June 19, 2024

దేవీ భాగవతం – 9

  రచన: వోలేటి స్వరాజ్యలక్ష్మి   7 వ స్కంధము, 28 వ కథ బ్రహ్మ సృష్టిని చేయుట   విష్ణు భగవానుని నాభి కమలమునుండి బ్రహ్మ ఉత్పన్నమయ్యెను. సృష్టి కార్యక్రమమును బ్రహ్మ మిక్కిలి తపమొనరించిన తరువాత భగవతి యొక్క వరముచే ఆరంభించెను. మొదట ఏడుగురు మానస పుత్రులు ఉదయించిరి. 1. మరీచి 2. అంగిరా 3. అత్రి 4. వశిష్టుడు 5. పులహుడు 6. క్రతువు 7. పులస్త్యుడు. బ్రహ్మయొక్క రోషమునుండి రుద్రుడు, ఒడినుండి నారదుడు, […]

దేవీ భాగవతం 8

రచన: స్వరాజ్యలక్ష్మి వోలేటి 6వ స్కంధము, 24వ కథ బ్రాహ్మణ, క్షత్రియవైరం ప్రాచీన కాలమున హైహయవంశ క్షత్రియులకు, భృగువంశజులైన బ్రాహ్మణులకు వైరము కలిగినది. హైహయ వంశమున కార్తవీర్యుడు అను రాజుండెను. అతనికి వేయి భుజములుండెను. అతనిని సహస్రార్జనుడు అని జనులు పిలువసాగిరి. అతడు రెండవ విష్ణువు వలె వెలుగు`చుండెను. ధర్మము గలవాడు. గొప్ప దానబుద్ధి కలవాడు. దత్తాత్రేయుడు అతనికి గురువు. అతని వలన రాజు మంత్రదీక్ష తీసుకొనెను. ఆ రాజుకు భగవతి జగదంబ ఇష్టదైవము. ధార్మికుడైన ఆ […]

దేవీ భాగవతం – 7

రచన: వోలేటి స్వరాజ్యలక్ష్మి 6వ స్కంధము 20వ కథ నహుషుని వృత్తాంతము వృత్రాసురుని వధ అనంతరము ఇంద్రుడు అమరావతి చేరెను. దేవతలందరు ఇంద్రుని నీచకార్యములు దూషించసాగిరి. త్వష్ట కుమారుని మరణవార్త విని దుఃఖించెను. కుమారునికి అంత్యక్రియలొనర్చి ‘‘ఇంద్రుడు భయంకర దుఃఖ మనుభవించుగాక! ఇది బ్రహ్మ రేఖ!’’ అని శాపమొసగి సుమేరు శిఖరము మీదకు వెళ్ళి తపమాచరించసాగెను. ప్రతి ఒక్కరు తాము చేసిన పాప, పుణ్యకార్యములకు తప్పక ఫలమనుభవించెదరు. ఇంద్రుని తేజస్సు క్షీణించసాగెను. దేవతలందరూ అతనిని నిందించుచుండిరి. ఇంద్రద్యుమ్నుడు, […]

దేవీ భాగవతం – 6

5 వ స్కంధము, 17వ కథ శుంభ నిశుంభ వృత్తాంతము దేవీ భగవతి యొక్క చరిత్రలు అతి ఉత్తమములు. ఆ కథలు సకల ప్రాణులకు సుఖమున యిచ్చెడివి. సకల పాపములు రూపుమాపును. పూర్వము శుంభుడు, నిశుంభుడు అను దానవ అన్నదమ్ములు ఉండెడివారు. మహాబలశాలురు. వారు బ్రహ్మను గూర్చి తపమును చేసి పది సంవత్సరములు యోగసాధనా నిరతులైరి. వారి తపస్సును మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై వరమును కోరుకోమనగా వారు అమరమునకై అర్ధించిరి. ఎవరి చేతను చావు లేకుండా ఉండాలని […]

దేవీ భాగవతం – 5

రచన: వోలేటి స్వరాజ్యలక్ష్మి   చతుర్థ స్కంధము 13వ కథ నర నారాయణుల పుట్టుక   ధర్ముడు బ్రహ్మపుత్రుడు. బ్రహ్మ హృదయమునుండి పుట్టిన వాడు. సత్య ధర్మ పరిపాలకుడు. దక్షప్రజాపతియొక్క10 మంది కన్యలను అతడు వివాహమాడెను. ఎందరో సంతానము కలిగిరి. హరి, కృష్ణుడు, నరుడు, నారాయణులను వారు ఉండిరి. హరి, కృష్ణుడు నిరంతరము యోగాభ్యాసము సల్పుచుండిరి. నర నారాయణులు హిమాలయములు చేరి బదరికాశ్రమము వద్ద పవిత్రస్థానమున తపమాచరించిరి. అట్లు వెయ్యి యేళ్ళు తపస్సుచేసిరి. వారి తేజస్సుతో జగమంతా […]

దేవీ భాగవతము – 4

రచన: వోలేటి స్వరాజ్యలక్ష్మి తృతీయ స్కంధము పదవ కథ సత్యవ్రతుని వృత్తాంతము బీజమంత్రము యొక్క ఫలము ఋషులడుగగా సూతుడిట్లు వివరించెను. జనమేజయ మహారాజు ‘‘ఐం’’ అను బీజమంత్రమును ఉచ్ఛరించుటవలన కలిగిన సుఫలమును గూర్చి వివరించమని వ్యాస మహర్షిని అడుగగా అతడిట్లు ఆ బీజమంత్రమును గూర్చి తెలుపసాగెను. ఇది పురాణములకు సంబంధించిన పవిత్రకథ. జమదగ్ని అను ఋషి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, యింద్ర, కుబేర, వరుణ, సూర్య, చంద్ర, త్వష్ట సకల గ్రహములు, వీటిలో దేనిని మనము అధికముగా […]

దేవీ భాగవతం – 4

రచన: వోలేటి స్వరాజ్యలక్ష్మి   ద్వితీయ స్కంధము ఎనిమిదవ కథ రురుని కథ   శాస్త్రమందు చెప్పబడిన విషయములను ఎప్పుడూ జారవిడువరాదు. వివేకవంతులెప్పుడునూ వారి వివేకము పైనే విశ్వాసము ఉంచుకోవాలి. మంత్రములు, మణులు, ఔషధములను సంపూర్ణముగా అభ్యాసము చేసినచో వాటితో కానిదేదియు లేదు. ప్రయత్నము అను దానిని తప్పక చేయవలెను. భృగుమహర్షి పత్ని పేరు పులోమ. వారి పుత్రుడు చ్యవన మహర్షి. వాని భార్య పేరు సుకన్య. ఆమె శర్వాతి అను రాజు కుమార్తె. చ్యవన, సుకన్యలకు […]

దేవీ భాగవతము 3

రెండవ స్కంధము ఆరవ కథ ఉపరిచర వసువు ఉపరిచర వసువు ఛేది దేశమును పాలించేవాడు. నిష్ఠాగరిష్ఠుడు. సత్యవ్రతుడు, ధర్మ ప్రభువు. అతనికి నలుగురు కుమారులు గలరు. వారిని వివిధ రాజ్యములకు రాజులుగా నియమించాడు వసువు. రాజుభార్య గిరిక. గొప్ప సౌందర్యవతి. ఒకసారి ఆమె ఋతుమతి అయిఉండగా రాజు పిత్రాజ్ఞచే వేటకు వెళ్ళవలసి వచ్చెను. భార్యయందు అనురక్తుడైన రాజుకు వీర్యస్ఖలనమయ్యెను. రాజు ఆ వీర్యమును ఒక వటపత్రము నందు భద్రపరచి దగ్గరలో ఉన్న ఒక గ్రద్దకు యిచ్చి భార్యకు […]

శ్రీదేవీభాగవత మహత్మ్యము . 2

రచన: ఓలేటి స్వరాజ్యలక్ష్మి మొదటి స్కందము మూడవ కథ రైవతుడను మనువు వృత్తాంతము ఈ కథను మిత్రావరుణుని నుండి ప్రకటితుడైన అగస్త్యమునికి శివకుమారుడైన స్కంధుడు వివరించినది. దేవీ భాగవత మహాత్మ్యము ఇందు చెప్పబడినది. ఋతువాకుడను ముని గలడు. అతడికి ఒక పుత్రుడుదయించెను. పుత్రోత్సాహము జరుపబడెను. అతడు రేవతీ నక్షత్రమందు నాల్గవ పాదమున జన్మించెను. అది గండాంతము అని చెప్పుదురు. చేయవలసిన సంస్కారాదులన్నీ ముని అతనికి జరిపించెను. జాతకర్మాదులు, ఉపనయన సంస్కారము చేసెను. అ పిల్లవాడు పుట్టినప్పటినుంచి తల్లిదండ్రులు […]

దేవీ భాగవతం – 1

రచన: వోలేటి స్వరాజ్యలక్ష్మి శుభమస్తు ఓం గణేశాయనమః అవిఘ్నమస్తు దేవీ స్తుతి శ్లో.1 నమో దేవ్యై మహాదేవ్యై శివాయైు సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయైు నియతాః ప్రణతాః స్మతామ్‌ శ్రీమద్దేవీ భాగవతము నందు వేదములు స్వయంగా భగవతీ దేవిని ఈ విధముగా స్తుతించినవి. శ్లో.2 నమో దేవి మహా మాయే విశ్వోత్పత్తి కరే రామ్‌। నిర్గుణే సర్వభూతేశి మాతః శంకర కామదే ॥ త్వం భూమిః సర్వభూతానాం ప్రాణః ప్రణవతాం తథా । ధీః శ్రీః […]