June 25, 2024

వాట్సాప్ వాట్సాప్ వల్లప్పా – 2 (సామాజిక పద్యనాటకం)

రచన: తుమ్మూరి రామ్మోహన్ రావు 2 వ రంగము (స్కూటర్ స్టాండు వేసి షాపులోకి వెళ్తుంటే చిన్ననాటి మిత్రుడు బ్రహ్మానందం ఎదురయ్యాడు) బ్రహ్మ :- ఒకే సుందరదాసూ ఎన్నాళ్లయ్యిందిరా నిన్ను కలిసి. బాగున్నావా? చెల్లెమ్మ బాగుందా? అదేదో ప్రైవేటు బళ్లో తెలుగు చెప్తుందని చెప్పావు క్రితంసారి కలిసినప్పుడు. ఏమైనా సందేహాలుంటే నన్నడగమని కూడా చెప్పినట్లు గుర్తు. దాసు: అర్జునుడు బాణం మీద బాణం రెండు చేతులతో వేసినట్టు వేసి అడిగిన వాటికి జవాబులు చెప్పకముందే ఇంకేమిటి సంగతులంటావేమిట్రా […]

సుప్రభాత పద్యములు

రచన: టి.వి.యెల్. గాయత్రి సీసము // పసుపు వర్ణపు వెల్గు బాటలన్ జల్లుచు ప్రాగ్దిశ నుదయించె భానుడిలను కువకువ లాడుచు గూళ్లను వదిలిన పక్షి గణంబుల పాట వినుచు వడివడిమేల్కొని వయ్యారి భామలు పెరుగును జిల్కగ ప్రీతి తోడ పశువుల తోడ్కొని పాలేళ్ళు ముదముగ నాగళ్లు పట్టుచు నడచి రపుడు // తేట గీతి పల్లె నిద్దుర లేచెను పరవశించి విరులు వెదజల్లు పుప్పొడి విందు చేయ తేటి గుంపుల సందడి తేరి చూచి నవ్వు కొనుచును […]

హిమవత్పద్యములు 1

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు మన భూమిపైన ఉత్తర ప్రాంతాలలో, ముఖ్యముగా అమెరికాలో, కనడాలో, యూరోపులో జనవరి, ఫిబ్రవరి నెలలలో ఎక్కువగా మంచు కురుస్తుంది. మంచు (snow స్నో) అంటే మెల్లగా ఘనీభవించిన నీరు. మేఘాలలోని నీళ్లు నేలను తాకడానికి ముందు వాయుమండలములో స్ఫటికరూపములో మారుతుంది. అంటే ఉష్ణోగ్రత సున్న డిగ్రీల సెల్సియస్ (అనగా -32 డిగ్రీల ఫారన్‌హైట్) కంటె తక్కువ ఉంటుంది. నేలపైన మళ్లీ నీరుగా మారకుండా ఉండాలంటే దాని ఉష్ణోగ్రత కూడ సున్న […]

శ్రీ కాళహస్తీశ్వర శతకం నుండి పదకొండు పద్యాలు

రచన: శారదా ప్రసాద్ మిత్రులకు నమస్కారములతో, కొంతమంది శ్రేయోభిలాషులు, హితులు మిత్రులు, కార్తీక మాస సందర్భంలో ‘శ్రీ కాళహస్తీశ్వర శతకం’నుండి కనీసం పది పద్యాలను, వాటి అర్ధాలను తెలియచేయమని ఆశీర్వచనపూర్వకంగా ఆదేశించారు. దానిని శివాజ్ఞగా భావించి, కొన్ని పద్యాలను గురించి చెప్పటానికి ప్రయత్నిస్తాను. విశేషమేమంటే, నేను శ్రీకాళహస్తిలో అయిదు సంవత్సరాలు పనిచేసాను. ఆలయంలో గోడలపై ‘శ్రీ కాళహస్తీశ్వర శతకం’లోని పద్యాలన్నిటినీ చెక్కారు. అలా, నేను ఆ పద్యాలన్నిటినీ అతి జాగ్రత్తగా చదివాను. చాలావరకు నోటికి వచ్చు. అర్ధాలను […]