March 29, 2024

తామసి – 13

రచన: మాలతి దేచిరాజు CYBERABAD COMMISSIONER OFFICE ముందు ఆగింది ఏ.సి.పి. రుద్రాక్ష్ కార్. కారులో నుంచి దిగగానే, “గుడ్ మార్నింగ్ సార్!” సెల్యూట్ చేసాడు..పీ.సి. తనూ చేసాడు. లోపలికి నడుస్తుండగా ఎదురయ్యాడు సి..ఐ..సాగర్. “ఇంతకీ ఆ శవం ఎవరిదో ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా?” అడిగాడు రుద్రాక్ష్ “ఇప్పుడే ఫారెన్సిక్ రిపోర్ట్స్ వచ్చాయి సార్… మీ టేబుల్ మీద పెట్టాను.” అనగానే తన క్యాబిన్ లోకి తలుపు తోసుకుని వెళ్ళాడు రుద్రాక్ష్. టేబుల్ పైన ఉన్న ఫైల్ […]

తామసి – 12

రచన: మాలతి దేచిరాజు నసీమా, గౌతమ్ పెళ్ళి చేసుకోడానికి నిర్ణయించుకున్న కొన్ని రోజులకి. పెళ్ళి షాపింగ్ చేస్తున్నారు షీబా, నసీమా. “ఇంతకీ అబ్బాయిగారెక్కడ. ?” అడిగింది షీబా. “వస్తున్నాడు ఈ లోపు మనం చూద్దాం. ” అంది నసీమా. చీరలు సెలెక్ట్ చేస్తున్నారు ఇద్దరూ. ఒక చీర ఒంటికి చుట్టుకుని ఎలా ఉంది అనడిగింది నసీమా. “పర్ఫెక్ట్. ” వస్తూనే అన్నాడు గౌతమ్. షీబా తల తిప్పి చూసింది. “హే. గౌతమ్. ” అంది నసీమా. షీబా, […]

తామసి – 11

రచన: మాలతి దేచిరాజు షీబాతో ఆ ఘటన జరిగిన తర్వాత, గౌతమ్ ఆమెని కలవడం తగ్గించాడు. ఎదురుపడినా మొహం చాటేస్తున్నాడు. అది మరింత బాధ పెడుతోంది ఆమెని. రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళ మధ్య దూరం పెరుగుతోంది. చివరిసారిగా అడుగుదామని నిశ్చయించుకుంది. ‘టక్..టక్..టక్…’ తలుపు చప్పుడు విని గుమ్మం వైపు చూసాడు గౌతమ్. ఎదురుగా షీబా. “రా…” అన్నాడు. “ఎందుకొచ్చావనంటావ్ అనుకున్నా.” చెప్పింది తను. “తెలిసినవి అడగను నేను.” “కాని, తెలిసి కూడా పట్టించుకోవు! అంతేనా?” “పట్టించుకోకపోవడమే… […]

తామసి – 10

రచన: మాలతి దేచిరాజు అప్పటి నుంచీ గౌతమ్ నసీమాకి అడుగడుగునా తోడున్నాడు. తనకి ఏ అవసరం వచ్చినా ముందుండే వాడు. షీబాతో కలవడం కొంచెం తగ్గింది. తనతో ఉన్నప్పుడు కూడా ఎక్కువ నసీమా టాపిక్కే మాట్లాడేవాడు. (ఉద్దేశపూర్వకంగా కాదు.) నెమ్మదిగా షీబాకి దూరమవుతున్నాడు, నసీమాకి దగ్గరవుతున్నాడు గౌతమ్. కారణం తెలిసిన షీబా, ఓ రోజు నసీమాని కలవాలనుకుంది. అనుకున్నట్టే కలవటానికి తన స్కూల్ కి వెళ్ళింది. “మేడం మీ కోసం ఎవరో వచ్చారు…” చెప్పాడు ప్యూన్. టెక్స్ట్ […]

తామసి – 9

రచన: మాలతి దేచిరాజు కుక్కట్ పల్లి భ్రమరాంబ థియేటర్ చుట్టుపక్కల ప్రాంతం… ఒక టీ స్టాల్ దగ్గర బైక్ పార్క్ చేసి, ఏరియా అంతా ఒక చూపు చూసాడు గౌతమ్. షీబా చెప్పిన రెండే రెండు ఆనవాళ్ళు… ఒకటి: “రేయ్ మన ఏరియాకి పోదాం..రా…” “వద్దొద్దు… మన ఏరియాలో డ్రైనేజ్ పైప్ లైన్ వర్క్ జరుగుతుంది… ఏదైనా తేడా వస్తే దొరికిపోతాం… ఇక్కడే త్వరగా కానిచ్చేద్దాం.” అని వాళ్ళు మాట్లాడుకున్న మాటలు. రెండు: నలుగురిలో ఒకడికి… ఎడమ […]

తామసి – 8

రచన: మాలతి దేచిరాజు షాక్ నుంచి తేరుకున్నాడు ఇజాక్ కొన్ని సెకన్లకి..అతనికి ఏమీ అర్థం కావట్లేదు అసలు అలా ఎలా చేసాను అనుకున్నాడు. “బావా… నీ మనసులో ఏముందో ఈ పుస్తకం చెబుతోంది…” అంది తను బాధ నిండిన గొంతుతో. “నీ మొహం… ఫస్ట్ ఆ బుక్ ఏమిటో చూడు సరిగ్గా…”అన్నాడు. తను బుక్ చూసింది… మొహంలో చిన్నగా నవ్వు. అది ఏదో కథ అని, నసీమా అంటే అందులో క్యారెక్టర్ అని అప్పుడు అర్థం అయింది […]

తామసి – 7

రచన: మాలతి దేచిరాజు     నసీమా ఇంటి ముందు పోలీస్ జీప్ ఆగింది… పోలీస్ లు గబగబా దిగి ఇంట్లోకి చొరబడ్డారు. అత్తగారు యథావిధి… మామగారు కంగారు పడ్డాడు.. “రసూల్ మీ అబ్బాయేనా?” అడిగాడు ఎస్.ఐ. “మా అబ్బాయే… ఏమైంది సార్?” తత్తరపడుతూ అడిగాడు. ఇంతలో నసీమా వచ్చింది, వంటింట్లోనుంచి. “మీ అబ్బాయి క్రికెట్ బెట్టింగ్స్ లో డబ్బులు పోగొట్టుకుని డబ్బులు ఇవ్వకుండా పారిపోతూ ఒకతన్ని కత్తితో పొడిచాడు… ఇప్పుడతను హాస్పిటల్ లో చావు బతుకుల […]

తామసి – 6

  రచన: మాలతి దేచిరాజు   ఇంట్లో నసీమా,   అత్తగారు మాత్రమే ఉన్నారు. మామగారు తన కూతుర్ని చూడటానికి బందర్ వెళ్ళాడు.అత్తగారు భోంచేసి పడుకుంది ..నసీమా “మైదానం ” చదువుతోంది. జన్మకో శివరాత్రి అన్నట్టు ఎప్పుడో గాని ఇలా ఇంత తీరిక దొరకదు తనకి..ఇరవై రోజుల నుంచి చదువుతుంటే ఇప్పటికి ..క్లైమాక్స్ దగ్గరకొచ్చింది..”నా చేతి వేళ్ళు మీరా జుట్టు లో చొచ్చుకుపోయి ఉన్నాయి..” అని చదివింది టక్ …టక్..టక్ …అని తలుపు తడుతున్న శబ్దం. లేచి వెళ్లి […]

తామసి – 5

రచన: మాలతి దేచిరాజు మొహమ్మద్ ముష్తాక్ షాదీ ఖానా – (ముస్లిముల పెళ్ళి మండపం ) ఎలాంటి అలంకరణ లేదు భవనానికి. మెయిన్ గేట్ నుంచి భవనం లోపలికి వెళ్ళే దారి మాత్రం రంగురంగుల కర్టెన్లతో, పూలతో, చెమ్కీలతో (మెరుపుల మాలలు) అలంకరించి ఉంది. కింద పచ్చరంగు తివాచి పరిచి దానిపై పచ్చగడ్డి చల్లారు. బంధువుల హడావిడి, సమయం పగలు తొమ్మిది… మగ పెళ్ళివారు వచ్చి అప్పటికే అరగంట అయ్యింది. “ఆపా (అక్కా) ఛోటూ కో బులా […]

తామసి 4

రచన: మాలతి దేచిరాజు “అసలు సీమాతో మీరు ఎప్పుడు,ఎలా ప్రేమలో పడ్డారో చెప్తారా?” రుద్రాక్ష్ అడిగిన ప్రశ్నకి తన దగ్గర సమాధానం ఉంది.కానీ అది నమ్మశక్యంగా ఉండదని అతనికి తెలుసు. బట్ అదే నిజం అని కూడా తనకి తెలుసు. “నవల రాసేటప్పుడు ఆ పాత్ర కి బాగా కనెక్ట్ అయ్యాను…అలా క్రమేపి సీమా మీద ఇష్టం ఏర్పడింది.చివరికది ప్రేమగా మారింది.” చెప్పాడు. ఫక్కున నవ్వాడు రుద్రాక్ష్..నవ్వుతున్నాడు..ఇంకా..ఇంకా.నవ్వుతూనే ఉన్నాడు. గాంధీకి కోపం వస్తోంది కానీ చూపించలేడు. “ఎందుకు […]