March 29, 2023

తాత్పర్యం – దుఃఖం సుఖంకంటే సుఖమా. ?

రచన:- రామా చంద్రమౌళి ఆమె సుభద్రేనా. ? మనసు పదే పదే తరచి తరచి వెదుకుతోంది. జ్ఞాపకాన్ని. రెండు నిముషాలక్రితం గబగబా మెట్లెక్కుతూ ఎ. టి. ఎం. లోకి వస్తున్నప్పుడు కనబడ్డ ఆమె రూపురేఖలను మరోసారి మననం చేసుకుంటూ. దాదాపు నలభై సంవత్సరాల క్రితం కనుమరుగైన సుభద్ర. మళ్ళీ అనూహ్యంగా. ఇప్పుడు ఇలా కనబడే అవకాశం ఉందా. ఒకవేళ ఆమె సుభద్రే ఐతే. ఇన్నాళ్ళు ఎక్కడుందో. ఎక్కడో ఉంటే ఇప్పుడెందుకొచ్చిందో. వస్తే. , సుభద్ర. సుభద్ర. . […]

తాత్పర్యం – 5 – అతడు

రచన: రామా చంద్రమౌళి మనిషి శరీరం ఒక బయో వాచ్. ఇరవై నాలుగు గంటల సమయానికి సెట్ చేయబడి. . ట్యూన్ చేయబడి. . అసంకల్పిత నియంత్రణతో దానంతటదే నడిచే ఒక జీవవ్యవస్థ. ఈ రోజు ఈ క్షణం ఏమి చేస్తావో. . రేపు మళ్ళీ అదే సమయానికి అదే పనిని చేయాలనే అదృశ్య కుతూహలం. . అదే సమయానికి నిద్ర. . అదే సమయానికి ఆకలి. . అదే సమయానికి సెక్స్. . అదే సమయానికి […]

తాత్పర్యం – అమ్మ గది

రచన: రామా చంద్రమౌళి ఏ వస్తువు విలువైనా ఆ వస్తువు లేనప్పుడే తెలుస్తుంది. మనిషి విషయంకూడా అంతే..ఒక మనిషి మననుండి దూరమౌతున్నప్పుడు. పూర్తిగా ఎడమై కోల్పోతున్నప్పుడు.. చివరికి మనిషి శాశ్వతంగా నిష్క్రమించినప్పుడు., విలువలు ఎప్పుడూ సాపేక్షాలూ..సందర్భోచితాలూ..జీవితానుభవంతో మారే పాఠాలా? మనుషులనుబట్టి..వాళ్ళ వయసులనూ,వాళ్ళ సామాజిక ప్రయోజకతనూ..ముఖ్యంగా ఆర్థిక నేపథ్యాన్ని బట్టీ,ఆ వ్యక్తితో ఎవరికైనా ఒనకూరే లాభాన్నిబట్టీ విలువలు ఎప్పటికప్పుడు మారుతూ..సంబంధిత వ్యక్తులను శాసిస్తుంటాయా.? ఔను. సరిగ్గా అంతేనేమో..సందర్భాన్ని బట్టీ..అవసరాన్నిబట్టీ..మున్ముందు ఆ వ్యక్తితో సిద్ధించబోయే ప్రయోజనాలనుబట్టే మానవ సంబంధాలన్నీ., అరవై […]

తాత్పర్యం – 2. 264 రోజుల జీవితం

రచన: రామా చంద్రమౌళి ఒకటే ఎడతెగని వర్షం. రెండురోజులనుండి. నగరం తడిచి ముద్దయింది. అంతా నీటి వాసన ఎక్కడికి వెళ్ళినా. రోడ్లూ, చెట్లూ, లక్షలకొద్ది ఇండ్లూ. అన్నీ ఎంతో కాలం తర్వాత తనివితీరా అభ్యంగన స్నానం చేసినట్టు. అంతా శుభ్రంగా. , హోటల్ దుర్గా. రిసిప్షన్ కౌంటర్ లో ఏదో రాసుకుంటున్న మాలతి అప్రయత్నంగానే తలెత్తి చూచింది ఎదురుగా ఉన్న గోడ గడియారంవైపు. ఏడు గంటల పది నిముషాలు. రాత్రి. ‘టైం తెలియనే లేదు. డ్యూటీకి వచ్చి […]

ఒక నిద్ర .. ఒక మెలకువ

రచన: రామా చంద్రమౌళి శీతాకాలపు రాత్రి.. గాఢ నిద్ర. కలలు నక్షత్రాలుగా.. ఆకాశం ఒక సముద్రంగా.. పర్వతాలు ద్రవిస్తున్న హిమనగాలుగా శోభిస్తున్న స్వప్నంలో తేలిపోతున్న వేళ, తలుపులపై ఎవరో మెల్లగా తడ్తున్న చప్పుడు. పూలు రాలుతున్న సవ్వడా, వెన్నెల కురుస్తున్న మృధు ధ్వనా.. గాలి ప్రకృతితో సంభాషిస్తున్న నిశ్శబ్ద ప్రస్తారమా.? అసహనంగా.. చికాగ్గా లేచి.. తలుపులు తెరిచి చూస్తే., కళ్ళు మిరిమిట్లు గొలిపే సాంద్ర స్వర్ణకాంతితో చంద్రుడు.. ధగ ధగా మెరిసిపోతూ.. గుండ్రగా.. పరిపూర్ణంగా.. తామ్ర చంద్రుడు. […]

తాత్పర్యం

తెలుగు కథ గత దశాబ్ది కాలంలో పెను మార్పులకు లోనౌతూ తనను తాను పునర్నిర్వచించుకుంటూ, పునర్నిర్మించుకుంటూ వృద్ధిచెందతూ వస్తోంది. వర్ధమాన రచయితల అత్యాధునిక సామాజిక, అంతరిక, సంక్షుభిత సమస్యలతో పాటు లోతైన అవగాహన కలిగి తాత్విక నేపథ్యంతో కూడా భిన్న ఆలోచనలతో, భిన్న విలక్షణ చింతనతో, మనిషి వికాసానికి దోహద పడగల భిన్నమైన కథా వస్తువులను స్వీకరిస్తూ చాలా ధైర్యంగా సరికొత్త మానవీయ పార్శ్వాలను స్పృశిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు కథ బహుముఖీన విస్తరణతో తనదైన సొంత […]

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

March 2023
M T W T F S S
« Feb    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031