలు – మంచులో మనిద్దరం

రచన: డా. కె. వివేకానందమూర్తి విశాఖపట్నంలో స్టీలు ప్లాంటు తీసుకురావాలని విద్యార్థులకున్నంత గాఢంగా, విద్యార్థుల్లో క్రమశిక్షణ తీసుకురావాలని ఉపాధ్యాయులనుకున్నంత గాఢంగా – లక్ష్మీవారం నాడు లక్ష్మీకుమారి మనసులో రసభావాలు పోజిటివ్ గా తీసుకురావాలని బాలరాజు అనుకున్నాడు. అంతకు ముందే అమితమైన అవకాశాలు అందుబాటులోకి వచ్చినా అదే బాటలో అతనిన్నాళ్ళు నడవలేదు. మనస్సుకి తెగింపు చాల్లేదు. కానీ ఉన్నట్టుండి వెళ్ళిపోయిన లక్ష్మీవారం లక్ష్యంగా పెట్టుకున్న లక్ష్మి వందనం లక్షలకొద్దీ ప్రేమ భావాలతో లక్షణంగా తయారై వచ్చి, విశాఖపట్నం బీచ్ […]

పరవశానికి పాత(ర) కథలు – పోలీ శాంతీ మియా వీరా?

రచన: డా. వివేకానంద మూర్తి ఎవరన్నారో, ఎందుకన్నారో తెలీదుగానీ, అలా నోరు నెప్పిజేసి దవళ్ళు వాచేలా – అనగా అనగా ఒక రాజు అప్పుడే సాయంత్రాన్ని సాగనంపేసిన ఒక రోజు ప్రపంచాన్ని చల్లగాను, ప్రేమికుల్ని వేడిగానూ పరిపాలించటం ప్రారంభించేరు. ఆ రాజుగారి చూపులు విస్తృతంగా విస్తరించి విశాలంగా, విలాసంగా వున్నాయి. అది విశాఖపట్నంలో “లాసన్స్ బే’ తీరంలో వున్న శాంతి ఆశ్రమంలోనికి కూడా చొచ్చుకుని, అక్కడ ఏపుగా పెరిగిన సరుగుడు చెట్లని వొరుసుకుంటూ వచ్చి నేల మీదికి […]

పరవశానికి పాత(ర) కథలు – 2 , నేను చూసిన నక్షత్రం

రచన: డా. వివేకానందమూర్తి నాకీ మధ్య హఠాత్తుగా కథలు రాసే యావ తగ్గిపోయి రాయడం మానేశాను. కథ రాయడం మానేయడానికి కథ ఉంది. నేనెప్పుడు కంచికి వెళ్ళిన కథే మంచి కథ అనుకుంటాను. కథలు ముమ్మరంగా రాసే రోజుల్లో నేనోసారి కంచికి వెళ్లేను. నా కథ లెక్కడేనా కనిపిస్తాయేమోనని కాంచీపురమంతా కళ్లు కంచు కాగాడాల్లా చేసుకుని కాంచేను. కనిపించలేదు. నేను కంచికి చేరినా నా కథలు కంచికి చేరలేదు. అంచేత నేను మంచివి రాయలేదనుకున్నాను. నాకు చాలా […]