June 19, 2024

ప్రాయశ్చితం – 8

రచన: గిరిజారాణి కలవల మరునాడు సత్యంతో కలిసి సురేంద్ర తన ఊరికి ప్రయాణం అయాడు. ఊరు సమీపిస్తున్న కొద్దీ సురేంద్రలో తెలియని అలజడి. పైరు పొలాల మీద నుంచి వీచే చల్లని గాలి, తన తండ్రి స్పర్శలాగా మృదువుగా అనిపించింది. ఆ మట్టి, తన మూలాలలని తెలియచేస్తున్నట్టే తోచింది. ఊరి మొదట్లోనే చెరువు. అక్కడే కదూ? తనకి తండ్రి ఈత నేర్పించినది. అక్కడే కదూ జీవితంలో ఎలా ఎదగాలనేదీ పాఠాలు నేర్పించినదీ? బడి ముందున్న వేపచెట్టు తనని […]

ప్రాయశ్చిత్తం – 6

రచన: గిరిజారాణి కలవల అమెరికా నుంచి ఇండియాకి ఇరవై నాలుగు గంటల ప్రయాణం. కంటిమీద కునుకు లేదు. సురేంద్ర తలపుల నిండా తండ్రే మెదులుతున్నాడు. ఢిల్లీలో విమానం దిగి మరో రెండు గంటలలో, ముందుగా బుక్ చేసుకున్న కాశీ ఫ్లైట్ అందుకున్నాడు సురేంద్ర. పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ మహానగరం. ముక్తి క్షేత్రం. గంగానది ఒడ్డున ఎక్కడెక్కడ నుంచో వచ్చినవారు, తమతమ పితృ దేవతలకు, అక్కడ బ్రాహ్మణులు చేయిస్తున్న శ్రాద్ధకర్మలని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు. అక్కడే ఒక […]

ప్రాయశ్చిత్తం – 5

రచన: గిరిజారాణి కలవల గరాజ్ లో కారు పార్కింగ్ చేసి లోపలికి రాగానే హాల్లో టివీ చూస్తున్న కొడుకు రుషి, “ఎక్కడకి వెళ్ళావు డాడీ! ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఫ్రెష్ అయి వస్తే డిన్నర్ చేద్దాం. విన్నీ బయట తినేసి వస్తానంది.” అన్నాడు. ఆ మాటలలో తల్లి ప్రసక్తే లేదు. నిట్టూరుస్తూ సురేంద్ర తన రూంలోకి వెళ్లి స్నానం చేసి నైట్ డ్రస్ వేసుకుని వచ్చేసరికి, రుషి రెడీమేడ్ చపాతీలని పెనం మీద కాల్చి తండ్రికీ, […]

ప్రాయశ్చిత్తం – 4

రచన: గిరిజారాణి కలవల ఆలోచనల నుండి బయటకి వచ్చి చుట్టూ చూసాడు. పార్క్ లో జనం పల్చబడ్డారు. చీకట్లు నెమ్మదిగా ముసురుకుంటున్నాయి.తను కూడా లేచి ఇంటి దారి పట్టాడు. పార్క్ లో ఇందాక విన్న మాటలే చెవిలో గింగిరాలు తిరుగుతున్నాయి. అన్యమనస్కంగా కారు నడుపుతున్న సురేంద్ర ఆలోచనలకి , ఫోన్ రింగ్ బ్రేక్ వేసింది. తనతో పాటు పని చేసే రమణ వద్ద నుంచి ఫోన్. లిఫ్ట్ చేసి, “ హలో! రమణా! చెప్పరా?” అన్నాడు. “హలో! […]

ప్రాయశ్చితం – 3

రచన: గిరిజా రాణి కలవల ఇండియా నుంచి వచ్చిన ఫోన్ కాబోలు, ఆ విశ్వం అనే వ్యక్తితో … ఈయన మాట్లాడే మాటలు సురేంద్ర చెవిన పడుతున్నాయి. ఆ మాటలలో ఏదో తెలియని వ్యధ, ఆ గొంతులో బాధ తొణికిసలాడడంతో… పక్కవారి సంభాషణ వినడం తప్పు అనిపించినా కూడా, ఆసక్తితో వినసాగాడు. అటువైపు ఆ విశ్వం ఏమని అన్నారో ఏంటో కానీ, “ఏం చెప్పమంటావురా విస్సూ? చెపితే, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడినట్లేగా? ఇది అందరికీ […]

ప్రాయశ్చితం – 2

రచన: గిరిజారాణి కలవల గెలుపు… గెలుపు…. గెలవాలి… తానే గెలవాలి. మరెవరూ గెలవకూడదు. అది ఆట అయినా, చదువు అయినా ఏదైనా సరే తనే మొదటి స్థానంలో వుండాలనుకునేవాడు సురేంద్ర. ఒకసారి స్కూల్లో పరుగుపందెంలో, తన క్లాస్ మేట్ రాజేష్ తనని దాటి ముందుకు వెళ్ళి మొదటి బహుమతి పొందడం, సురేంద్ర జీర్ణించుకోలేకపోయాడు. ఇంటికి వచ్చాక అన్నం కూడా తినకుండా ఏడుస్తూ కూర్చున్నాడు. సంగతి తెలిసిన తండ్రి, సురేంద్రని దగ్గరకు తీసుకుని, “ఇంతదానికి నువ్వు ఏడిస్తే ఎలా? […]

ప్రాయశ్చితం – 1 (నవల)

రచన: గిరిజారాణి కలవల అమెరికాలోని సియాటిల్ నగరం. అది ఎండాకాలం. రాత్రి ఎనిమిది అయినా కూడా ఇంకా సూర్యాస్తమయం అవలేదు. అదే మనకైతే ఇండియాలో సాయంత్రం ఏ ఐదు గంటలో అయినట్టు వుంటుంది. చీకట్లు ముసురుకోవడానికి మరో అరగంటైనా పడుతుంది. అక్కడ ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ మేనేజర్ సురేంద్ర. ఇంటి నుండే ఆఫీసు పని చూసుకుంటూ వుంటాడు. ఆ రోజుకి చేయాల్సిన పని పూర్తయినట్లే. సిస్టమ్ షట్ డౌన్ చేసి, బద్ధకంగా వళ్ళు విరుచుకుని, […]