December 1, 2022

తపస్సు – సహచరి

రచన: రామా చంద్రమౌళి అకస్మాత్తుగా ఆమెను ‘ ఐ సి యూ ’ కు తీసుకు వెళ్ళారు ఆమెకు భర్తా, ఇద్దరు పిల్లలూ ఉన్నారు కాని వాళ్ళు చాలా బిజీ ఎక్కువరోజులు ఆమె వెంట వాళ్ళుండరు వాళ్ళు ఖండాంతరవాసులు .. వస్తూ పోతూంటారు అప్పుడప్పుడు కొందరంతే., అందరూ ఉండీ ఎవరూ లేనివారు అన్నీ ఉండీ ఏమీ లేనివారు బయటికి ‘ పూర్తిగా ’ ఉన్నట్టనిపిస్తూ లోపల పూర్తిగా డొల్లై జీవిస్తున్నవారు – ఆమె ఆ ఉదయమే వాకిట్లో […]

తపస్సు – అప్పుడప్పుడు.. కొన్ని

రచన: రామా చంద్రమౌళి ఆమె ఒక కూలీ కొత్తలో.. అతను ఆమె అందమైన ముఖాన్ని ఫోటో తీశాడు బాగుంది.. జీవాన్ని నింపుకుని.. నిర్మంగా కాని ఆ ఫోటో అతనికి నచ్చలేదు మరోసారి ఆమె ఒక రోడ్దుపనిలో నిమగ్నమై ఉండగా ఫోటో తీశాడు చాలా బాగుంది కాని అతనికి అదీ నచ్చలేదు అందులో ఆమె దేహముంది.. కాని వర్చస్సు లేదు మళ్ళీ ఒకసారి ఆమె నడచి వెళ్ళిపోతూండగా కేవం ఆమె వెనుక భాగాన్ని ఫోటో తీశాడు నచ్చిందది అతనికి […]

తపస్సు – మూసిన పిడికిలి

  రచన: రామా చంద్రమౌళి పసిపాప నిద్రపోతోంది లేత నిప్పురంగులో మూసిన పసి పిడికిలి.. మధ్య మధ్య నవ్వు ‘లోపల ఉన్నవన్నీ రహస్యాలేనా.? ’ అని ప్రశ్న పిడికిట్లో గాలి.. పిడికిట్లో కాలం పిడికిట్లో ఊపిరిపోసుకుంటున్న జీవితం ఆమె అతను చూస్తున్నారిద్దరూ కిటికీలోనుండి బయటికి కల్లోల సముద్రంలోకి.. దిగంతాల్లోకి ‘అందరి చూపులూ అన్నింటినీ చూడగలవా’ అంది ఆమె అతను మాట్లాడలేదు చటుక్కున తిరిగి ఆమె కళ్ళలోకి చూశాడు ‘దూరంగా సముద్రం కనిపిస్తోందికదా’ అందామె మళ్ళీ ‘సముద్రం నీ […]

తపస్సు – పిల్లల ఆటస్థలం

రచన: రామా చంద్రమౌళి చెట్టుకింద సిమెంట్‌ బెంచీపై కూర్చోబోతున్నా రివ్వున పరుగెత్తుకొచ్చింది బంతి కాళ్ళలోకి జివ్వున సముద్రం ఉరికిచ్చి .. పట్టుకుంటూండగా వచ్చాడు వాడు పరుగెత్తుకుని ముఖంనిండా వెలుగు .. కళ్ళలో ఆకాశం బంతిని అందించగానే .. తుఫానై వెళ్ళిపోయాడు – పిల్లలు ఆడుతూనే ఉన్నారు పదిమంది దాకా ఆట ఒక్కటే .. మనుషులే వేర్వేరు వెనక్కి బెంచీ అంచుపై చేతులను విప్పి చాపి కళ్ళు మూసుకుంటే పొద్దంతా, కొద్దిసేపు పులినై, మరికొద్దిసేపు పిల్లినై అప్పుడప్పుడు చెక్కుకున్న […]

తపస్సు – స్వప్న రహస్యం

రచన: రామా చంద్రమౌళి బొగ్గు నిప్పుగా మారి..గాలితో సహచరిస్తూండగా ఇనుమును ఎర్రగా కాల్చీ కాల్చీ.. ఆయుధంగా మార్చడం ఒక రూపాంతరక్రియే.. ఐతే రెండు చేతులూ..రవ్వంత నైపుణ్యం..పిడికెడు హృదయమూ కావాలి – పరీక్షా సమయాలు ఎదురౌతూనే ఉంటాయి పర్వతాన్ని ఎక్కుతున్నపుడు అది నిరోధిస్తూనే ఉంటుంది ఐతే.. అది అందించే చెట్ల చేతులనూ, రాతి వంకర్ల ‘ పట్టు ’ నూ స్పృహించాలి నీడ ప్రక్కనే.. వెంటనే వెలుగుంటుందని గ్రహించాలి ప్రయాణం ఆగదు ప్రసవానికి ముందరా..తర్వాతా..అంతా భీకర వేదనే ఎక్కడో […]

తపస్సు – అరాచక స్వగతం ఒకటి

రచన: రామా చంద్రమౌళి ఫిల్టర్‌ కాగితంలోనుండి చిక్కని తైలద్రవం ఒకటి .. ఎంతకూ జారదు , స్థిరంగా నిలవదు కల .. ఒక ఎండాకాలపు ఎడారి ఉప్పెన అవినీతి వ్రేళ్లను వెదుక్కుంటూ .. తవ్వుకుంటూ తవ్వుకుంటూ ఎక్కడో భూగర్భాంతరాళాల్లోకి అభిక్రమిస్తున్నపుడు అన్నీ సుప్రీం కోర్ట్‌ ‘ సైలెన్స్‌ సైలెన్స్‌ ’ కర్రసుత్తి రోదనూ , విజిల్‌ బ్లోయర్స్‌ .. శబ్ద విస్ఫోటనలే ఈ దేశపు ప్రథమ పౌరుని గురించి సరేగాని అసలు ‘ అథమ ’ పౌరుడు […]

తపస్సు – కొన్ని ఖడ్గ ప్రహారాలు .. కొన్ని శిథిల శబ్దాలు

రచన: రామా చంద్రమౌళి గాయపడ్డ గాలి రెక్కలను చాచి వృక్షం నుంచి వృక్షానికి పునర్యానిస్తూ , స్ప్సర్శిస్తూ , సంభాషిస్తూ ఒళ్ళు విరుచుకుంటున్న ఆకాశంలోకి అభిక్రమిస్తున్నపుడు కాలమేమో మనుషుల కన్నీళ్ళను తుడుస్తూ తల్లిలా ద్రవకాలమై, ద్రవధ్వనై, ద్రవాత్మయి, చినుకులు చినుకులుగా సంగీత నక్షత్రాలను వర్షిస్తూ అరణ్యాలపై, ఎడారులపై, సముద్రాలపై, పాటలను కురుస్తూ వెళ్తూంటుంది .. తన కొంగు అంచులు జీరాడుతూండగా సెకన్‌లో మిలియన్‌ వంతు ఒక రసానుభూతి .. తన పూర్ణవెన్నెల రాత్రయి వికసిస్తూనే చకచకా శతాబ్దాల […]

తపస్సు – బొక్కెన

రచన: రామా చంద్రమౌళి వృద్ధాశ్రమం కిటికీ అవతల వరండాలో కురిసే వెన్నెల అక్కడక్కడా చెట్లు.. మౌనంగా .. నిశ్శబ్ద శృతి తీగలు తెగిపోయిన తర్వాత రాగాలు చిట్లిపోయినట్టు శబ్ద శకలాలు చిందరవందరగా గోడపై మేకులకు వ్రేలాడ్తూ .. చిత్రపటాలౌతాయి జ్ఞాపకాలూ , కన్నీళ్ళూ , ఎండుటాకుల సవ్వడులుగా అన్నీ .. అడుగుజాడల వెంట మట్టి చాళ్ళలో నీటి జలవలె జారుతూ. . పారుతూ పిడికెడు గుండె వాకిట్లోకి స ర్‌ ర్‌ ర్‌ ర్‌ న .. […]

తపస్సు – ఒక నువ్వు.. మరొక నేను

రచన: రామా చంద్రమౌళి నడచి వెళ్ళిన ప్రతిసారీ పాదముద్రలేమీ మిగవు నడచి వచ్చిన దారికూడా జ్ఞాపకముండదు చూపున్నీ లక్ష్యాలపైనే ఉన్నపుడు ఇక వ్యూహాలే పన్నాగాలౌతాయి పాచికలు విసుర్తున్న ప్రతిసారీ అటు ఎదురుగా నీ ప్రత్యర్థీ.. ఇటు నీకు నువ్వే కనిపిస్తావు ఐతే.. కొన్ని విజయాలను అనుభవిస్తున్న దీర్ఘానుభవం తర్వాత కొన్ని ఓటములు విజయాలకన్నా మిన్నవని తోస్తుంది వెలుతురుకంటే చీకటి కూడా చాలా ముఖ్యమని నిద్రపోవాలనుకుంటున్నపుడు అర్థమౌతుంది ‘ లైట్లు ’ ఆర్పేయడం ఒక్కోసారి అనివార్య క్రియ- మనుషులంకదా.. […]

తపస్సు – మహా కాళేశ్వరం.. ఒక జలాలయం

రచన: రామా చంద్రమౌళి మనిషి నాగటి పోటుతో భూమిని గాయపరుస్తాడు ఐనా.. భూదేవి రక్తసిక్త శరీరంతో మనిషిని గుండెకు హత్తుకుని ప్రతిగా .. మాతృమూర్తియై నోటికి ఆహారాన్ని అందిస్తుంది భూమి తల్లి .. భూమి దేవత .. భూమి కారుణ్య .. భూమి ఒక లాలించే ఒడి సరస్సులనూ, తటాకాలనూ, నదులనూ, ఆనకట్టలనూ చివరికి సముద్రాలను కూడా మోస్తున్నది భూమేకదా ఈ పవిత్ర భూమితో .. మట్టితో .. మట్టి ఆత్మతో యుగయుగాల అనుబంధం మన తెలంగాణా […]