March 29, 2024

ధృతి – 3

రచన:మణి గోవిందరాజుల… “హే! ధృతీ కంగ్రాట్స్… శేఖరం గారినే మెప్పించావు హార్టీ కంగ్రాట్స్” అభినందనలు వెల్లువలా కురిశాయి. “ధృతీ, ఇక వెళ్దామా? బాగా అలసి పోయావు!” దినేష్ వచ్చి అడిగాడు. “అదేమీ కుదరదు.అంకుల్… ఇంత పెద్ద సక్సెస్ మేము ఎంజాయ్ చేయాల్సిందే. మేమొచ్చి దింపుతాము. ప్లీజ్! అంకుల్, మీరెళ్ళండి. మేము క్యాంటీనుకెళ్ళి ఏమన్నా తిని, తాగాక బయలుదేరుతాము” అప్పుడే వెళ్ళడానికి ఎవ్వరూ ఒప్పుకోలేదు. చేసేది లేక భార్యను, పిల్లల్ని తీసుకుని దినేష్ వెళ్ళిపోయాడు. అందరూ కలిసి పొలో […]

ధృతి – 2

రచన: -మణి గోవిందరాజుల “నాన్నా కాలేజీకి వెళ్ళొస్తాను” చెప్తూ గుమ్మం దాటబోతున్న కూతురి మీద గయ్యిమని లేచింది పూర్ణ. “చచ్చిందాకా చాకిరీ నాతో చేయించుకుని కాలేజికి వెళ్ళేప్పుడు తల్లికి చెప్పాలన్న జ్ఞానం కూడా లేదు.పెంపకం సరిగ్గా లేకపోతే ఇలానే ఏడుస్తుంది… అసలు గారాబం చేసి చెడగొడుతున్న తండ్రిననాలి” “ఇదిగో! పెంపకం సరిగా లేదని మా అమ్మనను పడతాను. అంతే కానీ, మా నాన్న నంటే ఊర్కునేది లేదు” తనూ అంతే గయ్యిమని లేచింది ధృతి. “తల్లీ కూతుళ్ళిద్దరూ […]

ధృతి – 1

రచన: మణి గోవిందరాజుల వణుకుతున్న చేతులతో చీటీ ని గట్టిగా పట్టుకుంది ధృతి. “హే! ధృతీ ! తొందరగా తెరువు. ఏమి రాసి వుందో మేము చూడాలి…ధృతి…ఓపెన్ ద స్లిప్…ధృతి…ఓపెన్ ద స్లిప్… రిధమిక్ గా అరవసాగారు చుట్టు వున్న స్టూడెంట్స్. మిగతా విద్యార్థులంతా అరుపులతో ఎంకరేజ్ చేయసాగారు. “రాజారాం మోహన్ రాయ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్” లో ఆ రోజు రాగింగ్ జరుగుతున్నది. రాగింగ్ ని ప్రభుత్వం బాన్ చేసినా, సరదాగా చేసుకుంటాము, వయొలెన్స్ లేకుండా […]